Laloo Prasad Yadav
-
ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా: సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అందిన డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. కానీ చాలా సంవత్సరాల క్రితమే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా, భారత్ మధ్య వ్యత్యాసమేమిటో చెప్పారు. ఇండియాను భారత్‌గా మారుస్తూ కేంద్రం చేస్తోన్న ప్రయత్నాన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో విభేదిస్తోంది. కానీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం క్రితమే ఇండియా భారత్ మధ్య తేడా ఏమిటో వివరిస్తూ.. ఒక రకంగా ఇండియా కంటే 'భారత్' మేలని అన్నారు. ఒక మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇండియా భారత్ వివాదం తాజాగా రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేయడంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ వేపపుల్లతో పండ్లు తోముకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధి 'ఢిల్లీలో వేపపుల్లలు దొరుకుతాయా? అనడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీ ఇండియాలో భాగమని.. ఇండియాలో వేప పుల్లలు దొరకవు.. కానీ బీహార్ భారత్ కిందకు వస్తుందని భారత్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ అన్నీ దొరుకుతాయని అన్నారు. INDIA और भारत में अंतर लालू यादव मोदी जी के फूल सपोर्ट में pic.twitter.com/YPnVNKuGJ7 — Raja Babu (@GaurangBhardwa1) September 6, 2023 ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే తప్పేంటి? సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావన్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్ని ధర్మాలను సంరక్షించాలి కానీ అవమానించకూడదన్నారు. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, ఖర్గేలు స్పందించాలన్నారు. భారత్ పేరుపై అంత రాద్దాంత ఎందుకు? అని ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే వచ్చిన నష్టం ఏంటి అని, ఎప్పట్నుంచో భారత్ మాతాకీ జై అంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు -
దాణా కుంభకోణం: 89 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు
పాట్నా: దాణా కుంభకోణం కేసులో మొత్తం 89 మంది దోషులుగా తేలగా వారిలో 52 మందికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో 35 మందిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ శ్రీవాస్తవ్ నిర్దోషులుగా ప్రకటించారు. బీహార్‌లో విభజన జరగక ముందు డోరండా ట్రెజరీ నుంచి 1990 మరియు 1995 మధ్య రూ.36.59 కోట్ల అవినీతికి సంబంధించిన ఈ కేసులో మిగిలిన 36 మందిపై విచారణ సెప్టెంబర్ 1న జరుగుతుందని నిందితుల తరపు న్యాయవాది సంజయ్ కుమార్ తెలిపారు. 1990ల్లో డోరండా, డియోఘర్, దుమ్కా, చైబాసా వంటి ట్రెజరీల నుండి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఈ స్కాం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయట ఉన్నారు. ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత? -
సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగై రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోదీ ఇంటి పేరు వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఊరటనివ్వడంతో లాలూ రాహుల్ గాంధీని తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆహ్యానించారు. విందులో బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ తెప్పించి స్వయంగా తానే వండి వడ్డించారు. రాహల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో అమలు కావాల్సిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన రాహుల్ గాంధీని లాలూ మొదట పుష్పగుచ్ఛమిచ్చి అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు రాజకేయాలు మాట్లాడుకుని తర్వాత ఇద్దరూ విందులో పాల్గొన్నారు. విందులో రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండటం విశేషం. లాలూ చేసిన ప్రత్యేక వంటకాన్ని రాహుల్ చాలా ఆస్వాదించారు. దీని కోసం లాలూ బీహార్ నుండి ప్రత్యేకంగా చంపారన్ దేశీయ మటన్ తెప్పించి బీహార్ స్టైల్లో దాన్ని తానే స్వయంగా వండారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు భారీ ఉపశమనం ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో తిరిగి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ప్రభుత్వంపై జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మోదీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే విధించింది. आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi — Congress (@INCIndia) August 4, 2023 ఇది కూడా చదవండి: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి -
లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్ డీడ్ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్ డీడ్ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్ డీడీల ద్వారా హేమా యాదవ్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది. నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా తేల్చిచెప్పారు. రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. -
ఎయిమ్స్ నుంచి లాలూ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన వీల్‌చైర్‌లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తనను బలవంతంగా డిశ్చార్చ్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అందిస్తున్న చికిత్స ఇంకా పూర్తి కాలేదని, బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు. ’ఇది అన్యాయం. నా ఆరోగ్యం క్షీణింప చేసేందుకు జరుగుతున్న కుట్ర. నేను ఇంకా కోలుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేని చోటకు నన్ను తరలిస్తున్నారు. అయినా దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లాలూ డిశ్చార్చ్ సందర్భంగా పెద్దఎత్తున ఆర్జేడీ అభిమానులు ఎయిమ్స్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అక్కడి సెక్యూరిటీ గార్డ్‌కు గాయాలయ్యాయి. లాలూను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆరోగ్యం కుదుటపడకుండానే పంపేస్తున్నారని ఆర్జేడీ ఎంపీ జయప్రకాశ్ నారాయణ యాదవ్ ఆరోపించారు. మరోవైపు లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని, అందుకే ఆయనను రాంచీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన డిశ్చార్చ్ వెనుక కుట్ర, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. డిశ్చార్జి సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్‌కు లాలూ లేఖ రాశారు. ‘నాకు ఏదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించా ల్సి ఉంటుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాహుల్ పరామర్శ: అంతకుముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించి.. కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో లాలూతో రాహుల్ -
నాలుగో కేసులోనూ లాలూ దోషే
-
నాలుగో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. డుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో లాలూ పాత్ర ఉందని నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి శివ్‌పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతోపాటు మరో 18 మందిని దోషులుగా తేల్చారు. ఇక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ఈ నెల 21 నుంచి జడ్జి వాదనలు వింటారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. -
నితీశ్, లాలూ ఇప్పుడు ఇరుగూపొరుగు
మోడీ సునామీతో చతికిల బడిన జెడీయూ నేత నితీశ్ కుమార్, ఆర్ జే డీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు చేతులు కలిపారు. ఇబ్బందుల్లో ఉన్న జేడీయూ ప్రభుత్వానికి ఆర్జేడీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. నితీశ్ స్థానంలో కొత్తగా ముఖ్యమంత్రి అయిన జీతన్ రామ్ మాఝీకి దీనితో ఊరట లభించినట్టయింది. బిజెపి జోరుకు జేడీయూకి రెండు, లాలూ ప్రసాద్ యాదవ్ కి మూడు లోకసభ సీట్లు దక్కాయి. దీంతో 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో శుక్రవారం జరగాల్సిన విశ్వాస పరీక్ష లో జేడీయూ గట్టెక్కేందుకు వీలు కలిగింది. మరో వైపు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఇన్నాళ్ల తన శత్రువు, ఇప్పుడు మళ్లీ కొత్త మిత్రుడు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కి పొరుగింటి వారయ్యారు. ఇద్దరి అధికార నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. రాజకీయ సాహచర్యమే కాదు, సహజీవన సాన్నిహిత్యమూ ఇప్పుడు ఇద్దరు నేతలకీ ఘోర ఓటమి పుణ్యమా అని లభించింది. -
చెరువు పూడ్చేస్తా - ఎన్నికల్లో గెలుస్తా!
'ఏ గతీ లేకపోతే నీ గతి గంగావతే' అని ఒక సామెత ఉంది. ఎన్నికల్లో పదేపదే ఓడిపోతూంటే ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? ఫార్ములాలన్నీ పటాపంచలైపోతూంటే, లెక్కలన్నీ ముక్కలైపోతూంటే ఎంతటి వాడైనా వాస్తు, జ్యోతిష్యాన్ని ఆశ్రయించాల్సిందే. అలాంటి గతే పట్టింది మన లాలూ ప్రసాద్ యాదవ్ కి. ఒకప్పుడు బీహార్ ను ఏకఛ్చత్రంగా ఏలిన లాలూ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. పన్నెండు మంది ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ మంత్రులు పార్టీకి రాం రాం చెప్పారు. కాంగ్రెస్ తో ఎన్నికల ఒప్పందం ఇంకా ఖాయం కాలేదు. రకరకాల కేసులు మరోవైపు చీకాకు పెడుతున్నాయి. వీటన్నిటినీ తట్టుకునేందుకు లాలూ ఏం చేస్తున్నారు? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా తన ఇంట్లో ఉన్న ఓ చెరువును కప్పిపెట్టించేస్తున్నారు లాలూ. 2006 లో పాట్నా యాన్ మార్గ్ అధికార భవనం నుంచి లాలూ దంపతులు సర్కులర్ రోడ్ లో ఉన్న భవనానికి వచ్చారు. అప్పుడు ఛత్ పూజ కోసం ఆయన నివాసభవనంలోనే ఒక భారీ చెరువు తవ్వించారు. అప్పట్నుంచే ఆయనకు సమస్యలు మొదలయ్యాయట. దాంతో ఇప్పుడు ఆ చెరువును పూడ్చేసే పని మొదలుపెట్టారాయన. 1990 లో తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు లాలూ వ్యవహార శైలి చాలా విప్లవాత్మకంగా ఉండేది. బాబాలు, తాయెత్తులంటే చాలు భగ్గుమనేవారు. పూజలు పునస్కారాలంటే మండిపడేవారు. ఇప్పుడు మాత్రం ఆయన బాబా పేరు చెబితే చాలు వెళ్లి పాదాలమీద పడిపోతున్నారు. లాలూ ఈ మధ్యే ఉత్తరప్రదేశ్ మీర్జాపుర్ లోని పగ్లా బాబా (పిచ్చి బాబా) ను సందర్శించి, సాగిలపడి వచ్చారు. అంతే కాదు... ప్రస్తుతం ఆయన ఇంట్లో టికెట్లు అడిగేవారికన్నా జాతకాలు చూసి, తంత్ర యంత్ర మంత్రాలు చేసే జ్యోతిష్కులు, తావీజు బాబాల సంఖ్యే ఎక్కువగా ఉందంటున్నారు. వాళ్లేం చెబితే అది చేస్తున్నారట లాలూ ప్రసాద్, రబ్రీ దేవి దంపతులు.