దాణా కుంభకోణం: 89 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు | Fodder Scam Case: 52 Awarded Jail Terms, 35 Acquitted - Sakshi
Sakshi News home page

దాణా కుంభకోణం: 89 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు 

Published Mon, Aug 28 2023 9:28 PM | Last Updated on Tue, Aug 29 2023 10:16 AM

Fodder Scam 52 Awarded Jail Terms 35 Acquitted - Sakshi

పాట్నా: దాణా కుంభకోణం కేసులో మొత్తం 89 మంది దోషులుగా తేలగా వారిలో 52 మందికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో 35 మందిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ శ్రీవాస్తవ్ నిర్దోషులుగా ప్రకటించారు.  

బీహార్‌లో విభజన జరగక ముందు డోరండా ట్రెజరీ నుంచి 1990 మరియు 1995 మధ్య రూ.36.59 కోట్ల అవినీతికి సంబంధించిన ఈ కేసులో మిగిలిన 36 మందిపై విచారణ సెప్టెంబర్ 1న జరుగుతుందని నిందితుల తరపు న్యాయవాది సంజయ్ కుమార్ తెలిపారు.

1990ల్లో డోరండా, డియోఘర్, దుమ్కా, చైబాసా వంటి ట్రెజరీల నుండి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఈ స్కాం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయట ఉన్నారు.

ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement