bofors
-
బోఫోర్స్ గన్స్‌తో చుక్కలు..
శ్రీనగర్ : భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం భోఫోర్స్ శతఘ్నులను ప్రయోగించింది. జమ్మూ కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు తెగబడ్డ బ్యాట్ బలగాలను భోఫోర్స్ గన్స్‌తో భారత సైన్యం వెంటాడి తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. బ్యాట్ శిబిరాలను టార్గెట్ చేస్తూ భోఫోర్స్ గన్స్‌తో భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు బ్యాట్ బృందాలు ఐదు సార్లు చేసిన చొరబాటు యత్నాలను భారత సేనలు భగ్నం చేశాయి. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి వచ్చేందుకు బ్యాట్ కమెండోలు ప్రయత్నించగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతోంది. పాకిస్తాన్ సైన్యంలో మాటువేసిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత్ భగ్నం చేస్తోందని నార్తన్ కమాండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
భోఫోర్స్ శతఘ్నులను ప్రయోగం
-
27 ఏళ్లకు బోఫోర్స్‌పై పీఏసీ నివేదిక!
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు ఒప్పందాన్ని 27 ఏళ్లుగా పరిశీలిస్తున్న ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి చెందిన ఓ ఉప సంఘం.. ఎట్టకేలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సమయంలోనే తన నివేదికకు తుదిరూపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. బోఫోర్స్ ఒప్పందంపై కాగ్ 1989–90లో ఇచ్చిన నివేదిక అప్పటి నుంచి ఆరుగురు సభ్యుల పీఏసీ ఉప సంఘం వద్ద పెండింగ్‌లోనే ఉంది. కాగ్ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాక, దానిని పరిశీలించడమే పీఏసీ ప్రధాన విధి. బీజేడీకి చెందిన భర్తృహరి మహతబ్ ఈ రక్షణ వ్యవహారాల ఉప సంఘానికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందం గురించి సమగ్ర వివరాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ అంశం 27 ఏళ్లు ఆలస్యమైందని ఉపసంఘంలోని ఓ సభ్యుడు తెలిపారు. తమ నివేదిక సమగ్రంగా, ఒప్పందం గురించి ఉన్న అపోహలను తొలగించేలా ఉంటుందన్నారు. ఉప సంఘం ఈ నివేదికను రూపొందించిన తర్వాత దాన్ని పీఏసీ ప్రధాన కమిటీకి పంపుతారు. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రధాన కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. -
మూడు దశాబ్దాల భోఫోర్స్
న్యూఢిల్లీ : భోఫోర్స్.. మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఈ పదం మాత్రం రాజీవ్‌గాంధీని, కాంగ్రెస్‌ను విడచి పెట్టడం లేదు. తాజాగా భోఫోర్స్ కుంభకోణంపై విచారణను అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అణిచివేసిందనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. భోఫోర్స్ కుంభకోణంపై ప్రయివేట్ డిటెక్టివ్ హైఖేల్ హెర్ష్‌మన్ పేర్కొన్న వాస్తవాలు-పరిస్థితులను పరిశీలిస్తామని బుధవారం సీబీఐ ప్రకటించింది. అమెరికాలోని ఫైర్ఫాక్స్ డిటెక్టివ్ ఏజెన్సీ అధ్యక్షుడైన మైఖెల్ హెర్ష్‌మన్ తాజాగా ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ గాంధీకి స్విస్ బ్యాంక్ ఖాతా గురించి పేర్కొన్నారు. అంతేకాక గత వారం జరిగిన ప్రయివేట్ డిటెక్టివ్‌ల సమావేశంలోనూ భోఫోర్స్ స్కామ్‌లో నల్లధనం స్విస్ ఖాతాలకు ఎలా చేరిందో ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మరోసారి భోఫోర్స్ స్కామ్‌పై సీబీఐ పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. 30 ఏళ్ల భోఫోర్స్ 1986 మార్చి 24 : భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్ గన్స్ కొనుగోలుకు స్వీడన్‌కు చెందిన ఏబీ భోఫోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.1,437.72 కోట్లు. 1987 ఏప్రిల్ 16 : భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి భోఫోర్స్ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్లు తొలిసారి స్వీడిన్ రేడియో ప్రకటించింది. 1987 ఏప్రిల్ 20 : ఈ ఒప్పందంలో ఎవరు మధ్యవర్తిగా లేరు, ఎవరికీ ముడుపులు చెల్లింపులు చేయలేదని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ లోక్‌సభలో ప్రకటన. 1987 ఆగస్టు 6 : బీ శంకరానాంద్ నేతృత్వంలో భోఫోర్స్ ముడుపులపై విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు ఫిబ్రవరి 1988 : భోఫోర్స్ కుంభకోణంపై నిజానిజాలు తెలుసుకునేందుకు భారతీయ విచారణాధికారుల స్వీడన్ పర్యటన 1988 జులై 18 : భోఫోర్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదకను పార్లమెంట్‌కు సమర్పించింది. నవంబర్ 1989 : సాధారణ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరాజయం. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు 1990 జనవరి 22 : భోఫోర్స్ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదు.. విచారణకు ప్రభుత్వం ఆదేశం 1990 ఫ్రిబరి 7 : భోఫోర్స్ స్కామ్‌పై స్విస్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారిక లేఖ 1992 ఫిబ్రవరి 17 : భోఫోర్స్ స్కామ్‌లో ఎవరెవరికి ఎంత ముడుపులు ముట్టాయో ప్రకటించిన ప్రముఖ జర్నలిస్ట్ అండర్సన్. 1993 జులై 30 : భోఫోర్స్ కేసులో కీలక పాత్రధారి ఒట్టావియో ఖత్రోచి దేశం విడిచి వెళ్లిపోయాడు. మళ్లీ ఏనాడు దేశంలోకి అడుగు పెట్టలేదు. 1997 ఫిబ్రవరి 17 : ఖత్రోచి మీద ఎన్బీడబ్ల్యూ రెడ్ కార్నర్ నోటీస్ జారీ. 1998 డిసెంబర్ 8 : ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ ఖాతాలకు ముడుపుల మళ్లింపు గురించి స్విస్ ప్రభుత్వానికి రెండో లేఖ రాసిన భారత్. 1999 అక్టోబర్ 22 : ఖత్రోచీపై ఛార్జిషీట్ ధాఖలు 2000 : తనపై ఉన్న అరెస్ట్ వారెంట్‌ను కొట్టివేయాలని సుప్రీం కోర్టును కోరిన ఖత్రోచి. ముందు సీబీఐ విచారణకు హాజరు కండి. తరువాత పరిశీలిద్దం అన్న సుప్రీం కోర్టు. 2000 మార్చి 18 : భోఫోర్స్ విచారణ కోసం తొలిసారి భారత్‌కు వచ్చిన చద్దా. 2000 అక్టోబర్ 9 : భోఫోర్స్ కుంభకోణంలో హిందూజా సోదరులను చేర్చుతూ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ 2000 డిసెంబర్ 20 : ఖత్రోచి మలేసియాలో అరెస్ట్. మలేషియన్ సెషన్స్ కోర్టులోనే విచారణ 2003 జులై 21 : కత్రోచి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ 2004 ఫిబ్రవరి 4 : రాజీవ్ గాంధీ, డిఫెన్స్ సెక్రెటరి భట్నగర్ మృతి చెందడంతో చార్జిషీట్‌ను వారి పేర్ల తొలగింపు 2005 మార్చి 31 : హిందూజా, ఏబీ భోఫోర్స్ల విచారణకు క్వాష్ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్ట్ అనుకూలంగా తీర్పు. 2005 సెప్టెంబర్ 19 : ఢిల్లీ హైకోర్ట్ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన సీబీఐ. విచారణ కొనసాగించవచ్చని తేల్చి చెప్పిన సుప్రీం. 2006 జనవరి 16: ఫ్రీజింగ్ అకౌంట్ల లావాదేవీలపై పూర్తి సమాచారాన్ని చెప్పాలని సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. 2007 ఫిబ్రవరి 6 : ఖత్రోచిని అర్జెంటీనాలో అరెస్ట్ చేసిన పోలీసులు. భారత అభ్యర్థనను తోసిపుచ్చిన అర్జెంటీనా. 2009 ఏప్రిల్ : ఖత్రోచిమీద రెడ్ కార్నర్ నోటీస్ ఉపసంహరించుకున్న సీబీఐ 2009 అక్టోబర్ : ఖత్రోచి మీద కేసును ఉసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరిన సీబీఐ. అదే సమయంలో లండన్ బ్యాంక్‌లోని ఖత్రోచి లావాదేవీలపై డాక్యుమెంట్స్ కోసం అగర్వాల్ అనేవ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు. 2010 డిసెంబర్ 31 : ఖత్రోచీ, విన్ చద్దాలు పన్ను ఎగవేతపై ఇన్‌కంట్యాక్స్ ట్రిబ్యునల్ ఆగ్రహం. కేసు నమోదుకు ఆదేశం. 2011 పిబ్రవరి 9 : భోఫోర్స్ స్కామ్‌పై సీబీఐ తీరును విమర్శించిన ఇన్ఫర్మేషన్ కమిషన్. 2012 ఏప్రిల్ 24 : భోఫోర్స్ కుంభకోణంపై మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అమితాబ్ బచ్చన్ల పాత్ర ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్వీడన్ ప్రభుత్వం ప్రకటన. 2013 జులై 13 : భోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఖత్రోచి మరణం. 2017 జులై 14 : సుప్రీంకోర్ట్ లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని సీబీఐ ప్రకటన. 2017 అక్టోబర్ 18 : ప్రైవేటు డిటెక్టివ్ మైఖేల్ హెర్షమ్ పేర్కొన్న బోఫోర్స్ కుంభకోణం గురించి వాస్తవాలను, పరిస్థితులను పరిశీలిస్తానని సిబిఐ ప్రకటన. -
బోఫోర్సు పేరుతో బీజేపీ కుట్ర
పొంగులేటి సుధాకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై బోఫోర్సు పేరుతో బురద జల్ల డం ద్వారా బీజేపీ రాజకీయ కుట్రకు తెరలేపిందని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమ ర్శించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లా డుతూ హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే కుట్రలో భాగమే బోఫోర్సు ప్రస్తావన అని అన్నారు. కుట్రపూరిత, సంకుచిత రాజ కీయాలకు నిరసనగా ఆగస్టు 9న రాజీవ్ స్మృతివ నమైన శ్రీపెరంబుదూరు వద్ద మౌనదీక్ష చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. -
30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి..
-
30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి..
న్యూఢిల్లీ: ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి కొత్త శతఘ్నులు చేరాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లోని శత్రువులను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న వీటిని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అమెరికా నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 145 శతఘ్నులను కొనుగోలు చేయగా వాటిల్లో రెండు నేడు భారత్‌కు చేరుకున్నాయి. ఇవి దాదాపు 30 కిలో మీటర్ల లక్ష్యాన్ని సైతం అవి తుత్తునీయలు చేస్తాయి. రెండు ఎం-777 ఆల్ట్రా-లైట్ హొవిట్జర్ ఆయుధాలు నేడు భారత్‌కు చేరుకున్నట్లు భారత ఆర్మీ ప్రతినిధులు ఒక ప్రకటనలో చెప్పారు. 1980లో తొలిసారి స్వీడన్ నుంచి బొఫోర్స్ శతఘ్నులను కొనుగోలు చేసిన భారత్ ఆ తర్వాత వీటిని తిరిగి ఆర్మీలోకి తీసుకోలేదు. భారత ఆర్మీ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు వీటిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకోని కేంద్రానికి ప్రతిపాదన చేయగా గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో వీటి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమెరికాతో మొత్తం 700 మిలియన్ డాలర్లతో ఈ ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. -
సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్‌సింగ్(77) శుక్రవారం కన్నుమూశారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. మాజీ ఎంపీ మనీశ్ తివారి జోగిందర్ మృతి చెందారన్న విషయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు. సుదీర్ఘ అనారోగ్యంతో జోగిందర్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో 1961 బ్యాచ్‌కు చెందిన, కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జోగిందర్ సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. పదవీ విరమణ తరువాత ఆయన 25కు పైగా పుస్తకాలు రచించారు. ఓ సందర్భంలో ‘ది హిందూ’ కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ...పలువురు ప్రముఖుల ప్రమేయమున్న దాణా కుంభకోణం విచారణ జరుగుతున్నపుడు తనను బుట్టలో వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు. -
‘బోఫోర్సు’ తీర్పు సవాలుకు అనుమతి రాలేదు: సీబీఐ
న్యూఢిల్లీ: బోఫోర్స్ ముడుపుల చెల్లింపుల కేసులో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తరువాత అప్పీలు చేయడానికి తనకు అనుమతి లభించలేదని సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ లాయర్ అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. 2005, మే 31 నాటి తీర్పును సవాలు చేయడానికి సీబీఐకి అనుమతి రాలేదని సంస్థ లాయర్ గురువారం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అప్పీలుకు నిరాకరించిన కేసును తిరిగి కొనసాగిస్తానని అగర్వాల్ చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చాలా అసంబద్ధంగా ఉందని, దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ తీర్పును సవాలు చేయడానికి సీబీఐ ముందుకు రాకపోవడంతో అప్పీలు చేసేందుకు అగర్వాల్‌కు సుప్రీంకోర్టు 2005లోనే అనుమతిచ్చింది. -
స్కాం అని ఏ కోర్టూ చెప్పలేదు
బోఫోర్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: బోఫోర్స్... కుంభకోణం అని ఇప్పటివరకు దేశంలో ఏ కోర్టూ చెప్పలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. దీనిపై మీడియానే విచారణ చేసింది తప్ప.. ఒక్క కోర్టులోనూ స్కాంగా నిరూపితం కాలేదని స్వీడన్ పత్రిక ‘డాగెన్స్ నిహెట్టర్’కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బోఫోర్స్ తుపాకుల కొనుగోలుపై మీడియానే విచారణ చేపట్టిందా అని అడగ్గా.. ‘అది స్కాం అని ఇప్పటిదాకా కోర్టులేవీ చెప్పలేదు. బోఫోర్స్ తెరపైకి వచ్చాక చాలా ఏళ్లపాటు నేనే రక్షణశాఖ మంత్రిగా ఉన్నా. సైనిక జనరల్స్ అందరూ ఆ తుపాకులు అత్యుత్తమమైనవని చెప్పారు. వాటిని నేటికీ భారత సైన్యం వినియోగిస్తోంది’ అని ఆయన వివరించారు. కాగా, బోఫోర్స్ తుపాకులు నాణ్యమైనవే అని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. -
బోఫోర్స్ గన్స్ నాణ్యమైనవే!
న్యూఢిల్లీ: బోఫోర్స్ గన్స్ నాణ్యతలో అద్భుతమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా లేవనెత్తడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరిక్కర్ పై విధంగా స్పందించారు. స్వీడన్ కు చెందిన బోఫోర్స్ గన్స్ నాణ్యతలో మేటి అని ఆయన తెలిపారు. అయితే ప్రణబ్ వ్యాఖ్యలపై మాట్లాడానికి పరిక్కర్ నిరాకరించారు. దానిపై ఏమీ మాట్లాడుదలుచుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఆ గన్స్ నాణ్యతపై అడిగితే మాత్రం అవే అద్భుతమైనవిగా చెబుతానని పరిక్కర్ చమత్కరించారు. స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో రాష్ట్రపతి బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదని.. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామని ప్రణబ్ తెలిపారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నాన్న సంగతిని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1986లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం మరోసారి తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. -
బోఫోర్స్ కుంభకోణం అని ఏ కోర్టు నిర్ధారించలేదు: ప్రణబ్
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన 'బోఫోర్స్' వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బోఫోర్స్ ఒప్పందం కుంభకోణం తేనెతుట్టను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కదిలించారు. బోఫోర్స్ ఒప్పందం ...కుంభకోణం అని నిర్థారాణ కాలేదని ఆయన అన్నారు. బోఫోర్స్ ఒప్పందం స్కాం అని మీడియాలోనే వచ్చిందని ప్రణబ్ పేర్కొన్నారు. స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదన్నారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నానన్నారు. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామన్నారు. స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. 'బోఫోర్స్' దెబ్బకు 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో ఖత్రోకీ ఆరోపణలు ఎదుర్కొన్న ఖత్రోకీ, అరెస్టును తప్పించుకునేందుకు 1993లో భారత్‌ను విడిచి పారిపోయాడు. అతడి అప్పగింత కోసం సీబీఐ రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. తొలుత 2002లో మలేసియాను, తర్వాత 2007లో అర్జెంటీనాను ఖత్రోకీ అప్పగింత కోసం కోరినా ఫలితం లేకపోయింది. 2013 జులైలో ఇటలీలోని మిలాన్ నగరంలో అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వ్యవహారంపై బీజేపీ... మరోసారి సీబీఐ దర్యాప్తుకు అప్పట్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.