సీబీఐ మాజీ అధిపతి జోగిందర్‌ కన్నుమూత | The former head of the CBI, Joginder passes away | Sakshi
Sakshi News home page

సీబీఐ మాజీ అధిపతి జోగిందర్‌ కన్నుమూత

Published Sat, Feb 4 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

సీబీఐ మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌సింగ్‌(77) శుక్రవారం కన్నుమూశారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు.

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌సింగ్‌(77) శుక్రవారం కన్నుమూశారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. మాజీ ఎంపీ మనీశ్‌ తివారి జోగిందర్‌ మృతి చెందారన్న విషయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశారు. సుదీర్ఘ అనారోగ్యంతో జోగిందర్‌ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో 1961 బ్యాచ్‌కు చెందిన, కర్నాటక కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన జోగిందర్‌ సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.

పదవీ విరమణ తరువాత ఆయన 25కు పైగా పుస్తకాలు రచించారు. ఓ సందర్భంలో ‘ది హిందూ’ కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ...పలువురు ప్రముఖుల ప్రమేయమున్న దాణా కుంభకోణం విచారణ జరుగుతున్నపుడు తనను బుట్టలో వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement