ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్  | Lalu Prasad Yadav Explains Difference Between India And Bharat Video | Sakshi
Sakshi News home page

ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్

Published Wed, Sep 6 2023 2:48 PM | Last Updated on Wed, Sep 6 2023 3:17 PM

Lalu Prasad Yadav Explains Difference Between India And Bharat Video - Sakshi

పాట్నా: సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అందిన డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. కానీ చాలా సంవత్సరాల క్రితమే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా, భారత్ మధ్య వ్యత్యాసమేమిటో చెప్పారు. 

ఇండియాను భారత్‌గా మారుస్తూ కేంద్రం చేస్తోన్న ప్రయత్నాన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో విభేదిస్తోంది. కానీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం క్రితమే ఇండియా భారత్ మధ్య తేడా ఏమిటో వివరిస్తూ.. ఒక రకంగా ఇండియా కంటే 'భారత్' మేలని అన్నారు. ఒక మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ  అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. 

ఇండియా భారత్ వివాదం తాజాగా రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేయడంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ వేపపుల్లతో పండ్లు తోముకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధి 'ఢిల్లీలో వేపపుల్లలు దొరుకుతాయా? అనడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీ ఇండియాలో భాగమని.. ఇండియాలో వేప పుల్లలు దొరకవు.. కానీ బీహార్ భారత్ కిందకు వస్తుందని భారత్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ అన్నీ దొరుకుతాయని అన్నారు.        

ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అంటే తప్పేంటి?
సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావన్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్ని ధర్మాలను సంరక్షించాలి కానీ అవమానించకూడదన్నారు. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ, ఖర్గేలు స్పందించాలన్నారు. భారత్‌ పేరుపై అంత రాద్దాంత ఎందుకు? అని ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రశ్నించారు. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అంటే వచ్చిన నష్టం ఏంటి అని, ఎప్పట్నుంచో భారత్‌ మాతాకీ జై అంటున్నామన్నారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్‌ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement