mosque
-
Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక మౌలానా(మత పెద్ద) మసీదుపైకి ఎక్కి పెద్దగా అరుస్తూ, ముస్లిం సోదరులంతా నమాజ్‌కు రావాలని పిలుపునిచ్చారు. షాహీ జామా మసీదుపై జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.కోర్టు తీర్పు అనంతరం సంభాల్‌లోని అన్ని ప్రార్థనా స్థలాలు, మత ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అధికారులు నిషేధించారు. అయితే ఇప్పుడు వీటిని ఉల్లంఘించినందున పోలీసులు ఆ మసీదుకు చెందిన ముగ్గురు మతపెద్దలపై కేసు నమోదు చేశారు. సంభాల్‌లోని షాహీ జామా ఇమామ్ మసీదు గత కొన్నాళ్లుగా వివాదాల్లో ఉంది. ఈ మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో కల్కి ఆలయం ఉండేందని ఒక న్యాయవాది కోర్టులో దావా వేశారు.ఈ నేపధ్యంలో స్థానిక కోర్టు ఈ మసీదు సర్వేకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే రెండవ రోజున పెద్దసంఖ్యలో జనం మసీదు దగ్గరకు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 20 మంది పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. నాటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది.ఇదే సమయంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు పట్టింది. సమాజ్‌వాదీ ఎంపీ బార్క్ కూడా ఈ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇదిలావుండగా అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించేందుకు వెళ్ళిన బృందం ఒక పురాతన ఆలయాన్ని కూడా కనుగొంది. ఆలయం చుట్టూ ఒక బావిని కూడా వారు చూశారు. దీని తరువాత సంభాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఇంట్లో కొంత భాగం అక్రమ నిర్మాణం పరిధిలోకి వచ్చింది. దీంతో ఎంపీ ఇంటి మెట్లను సంబంధిత అధికారులు తొలగించారు.ఇది కూడా చదవండి: Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం -
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అడ్డొస్తే... శాల్తీలు లేచిపోతాయ్..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఎవరైనా అడ్డొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శాల్తీలు లేచిపోతాయ్.. బాడీలు కూడా కనపడకుండా చేస్తా. ఇక్కడికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సద్దాం వస్తే మర్యాదగా ఉండదు’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు బెదిరించారు. ఈ ఘటన ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఖబరస్థాన్ వద్ద రోడ్డు పక్కన పలువురు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ 40 ఏళ్లకు పైగా జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.ఇక్కడ దుకాణం పెట్టుకున్న నయాజ్ దాన్ని కొంతకాలం క్రితం రియాజ్ అనే వ్యక్తికి స్నేహ పూర్వకంగా ఇచ్చి ముంబై వెళ్లాడు. ఇటీవల తిరిగొచి్చన అతను, తన షాపు తనకు ఇవ్వాలని కోరగా రియాజ్ నిరాకరించాడు. వీరి మధ్య వివాదం కొనసాగుతుండగానే రియాజ్ ప్రస్తుతమున్న షాపును శ్మశానం వైపు పొడిగించి పెద్ద షెడ్డు వేస్తుండడంతో మసీదు కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రియాజ్ వారి మాటను పట్టించుకోకపోవడంతో దుకాణానికి తాళం వేశారు.దీంతో టీడీపీ కార్యకర్త అయిన రియాజ్ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన పోలీసులతో చేరుకుని దుకాణం తాళాలను పగులగొట్టడమే కాకుండా అక్కడున్న జామియా మసీదు కమిటీ సభ్యులను తీవ్రంగా బెదిరించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు దాదు, నిషార్, షమి, సన్నా తదితరులు దౌర్జన్యానికి దిగారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సర్ది చెప్పి రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా మంత్రి భర్త దౌర్జన్యంపై ముస్లింలు మండిపడ్డారు. -
సంభాల్ ప్రార్థన మందిరం సర్వేపై..
-
గాజాలో మసీదుపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది మృతి
గాజా:ఓ పక్క లెబనాన్‌లో హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సేనలు మరోపక్క పాలస్తీనాలోని గాజాలోనూ దాడులు కొనసాగిస్తున్నాయి.ఆదివారం(అక్టోబర్6)సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24మంది మరణించారు. మృతులంతా పురుషులేనని అధికారులు తెలిపారు.డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదులో నిరాశ్రయులైన ప్రజలుంటున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 24మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2023అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో దాదాపు 42వేల మంది మరణించారు.ఇదీ చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
ఒమన్‌లో కాల్పుల కలకలం
మస్కట్: ఒమన్‌లోని వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం(జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పులువురికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
భారతదేశంలోని ప్రముఖ మసీదులివే..
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. మనదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని మసీదులు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జామా మసీదు, ఢిల్లీ జామా మసీదు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి. 1956లో షాజహాన్ నిర్మించిన ఈ మసీదులో సుమారు 25 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మీనార్ 135 అడుగుల ఎత్తు కలిగివుంది. మక్కా మసీదు, హైదరాబాద్ దేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఇది ఒకటి. మక్కా మసీదు 1694లో మక్కా నుండి తెచ్చిన మట్టి, ఇటుకలతో నిర్మితమయ్యింది. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ మసీదు చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, చార్మినార్ తదితర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది. తాజ్-ఉల్-మసీదు, భోపాల్ తాజ్-ఉల్-మసీదు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద, అందమైన మసీదుగా పేరుగాంచింది. ఈ మసీదును ‘మసీదుల కిరీటం’ అని కూడా పిలుస్తారు. లక్ష మందికి పైగా జనం ఈ మసీదులో కూర్చుని ప్రార్థనలు చేయవచ్చు. జామియా మసీదు, శ్రీనగర్ శ్రీనగర్‌లో ఉన్న జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. దీనిలో ఒకేసారి 33 వేల మంది ప్రార్థనలు సాగించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లోని పాత శ్రీనగర్‌లో ఈ మసీదు ఉంది. బడా ఇమాంబర, లక్నో 1784లో అవధ్ నవాబ్ నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జామా మసీదు, ఆగ్రా యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా ఉన్న ఈ జామా మసీదు దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరొందింది. దీనిని ఫ్రైడే మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు. -
Indo-Islamic Cultural Foundation: అయోధ్యలో మసీదు నిర్మాణం.. మేలో ప్రారంభం
లక్నో: రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానున్నాయి. అయోధ్యలోని ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమై నిధుల సేకరణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జుల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్‌ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్, ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూకీ తెలిపారు. ‘15 వేల చదరపు అడుగులకు బదులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుంది. జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తాం. ప్రభుత్వమిచ్చే భూమిలో మసీదుతో పాటు ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలను కూడా నిర్మిస్తాం. నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల లభ్యతపైనే నిర్మాణ పనుల వేగం ఆధారపడి ఉంటుంది’’ అని ట్రస్ట్ సెక్రటరీ అథార్ హుస్సేన్ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్ తిరస్కరణకు గురవడం కూడా ఆలస్యానికి ఒక కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్‌ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించగా ఈ ఏడాది మార్చిలో అనుమతులు లభించాయి. కేంద్రం అయోధ్యలో ఐదెకరాలను యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్‌కు అందజేయగా, బోర్డ్ మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌కు అప్పగించింది. -
స్వయంగా తీసుకెళ్లి సచివాలయమంతా చూపించి..
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఆలయంలో జరిగిన తొలి పూజలు, మసీదు, చర్చిలలో నిర్వహించిన తొలి ప్రార్థనల్లో ఇరువురు కలసి పాల్గొన్నారు. గవర్నర్ సచివాలయానికి తొలిసారి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా దగ్గరుండి ప్రత్యేకతలను చూపించారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా నల్ల పోచమ్మ ఆలయం, మసీదులను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ రెండింటితోపాటు చర్చిని కూడా కొత్తగా, విశాలంగా నిర్మించారు. శుక్రవారమే వాటిని ప్రారంభించి అందరినీ అనుమతిస్తున్నారు. చర్చిలో కేక్‌ను కట్ చేస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్ తదితరులు గవర్నర్‌ను ఘనంగా స్వాగతించి.. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆలయం, మసీదు, చర్చిల ప్రారంబోత్సవ ఏర్పాట్లు, సచివాలయ అంశాలపై ఉద్యోగ సంఘం నేతలతో కాసేపు మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకు మేళతాళాల మధ్య సీఎం, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి జరుగుతున్న చండీయాగం పూర్ణాహుతిలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. తర్వాత ఆలయంలో నల్ల పోచమ్మ అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. దీనికి అనుబంధంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ వాహనంలో వారు చర్చి వద్దకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై రిబ్బన్ కట్ చేసి చర్చిని ప్రారంభించారు. కేక్ కట్ చేసి బిషప్ డానియేల్‌కు, సీఎంకు అందించారు. తర్వాత బిషప్ ఆధ్వర్యంలో తొలి ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ ముఖ్యమంత్రికి జ్ఞాపికను బహూకరించారు. తర్వాత వారంతా పక్కనే ఉన్న మసీదుకు చేరుకున్నారు. అక్కడ ఇమాం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించాలని అసదుద్దీన్ కోరగా.. ‘‘రాష్ట్రంలో సోదరభావం ఇలాగే పరిఢవిల్లాలి. ఇందుకు ప్రభుత్వపరంగా మావంతు చొరవ చూపుతాం. కొత్త మసీదు అద్భుతంగా, నిజాం హయాంలో కట్టిన తరహాలో గొప్పగా రూపొందింది. ఇలా అన్ని మతాల ప్రార్థన మందిరాలు ఒక్కచోట ఏర్పాటైన తెలంగాణ సచివాలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి మసీదును ప్రారంభిస్తున్న తమిళిసై. చిత్రంలో హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు సచివాలయాన్ని గవర్నర్‌కు చూపిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. ఇప్పటివరకు గవర్నర్ అందులో అడుగుపెట్టలేదు. శుక్రవారమే తొలిసారిగా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రార్థన మందిరాల్లో కార్యక్రమాలు ముగిశాక సీఎం కేసీఆర్.. సచివాలయాన్ని తిలకించాలంటూ గవర్నర్ తమిళిసైని ఆహ్వనించారు. స్వయంగా దగ్గరుండి మరీ కొత్త భవనం ప్రత్యేకతలు, నిర్మాణంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఇతర అంశాలను వివరించారు. తన చాంబర్‌కు తోడ్కొని వెళ్లి అక్కడ శాలువాతో సత్కరించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా కావటంతో.. గవర్నర్‌కు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి కుంకుమ దిద్ది సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం వారంతా తేనీటి విందులో పాల్గొన్నారు. -
వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే..
