
న్యూఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో తమ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఫిబ్రవరి పదో తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులో కలగజేసు కోబోమని బెంచ్ స్పష్టంచేసింది. గతంలో కర్ణాటక హైకోర్టు సీబీఐ దర్యాప్తుపై స్టేను పలుమార్లు పొడిగించడం తెల్సిందే.