శ్రీనగర్ : భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం భోఫోర్స్ శతఘ్నులను ప్రయోగించింది. జమ్మూ కశ్మీర్‌లోని కెరన్ సెక్టార్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు తెగబడ్డ బ్యాట్ బలగాలను భోఫోర్స్ గన్స్‌తో భారత సైన్యం వెంటాడి తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. బ్యాట్ శిబిరాలను టార్గెట్ చేస్తూ భోఫోర్స్ గన్స్‌తో భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు బ్యాట్ బృందాలు ఐదు సార్లు చేసిన చొరబాటు యత్నాలను భారత సేనలు భగ్నం చేశాయి.
పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి వచ్చేందుకు బ్యాట్ కమెండోలు ప్రయత్నించగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతోంది. పాకిస్తాన్ సైన్యంలో మాటువేసిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత్ భగ్నం చేస్తోందని నార్తన్ కమాండ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment