దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. మనదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని మసీదులు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జామా మసీదు, ఢిల్లీ
జామా మసీదు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి. 1956లో షాజహాన్ నిర్మించిన ఈ మసీదులో సుమారు 25 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మీనార్ 135 అడుగుల ఎత్తు కలిగివుంది.
మక్కా మసీదు, హైదరాబాద్
దేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఇది ఒకటి. మక్కా మసీదు 1694లో మక్కా నుండి తెచ్చిన మట్టి, ఇటుకలతో నిర్మితమయ్యింది. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ మసీదు చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, చార్మినార్ తదితర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది.
తాజ్-ఉల్-మసీదు, భోపాల్
తాజ్-ఉల్-మసీదు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద, అందమైన మసీదుగా పేరుగాంచింది. ఈ మసీదును ‘మసీదుల కిరీటం’ అని కూడా పిలుస్తారు. లక్ష మందికి పైగా జనం ఈ మసీదులో కూర్చుని ప్రార్థనలు చేయవచ్చు.
జామియా మసీదు, శ్రీనగర్
శ్రీనగర్‌లో ఉన్న జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. దీనిలో ఒకేసారి 33 వేల మంది ప్రార్థనలు సాగించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లోని పాత శ్రీనగర్‌లో ఈ మసీదు ఉంది.
బడా ఇమాంబర, లక్నో
1784లో అవధ్ నవాబ్ నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
జామా మసీదు, ఆగ్రా
యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా ఉన్న ఈ జామా మసీదు దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరొందింది. దీనిని ఫ్రైడే మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment