former CBI Director
-
సీబీఐ మాజీ చీఫ్‌కు సీబీఐ షాక్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని సీబీఐ విచారించనుండటం, ఆయనపై కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. కొందరు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు బొగ్గు కుంభకోణం కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సీబీఐ.. రంజిత్‌పై కేసు నమోదు చేసింది. -
సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్‌సింగ్(77) శుక్రవారం కన్నుమూశారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. మాజీ ఎంపీ మనీశ్ తివారి జోగిందర్ మృతి చెందారన్న విషయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు. సుదీర్ఘ అనారోగ్యంతో జోగిందర్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో 1961 బ్యాచ్‌కు చెందిన, కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జోగిందర్ సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. పదవీ విరమణ తరువాత ఆయన 25కు పైగా పుస్తకాలు రచించారు. ఓ సందర్భంలో ‘ది హిందూ’ కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ...పలువురు ప్రముఖుల ప్రమేయమున్న దాణా కుంభకోణం విచారణ జరుగుతున్నపుడు తనను బుట్టలో వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు. -
సీబీఐ చరిత్రలో తొలిసారిగా..
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు విచారణలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు సీబీఐని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని, సీబీఐ చీఫ్ విచారించనుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రంజిత్‌ను విచారించే బృందానికి కొత్త సీబీఐ చీఫ్ అలోక్ వర్మ ఇంచార్జీగా వ్యవహరిస్తారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించినట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ గతంలో నివేదిక సమర్పించింది. -
కేవీఆర్ కారణంగానే కేసీఆర్ రాజీనామా
* దానం యూటర్న్‌తో విజయరామారావుపై టీఆర్ఎస్ కన్ను * టీడీపీకి రాజీనామా చేసిన విజయరామారావు హైదరాబాద్: చంద్రబాబు లెక్క ప్రకారం... ఒకప్పుడు విజయరామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రిపదవి దక్కలేదు. సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావును మంత్రిమండలిలోకి తీసుకున్నానన్న కారణం చూపి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి ఇవ్వకుండా కేసీఆర్‌ను దూరం పెట్టారు. కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి సరిపెట్టారు. దాంతో అసంతృప్తికి గురైన కేసీఆర్ ఏకంగా పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఏర్పాటు చేశారు. ఇదంతా 2001 లో జరిగిన రాజకీయం. తటస్థులను పార్టీలోకి ఆహ్వానిస్తూ అప్పట్లో చంద్రబాబు సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన విజయరామారావును పార్టీలో చేర్చుకుని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఆ స్థానం నుంచి గెలిచిన విజయరామారావును చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ను కాదని విజయరామరావును కేబినేట్లోకి తీసుకుని రోడ్లు భవనాల శాఖ అప్పగించారు. ఆ పరిణామమే అప్పట్లో టీడీపీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. కొంతకాలం వేచిచూసినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రిపదవులు ఇవ్వలేనన్న కారణం చూపించి కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్‌పదవికి పరిమితం చేశారు. ఆ పరిణామమే టీఆర్ఎస్ ఆవిర్భవానికి కారణమైంది. అన్ని పదవులకు రాజీనామా చేసిన 2001 ఏప్రిల్ 27 న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఇలా వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికలు జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టారు. కాలం మారింది... దశాబ్దన్నర... కాలం మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయరామారావును ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి నాయకులను చేర్పించుకుంటున్న టీఆర్ఎస్ నాయకత్వం ఆ క్రమంలో రెండు మూడు రోజులుగా విజయరామారావుతో సంప్రదింపులు జరిపింది. కేసీఆర్ ఆహ్వానంగా మంత్రి హరీష్‌రావు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టీడీపీకి రాజీనామా టీఆర్ఎస్ నేతలతో చర్చల నేపథ్యంలో విజయరామారావు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపించారు. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన విజయరామారావు ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 లో టీడీపీ ఆయనకు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి ఆయన టీడీపీ విషయంలో కొంత దూరంగా ఉంటూవస్తున్నారు. దానం యూటర్న్తోనే... జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. దానం షరతులకు టీఆర్ఎస్ అంగీకరించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయిందేదో అయిందంటూ... కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. దానం నాగేందర్ వెనక్కి తగ్గడంతో మరో నాయకుడి వేటలో పడిన టీఆర్ఎస్ ఒక్కసారిగా దృష్టి విజయరామారావుపై పడింది. విజయరామారావుతో లాభమేంటి ఒక పెద్దమనిషి తరహాలో పార్టీలో ఉండటం వల్ల నష్టమేమీ లేదని భావనతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్కు బలమైన నాయకుడు లేకపోవడం కూడా విజయరామారావును చేర్పించుకోవాలన్న ఆలోచనకు కారణమైందని చెబుతున్నారు. కొసమెరుపు... విచిత్రమేమంటే... దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలొచ్చినప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి విజయరామారావును పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా కొద్ది రోజుల కిందట విజయరామారావును కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. చివరికి జరిగిందేమంటే... దానం కాంగ్రెస్‌లోనే ఆగిపోయారు. విజయరామారావు టీఆర్ఎస్ వైపు మొగ్గారు. -
పెద్ద గొప్ప పనులేమీ చేయలేదు: రంజిత్ సిన్హా
సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో తాను పెద్ద గొప్ప పనులేమీ చేయలేదని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. రెండేళ్ల పాటు దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధినేతగా ఉన్న ఆయన.. చివర్లో మాత్రం బొగ్గు స్కాం, 2జీ స్కాంల విషయంలో అపవాదు మూటగట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. మంగళవారంతో రంజిత్ సిన్హా పదవీకాలం కూడా ముగిసింది. ఏమీ చెప్పకుండానే తాను వెళ్లిపోతున్నానని, పెద్దగా గొప్ప పనులేమీ చేయలేదని ఆయన అన్నారు. మీరు ఏం కావాలనుకుంటే అది రాసుకొమ్మని కూడా విలేకరులతో అన్నారు. ఇప్పటికే అంతా తనమీద కావల్సినంత బురద జల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ల తరహాలో అనుభవాల సారంతో ఏదైనా పుస్తకం రాసే ఆలోచన ఉందా అని ప్రశ్నించినప్పుడు.. తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరినీ అనుసరించేది లేదన్నారు. రైల్వేబోర్డులో ఓ సభ్యుడిని, ప్రభుత్వ రంగ బ్యాంకు సీఎండీ ఒకరిని, సెన్సార్ బోర్డు సీఈవోను.. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న అనేకమంది లంచాల బాగోతాన్ని బయటపెట్టిన ఘనత రంజిత్ సిన్హాకు ఉంది.