ఈజిప్టు: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా రెండో రోజున 11వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈజిప్టులో ప్రఖ్యాతి గాంచిన ఈ అల్-హకీమ్ మసీదు 11వ శతాబ్దంలో నిర్మించారు. 1000 ఏళ్ల నాటి ఈ మసీదుకు ఈజిప్టులో చారిత్రాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది భారత్, ఈజిప్టు రెండు దేశాల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని చెబుతూ ఉంటారు. భారత సంతతికి చెందిన దావూదీ బోహ్రా సంఘం వారు దీనిని పునరుద్ధరించారు. ఈ సంఘం వారు బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలరని చెబుతూ ఉంటారు. ప్రధాని మసీదు సందర్శన సందర్బంగా దావూదీ బోహ్రా సంఘంలోని సభ్యుడు శుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా మాట్లాడుతూ.. ఈరోజు నిజంగా చారిత్రాత్మకమైనది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి రావడం.. మాతోనూ, మా సంఘంతోనూ మాట్లాడటం.. మమ్మల్ని వారి కుటుంబసభ్యుల్లా భావించి మా యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం హీలియోపోలీస్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనా తరపున యుద్ధం చేసి మరణించిన సుమారు 4000 మంది భారత సైనికులకు నివాళులర్పించారు. ఇది కూడా చదవండి: వాళ్ళే అసలైన హీరోలు.. వీళ్లంతా పిరికిపందలు -
రామాయణంపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
పాట్నా: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా.. రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని దనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా దుమారం రేపుతున్నాయి. ఇక, యాదవ్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది. యాదవ్ అంతటితో ఆగకుండా 11 ఏండ్ల ముస్లిం బాలిక భగవద్గీతను పఠించి మెడల్‌ను గెలుచుకున్నప్పుడు హిందుత్వవాదులు నోరుమెదపలేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు.. యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. रामचरित मानस मस्जिद में लिखी गई थी, इतिहास उठाकर देखिए," RJD के विधायक रीतलाल यादव का बयान। #RitlalYadav #Ramcharitmanas pic.twitter.com/Cl1JxDlDjK — The Hint News (@TheHintNews) June 16, 2023 ఇది కూడా చదవండి: పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్‌కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్ -
నేడు నెలవంక కనపడితే 22న రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ ఉంటుందని, లేని పక్షంలో ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ చెప్పారు. రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ ) శుక్రవారం దీనిపై స్పష్టతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇస్లాంలో రంజాన్ చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్ విదాను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులో జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యలో ఆయా జోన్లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు. ఈద్గాలలో నమాజ్ కోసం ఏర్పాట్లు: శని లేదా ఆదివారం రంజాన్ పండుగ నేపథ్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాలలో పండుగ రోజు నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈద్గాల కమిటీలకు కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్‌లోని మీరాలం, మాదన్నపేట్ ఈద్గాలను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించామన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని పలు మైదానాల్లో కూడా రంజాన్ పండుగ నమాజ్ కోసం ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామని తెలిపారు. -
పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి.. 100 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో ఈ పేలుడు సంభవించింది. మసీదులో మధ్యాహ్నం 1.45 గంటలకు జుహర్ ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 50 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 100 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి మసీదు పైకప్పు, ఓ వైపు గోడ భాగం కూలిపోయింది. భవన శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు.. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: Gunfire: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. -
Hyderabad: కేబీఆర్ నేషనల్ పార్కు స్థలం 8వ నిజాం రాజుదే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఒకప్పుడు ఎనిమిదో నిజాం ముకరం జా బహదూర్‌కు చెందినదిగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఆయన కన్నుమూయగా మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్‌తో ఆయనకున్న జ్ఞాపకాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలో ముకరంజా 1940లో చిరాన్ ప్యాలెస్‌ను నిర్మించుకొని దానిని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ముకరంజా నిర్మించుకున్న చిరాన్ మసీదు ఇందులో రెండు సెల్లార్లు కూడా ఉన్నాయి. ప్రిన్స్ ఆడుకునేందుకు అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ తో కూడిన బిలియర్డ్స్ గదులను నిర్మించారు. ఆయుధాలను భద్రపరిచే హాలు కూడా నిర్మించారు. మొదటి అంతస్తులు ఏడు బెడ్ రూములు ఉండగా భార్య పిల్లలతో ఇక్కడే ఉండేవారు. చిరాన్ ప్యాలెస్‌ను ఆనుకొని మోర్ బంగ్లా, గోల్ బంగ్లా, గుర్రాలు ఏనుగుల కోసం షెడ్లు, వాహనాలు భద్రపరిచేందుకు మోటార్ ఖానా ఉండేవి. అలాగే రాజు వాహనాల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా బావులు, చెరువులను తవ్వించారు. అయితే ముకరంజా ఎక్కువగా ఆ్రస్టేలియా, టర్కీ, లండన్ దేశాలలో ఉంటుండడంతో చిరాన్ ప్యాలెస్ అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1998లోనే ఈ 400 ఎకరాల స్థలంలో నుంచి 360 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేషనల్ పార్కుగా నోటిఫై చేసి దీనికి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టింది. ఇది ఇలా ఉండగా ముకరంజాకు చెందిన చిరాన్ ప్యాలెస్ నిర్మితత 11 ఎకరాలు మాత్రం ఆయనకు కేటాయించారు. ప్రస్తుతం ఈ 11 ఎకరాల్లో ఉన్న చిరాన్ ప్యాలెస్ ఆయన ఆధీనంలోనే ఉన్నది. ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసి దీనిని సంరక్షిస్తున్నారు. కొద్ది దూరంలోనే రాజు ప్రార్థనలు చేసుకునేందుకు చిరాన్ మసీద్‌ను కూడా నిర్మించారు. 20 సంవత్సరాల క్రితం ఈ మసీదును ప్రార్థనల కోసం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు ముకరంజా కోరుకున్నట్టుగానే పార్కు లో నెమలుల సంఖ్య భారీగా పెరిగింది. చిరాన్ ప్యాలెస్ చుట్టూ నెమళ్లు నిత్యం సందడి చేస్తుంటాయి. పార్కులో చిరాన్ ప్యాలెస్ ఒక అద్భుతమైన కట్టడంగా మిగిలి ఉంది. ముకరంజా మరణంతో చిరాన్ ప్యాలెస్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారనుంది. 2004లో చివరిసారిగా ముకరంజా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చిరాన్ ప్యాలెస్ సందర్శించి మసీదులో ప్రార్థన నిర్వహించిన స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్యాలెస్‌లో ఇప్పటికీ విలువైన, అరుదైన వజ్రాభరణాలు, ఖరీదైన కళాఖండాలు ఉన్నట్లు సమాచారం. -
ఢిల్లీలో మసీదును సందర్శించిన RSS చీఫ్
-
Gyanvapi Masjid Case: కదిలిన తేనెతుట్టె!
చిన్నగా మొదలైన కొన్ని అంశాలే కాలగతిలో పెను పరిణామాలకు దారితీస్తాయి. ఇది చరిత్రలోని చిత్రమైన లక్షణం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి అక్కడి జిల్లా న్యాయస్థానం సోమవారం ఇచ్చిన 26 పేజీల ఆదేశం సరిగ్గా అలాంటిదే. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతించాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ విచారణార్హమైనదే అని కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. 17వ శతాబ్దికి చెందిన ఈ మసీదులో పూజలకు అనుమతించడానికి ఇప్పుడున్న మూడు చట్టాల ప్రకారం కుదరదంటూ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ వాదించింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక ఏర్పాట్ల) చట్టం – 1991, వక్ఫ్ చట్టం – 1995, యూపీ శ్రీకాశీ విశ్వనాథ్ ఆలయ చట్టం –1983... ఈ మూడింటినీ కమిటీ ప్రస్తావించింది. కానీ, జడ్జి విశ్వేశ ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ 22న విచారణకు నిర్ణయించారు. జిల్లా కోర్ట్ ఆదేశంపై మస్జిద్ కమిటీ హైకోర్ట్ గుమ్మం తొక్కనుంది. వెరసి, సుదీర్ఘంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు – రామజన్మభూమి వ్యవహారంలా ఇక ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కథ మొదలు కానుంది. కొద్దినెలల విరామం తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంలో మొదలైన ఈ కొత్త అంకం అనేక పర్యవసానాలకు దారితీయడం ఖాయం. కొద్ది నెలల క్రితం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియో తీసినప్పుడు బయటపడ్డ శివలింగం తరహా నిర్మాణం గురించి కోర్టులో చర్చకు రానుంది. అయోధ్య, కాశీ, మథురల్లోని మసీదులు నిజానికి హిందువుల భూభూగాలేననే వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా ఏళ్ళుగా బీజేపీ, సంఘ్ పరివార్లు దాన్ని తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నాయి. దీనిపై ఇటు వీధుల్లోనూ, అటు కోర్టుల్లోనూ పోరు సాగిస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ ఆ స్థాయి వివాదాలు ఇతర ప్రార్థనా స్థలాలపై తలెత్తకూడదనే ఉద్దేశంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న స్థితినే కొనసాగించాలనీ, ఏ వివాదాస్పద ప్రార్థనా స్థల స్వరూప స్వభావాలనూ మార్చ రాదనీ సదరు చట్టం నిర్దేశిస్తోంది. తీరా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రార్థనాస్థల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. మళ్ళీ ఇప్పుడు జ్ఞానవాపిపై కోర్టు ఆదేశంతో ఒకప్పటి బాబ్రీ మసీదు వివాదంలా సమాజంలోని రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిని, సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. 1991 నాటి చట్టం సైతం నిష్ప్రయోజనం కావచ్చని ముస్లిమ్ వర్గం ఆందోళన. అయితే, 1947కూ, 1993కూ మధ్య జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువుల ప్రార్థనలను అనుమతించారు. 1993 తర్వాతా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఒకసారి అక్కడ దేవతామూర్తుల ప్రార్థనకు వీలు కల్పిస్తున్నారు. హిందూ మహిళల పిటిషన్‌ను అనుమతించిన జిల్లా కోర్ట్ ఆ సంగతులే గుర్తు చేసింది. ప్రార్థనాస్థల ధార్మిక స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నమేదీ ఇందులో లేదనీ, అక్కడ పూజలు చేసుకొనే హక్కు మాత్రమే అడుగుతున్నారనీ వ్యాఖ్యానించింది. కానీ, కథ అంతటితో ఆగుతుందా అన్నది ప్రశ్న. నిజానికి, జ్ఞానవాపి ప్రాంగణంపై హక్కులకు సంబంధించి హైకోర్ట్‌లో ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ప్రాంగణంలో భారత సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)తో సర్వేకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశం పైనా హైకోర్ట్ విచారిస్తోంది. ఇలా జ్ఞానవాపిపై ఒక వర్గం ఒకే రకమైన పలు కేసులు దాఖలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రెండో వర్గం అనుమానం. పూజల కోసం భక్తులు వేసిన పిటిషన్‌ను ముందుగా జిల్లా కోర్టు వినాలని ఆ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది. వారణాసి కోర్ట్ తాజా నిర్ణయంతో వివాదం పైకోర్టులకు పాకుతుంది. నిజానికి, దశాబ్దాల తరబడి సాగిన రామజన్మభూమి వివాదంపై 2019లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు ఒకప్పుడున్న స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూనే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలను కాపాడేందుకు తీర్చి దిద్దిన చట్టపరమైన పరికరంగా అభివర్ణించింది. తీరా తాజా నిర్ణయంతో వారణాసి కోర్ట్ ఆ మాట లను ప్రశ్నార్థకం చేసి, వివాదాల తేనెతుట్టెను కదిలించింది. పైకి కోర్టు కేసులుగా కనిపిస్తున్నా, వీటిలో రాజకీయాలూ పుష్కలం. బాబ్రీ మసీదు వివాదంతో ఇప్పటికే దేశంలో ఒక వర్గాన్ని బయటి వ్యక్తులుగా చూసే ధోరణి ప్రబలింది. జాతీయవాదం, హైందవ ఆత్మగౌరవం లాంటి పదబంధా లకు ప్రాచుర్యం పెరిగింది. మరోపక్క మథుర, ఆగ్రాల్లోనూ ఇలాంటి కేసులే కోర్టుల్లో ఉన్నాయి. అసలు ‘ప్రార్థనాస్థలాల చట్టం–1991’ రాజ్యాంగబద్ధత పైనా సుప్రీమ్‌లో కేసు పెండింగ్‌లో ఉంది. ఆ అంశంపై సుప్రీమ్ తీర్పు కోసం నిరీక్షించకుండా, జిల్లా కోర్ట్ అత్యుత్సాహం చూపింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాలన్నిటికీ కీలకం కానున్న 1991 నాటి చట్టానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎంత త్వరగా తన తీర్పునిస్తే అంత మంచిది. కింది కోర్టులకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యలు మరింత జటిలం కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే, ధార్మిక విశ్వాసాలు నిప్పు లాంటివి. వాటితో చెలగాటమాడితే చేతులు కాలక తప్పదు. ఏమరుపాటుగా ఉంటే సమాజాన్నీ, విభిన్న వర్గాల సామరస్యాన్నీ ఆ అగ్ని దహించకా తప్పదు. న్యాయస్థానాల మొదలు ప్రభుత్వాల దాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది అందుకే! -
మసీదుల్లో మందిరాలను పునరుద్ధరించి తీరతాం!: ఎమ్మెల్యే ఈశ్వరప్ప
బెంగళూరు: మసీదుల్లో మందిరాల ఉనికిపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. 36,000 ఆలయాలను ధ్వంసం చేసి.. మసీదులు కట్టారని, వాటన్నింటిని పునరుద్ధరించి తీరతామని శపథం చేస్తున్నాడాయన. కర్ణాటక డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప పై కామెంట్లు చేశాడు. మందిర్-మసీద్ వ్యవహారంపై మీడియా సాక్షిగా శుక్రవారం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలయాలను ధ్వంసం చేసి.. వాటిపై మసీదులు కట్టారు. వేరే ఎక్కడైనా మసీదులు కట్టి.. నమాజ్‌లు చేసుకోండి. అంతేగానీ, ఆలయాల మీద మసీదులను అనుమతించేదే లేదు. ముప్పై ఆరువేల ఆలయాలను హిందువులు తిరిగి అదీ లీగల్‌గా చేజిక్కించుకోవడం ఖాయం అని పేర్కొన్నారు ఆయన. జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టులో ఉన్న వేళ.. కర్ణాటకలోనూ అదే తరహా వ్యవహారం వెలుగుచూసింది. మంగళూరు దగ్గర ఓ పాత మసీదులో రిన్నోవేషన్ పనులు జరుగుతుండగా.. హిందు ఆలయం తరహా నమునాలు వెలుగు చూశాయి. దీంతో.. వీహెచ్‌పీ నేతలు పనులు ఆపించాలంటూ జిల్లా అధికారులను కోరారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈశ్వరప్ప గుడులను పునరుద్ధరించి తీరతామని వ్యాఖ్యానించడం విశేషం. ముస్లింలందరూ చెడ్డవాళ్లు కారని, అలాగని ఆలయాలపై మసీదులు నిర్మించి నమాజ్‌లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఒక మసీదు ఉందంటే.. అది కచ్చితంగా శివుడి ఆలయమే అయ్యి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈశ్వరప్ప కామెంట్లపై కాంగ్రెస్ మండిపడుతోంది. న్యాయస్థానాల్లో వ్యవహారం ఉండగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తోంది. K S Eshwarappa: ಮಸೀದಿ ಇದ್ದಲ್ಲಿ ವಿಶ್ವನಾಥ ದೇವಾಲಯ ಆಗಿಯೇ ಆಗುತ್ತೆ ಎಂದ ಈಶ್ವರಪ್ಪ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #karnatakanews #UpdateNews #Eshwarappa #latestnews #GyanvapiMosque Watch:https://t.co/4IxRcaVlTY pic.twitter.com/gltJOr0alm — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 K S Eshwarappa: ‘ಎಲ್ಲಾ ಮುಸ್ಲೀಮರು ಕೆಟ್ಟವರು ಅನ್ನುವುದಿಲ್ಲ’ ||Bjp|| ||Karnataka Tak||@BJP4Karnataka #Muslim #Eshwarappa #KarnatakaTak #latestnews Watch:https://t.co/Wm05PslukR pic.twitter.com/LjkX7B3yQ5 — Karnataka Tak (@karnataka_tak) May 27, 2022 -
పంజాబ్‌లోనూ మందిర్–మసీదు వివాదం
పటియాలా: మందిర్–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు బుధవారం ఆరోపించాయి. ‘‘రెండేళ్ల క్రితం అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి ఆక్రమించుకున్నారు. సిక్కు మత, ఆరాధన చిహ్నాలను తొలగించారు. గుమ్మటం నిర్మించి ఆకుపచ్చ రంగు వేసి మసీదుగా మార్చారు’’ అని పేర్కొన్నాయి. దీన్ని ముస్లిం సమూహం ఖండించింది. అది స్వాతంత్య్రానికి ముందునుంచీ మసీదుగానే కొనసాగుతూ వస్తోందని వాదించింది. ఇరు వర్గాలూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హిమాన్షు గుప్తాకు ఫిర్యాదు చేశాయి. రెండు రోజుల్లోగా సాక్ష్యాలు సమర్పించాలని వారికి ఆయన సూచించారు. హర్యానా, యూపీకి చెందిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో కట్టడం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్‌స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్లో ఉగ్ర ఘాతుకం: 56 మంది మృతి
Peshawar Explosion:పెషావర్: వాయవ్య పాకిస్తాన్లో.. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పెషావర్ నగరంలో ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు. మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 194 మంది గాయాల పాలయ్యారు. ఖైబర్–పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడుల్లో ఇది కూడా ఒకటని అధికారులు చెప్పారు. పెషావర్‌లోని ఖిస్సా ఖ్వానీ బజార్ ఏరియా సమీపంలో ఇమామ్‌బర్గా వద్ద షియా వర్గానికి చెందిన జామియా మసీదులో పేలుడు జరిగిందని తెలిపారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థే కారణమని నిర్ధారణకు వచ్చారు. షియావర్గం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ కొంతకాలంగా భీకర దాడులకు పాల్పడుతోంది. జామియా మసీదులో పేలుడు ఘటనలో ఉగ్రవాదులు పాల్గొన్నారని ఖైబర్–పఖ్తూంక్వా ప్రభుత్వ అధికార ప్రతినిధి బారిస్టర్ మొహమ్మద్ అలీ సైఫ్ చెప్పారు. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాల్గొన్నప్పటికీ.. వారిలో ఒక్కడు మాత్రమే ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తనను తాను పేల్చేసుకున్నాడని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి హరూన్ రషీద్ ఖాన్ తెలిపారు. నల్ల రంగు దుస్తులు ధరించిన వ్యక్తిని సూసైడ్ బాంబర్‌గా ఓ ప్రత్యక్ష సాక్షి గుర్తించారు. సదరు ముష్కరుడు తొలుత మసీదు సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపాడని, తర్వాత మసీదు లోపలికి ప్రవేశించి, తనను తాను పేల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జామియా మసీదులో ఆత్మాహుతి పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పెషావర్‌లో పేలుడు ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని ఖైబర్–పఖ్తూంక్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రార్థనల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అమానవీయం, రాక్షస కృత్యం అని చెప్పారు. -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో కొత్తగా నిర్మించే మసీదుల నమూనాలు ఖరారయ్యాయి. టర్కీ డిజైన్‌లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఆయన ఆదివారం తన చాంబర్లో మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్ తదితరులతో కలిసి మసీదుల డిజైన్లను పరిశీలించారు. పాత సచివాలయంలో మసీదు ఉన్న చోటే వీటిని నిర్మించనున్నారు. నమూనాలపై నిపుణుల సలహాలు తీసుకున్నారు. సచివాలయంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద మసీదు, 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో చిన్న మసీదులను అత్యంత సుందరంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. పెద్ద మసీదు లోపల 400 మంది, బయట ఆవరణలో సుమారు 1,000 మంది ప్రార్థనలు చేసేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి అంతస్తులో వజూఖానా దానిపై ప్రత్యేకంగా ఇమామ్ కోసం నివాస వసతి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా మసీదు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి మసీదులను అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. చదవండి: 4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ.. -
మసీదులో పేలుడు: 12 మంది మృతి
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కాబుల్ సమీపంలోని ఓ మసీదులోశుక్రవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరో 15 పైగా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాజధాని షకర్ దారా జిల్లాలోని జరిగిన ఈ పేలుడులో మసీదు ఇమామ్ ఉన్నట్లు కాబూల్ పోలీసు ప్రతినిధి ఫెర్డస్ ఫరామార్జ్ తెలిపారు. వారం రోజుల కిందట ఒక పాఠశాల వద్ద జరిగిన పేలుడులో 80 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. రంజాన్ ప్రార్థనలు జరగడానికి ముందే.. మసీదులో పేలుడు పదార్ధాలను అమర్చినట్లు పోలీసుల ప్రతినిధి ఫెర్‌దావస్ ఫరమార్జ్ తెలిపారు. ప్రార్థనలు ప్రారంభమైన కొద్ది సమయానికే బాంబు పేలిందని, అయితే దీనిపై ఏ తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మసీదు నుంచి పెద్ద శబ్దం వచ్చింది. కళ్లముందే ధ్వంసమైంది. పెద్దల, పిల్లల అరుపులు, ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుంటే చాలా మంది రక్తపు మడుగులో కనిపించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు చనిపోయారని’ తెలిపారు. ఈ పెలుడు పై విచారణ మొదలుపెట్టినట్లు కాబూల్ పోలీసులు తెలిపారు. ( చదవండి: 500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’ ) -
రేపే రంజాన్
సాక్షి హైదరాబాద్: ఈద్–ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను ఈనెల 14న జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ( నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బుధవారం ఎక్కడా నెలవంక కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని.. శుక్రవారం రంజాన్ జరుపుకోవాలని సూచించారు. కాగా, కరోనా కారణంగా ఈద్గా, మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్ని ధార్మిక సంస్థల మతగురువులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
జెరూసలేంలో రణరంగం: 20 మంది మృతి
జెరూసలేం: పవిత్ర నగరం జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంగణంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుతున్న పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయిల్ పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో 305 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. వీరిలో 228 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మొత్తం 20 మంది ఘర్షణల్లో మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మరోవైపు 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు. ఏడుగురు ఇజ్రాయిల్ పౌరులు కూడా గాయాలపాలైనట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రమైన క్షేత్రాల్లో అల్–అక్సా మసీద్ కూడా ఒకటి. రంజాన్ మాసంలో ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పాలస్తీనావాసులు వస్తుంటారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తూర్పు జెరూసలేం శివారులోని షేక్ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయెల్ సెటిలర్లు ఆక్రమించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఆగ్రహంతో రగిలిపోతు న్న పాలస్తీనియన్లు సోమవారం ఉదయం ప్రార్థనల సందర్భంగా ఇజ్రాయిల్ పోలీసులపై విరుచుకుపడ్డారు. మసీదు బయట గస్తీ కాస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ప్రతిదాడికి దిగా రు. అల్–అక్సా ప్రాంగణం రణరంగాన్ని తలపిం చింది. పాలస్తీనా ప్రజల విషయంలో ఇజ్రాయిల్ తీరును అంతర్జాతీయ సమాజం తప్పుపడుతోంది. విమాన దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు అల్–అక్సా మసీదు కాంపౌండ్ నుంచి ఇజ్రాయిల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గాజాలోని హమాస్ మిలిటెండ్ సంస్థ డిమాండ్ చేసింది. అనంతరం జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు వినిపించాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లో పేలుడు భారీ పేలుడుతో సోమవారం ఉత్తర గాజా స్ట్రిప్ వణికిపోయింది. ఈ ఘటనలో 9మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు ప్రకటించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా వైమానిక దాడులకు దిగామని ఇజ్రాయిల్ తెలిపింది. చదవండి: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి -
మసీద్ నిర్మాణంలో వెల్లివిరిసిన మత సామరస్యం
అయోధ్య: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకపక్క ఘనంగా జరుగుతున్న తరుణంలో అయోధ్యలో నూతన మసీదు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య సమీపంలోని ధనిపూర్ గ్రామంలో మసీదు ప్రాజెక్టు పనులను లాంఛనంగా ఆరంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సున్నీ వక్ఫ్ బోర్డు మసీదు ట్రస్టును ఏర్పాటు చేసిన ఆరునెలలకు ప్రాజెక్టు పనులు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ జాతీయ పతాకం ఎగురవేశారు. ట్రస్టులోని ఇతర సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ప్రజలు హాజరై హర్షం ప్రకటించారు. గ్రామంలోని ఒక సూఫీ ప్రార్ధనా స్థలం పక్కన ఐదు ఎకరాలను మసీదు కోసం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు హిందువులు మసీదుకు విరాళాలు ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఎస్ నాయకుడు అనిల్ సింగ్ కూడా ఉన్నారు. గతేడాది మసీదు ప్రాజెక్టు కోసం తొలి విరాళాన్ని లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన రోహిత్ శ్రీవాస్తవ ఇచ్చారు. అయోధ్యలో రామ జన్మభూమి ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడ మసీదు నిర్మించడాన్ని హిందువుల్లో ఎక్కువమంది సమర్ధిస్తారని ఈ సందర్భంగా అనిల్ సింగ్ తెలిపారు. -
అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
లక్నో: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి.. మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దాదాపు 5 ఎకరాల విస్తీరణంలో మసీదు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలను ప్రారంభించామని, దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చామని, ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గత నెలలోనే ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు నమూనాను ఆవిష్కరించిందని, సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం జరుగుతుందని, మసీదు నిర్మాణంపై భారీ గాజు గోపురం కలిగివుంటుందని ఆయన వివరించారు. మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే ట్రస్ట్ సభ్యులందరూ సమావేశమై మసీదు పేరును నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, మసీదు నిర్మించబోయే స్థలం.. రామ జన్మభూమిలోని రామ మందిర నిర్మాణ స్థలికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామమందిరం, మసీదు రెండూ ఒకే జిల్లాలో ఉండటం విశేషం. -
అయోధ్యలో మసీదు..
లక్నో: వచ్చే యేడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల చేసింది. గత యేడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా వచ్చే యేడాది ప్రారంభంలో పునాది రాయి వేయవచ్చునని భావిస్తున్నారు. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టి, రెండో దశలో ఆ ఆసుపత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది. ఈ మసీదుకి ఇంకా పేరు నిర్ణయించలేదని, చక్రవర్తిగానీ, రాజు పేరుమీదగానీ మసీదు ఉండబోదని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ పేర్కొంది. ఈ ట్రస్ట్ ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోనికి తీసుకొని అయోధ్యలో మసీదు, దానిపక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్ని విడుదల చేసింది. -
అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఇదిగో ఇలా!
లక్నో: అయోధ్య జిల్లాలో సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు తలపెట్టిన మసీదు, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన నమూనా ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. వచ్చే ఏడాది శంకుస్థాపన చేసి, మొదటి దశలో భాగంగా మసీదు, ఆస్పత్రి నిర్మాణం చేపట్టి, రెండో దశలో ఆస్పత్రిని విస్తరించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయోధ్యలోని ధానీపూర్‌లో గల ఐదెకరాల స్థలంలో వీటిని నిర్మించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ మసీదుల డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) ట్రస్టు పేర్కొంది. (చదవండి: 1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?) ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ ఈ బిల్డింగు డిజైన్లను రూపొందించినట్లు పేర్కొంది. ఇక మ్యూజియంతో పాటు ఇండో ఇస్లామిక్ సంస్కృతీ సాహిత్యాలపై పరిశోధనలు చేసే విధంగా ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం విదితమే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఇక ఈ స్థలాన్ని స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్‌బోర్డు.. మసీదు నిర్మాణానికై ఐఐసీఎఫ్‌ను ట్రస్టు ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా.. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగష్టులో భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. -
మసీదు పెద్దకు భారీ జరిమానా: ఎందుకంటే..
లక్నో : మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయటానికి అనుమతించిన మసీదు పెద్దకు భారీ షాక్ తగిలింది. ఈ విషయంపై భగ్గుమన్న మసీదు కమిటీ మసీదు పెద్దకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, వినయ్‌పుర్‌కు చెందిన మనుపాల్ భన్సాల్ ‘జనసంఖ్య సమాధాన్ ఫౌండేషన్’కు జాతీయస్థాయి వైస్ ప్రెసిడెంట్. ఓ రోజు ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమం కోసం గ్రామంలోని మసీదులో కూర్చోవటానికి మసీదు పెద్ద అలీ హాసన్ అనుమతి అడిగాడు. ఆయన సరే నన్నాడు. కార్యక్రమం మొదలవగానే మనుపాల్ హనుమాన్ చాలీసా పారాయణం చేశాడు. అయితే కార్యక్రమం జరుగుతున్నంతసేపు పెద్దగా పట్టించుకోని మసీదు కమిటీ పెద్దలు ఆ తర్వాత సీరియస్ అయ్యారు. ( బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు ) అలీ, మనుపాల్‌లను పిలిచి పంచాయితీ పెట్టారు. ఇద్దరూ చెరో 5 లక్షల రూపాయలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చేసేదీమీ లేక సరేనని, కమిటీ చెప్పిన కాగితాలపై సంతకం చేసి వచ్చేశారు. దీనిపై అలీ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు మనుపాల్ నా దగ్గరకు వచ్చి మసీదు లోపల కూర్చోవటానికి అనుమతి అడిగాడు. నేనెలా కాదనగలను. ప్రతీ ఒక్కరికి దేవుడి సన్నిధిలో కూర్చునే హక్కు ఉంటుంది. ప్రస్తుతం నన్ను మసీదునుంచి బయటకు పంపేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ( గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! ) -
మసీదు తొలగింపు పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరున్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మధుర జిల్లా కోర్టు శుక్రవారం స్వీకరించింది. ఇదే అంశంపై గత నెలలో విచారణకు మధురలోని సివిల్ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపేందుకు జిల్లా జడ్జి సాధనా రాణి థాకూర్ అంగీకరించారు. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేశారు. కాగా మధుర శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రదేశంలో కట్ర కేశవ్ దేవ్ దేవాలయానికి చెందిన 13 ఎకరాల స్థలంలో 17వ శతాబ్దంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’ అయితే శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని 1968లో మధుర కోర్టు ఆమోదించింది. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్.. ఈద్గా ట్రస్టు మేనేజ్మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్లో ఆరోపించారు. మొగల్ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆరోపించారు. కాగా శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి షాహీ ఈద్గాహ్ మసీదు ఆక్రమణను తొలగించాలనే అంశంపై మధురలోని సివిల్ జడ్జి కోర్టులో సెప్టెంబర్ 30న పిటిషనర్ విష్ణు జైన్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ కేవలం భక్తుడైనంత మాత్రాన భగవంతుడి తరపున కోర్టులో కేసు వేయడానికి అధికారం లేదని చెబుతూ పిటీషన్‌ను కొట్టివేసింది. -
మసీదు ఎక్కడ నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ఆవరణలో భవనాలతోపాటు కూల్చిన మసీదును తిరిగి అదే ప్రదేశంలోనే నిర్మిస్తున్నారా ? లేదా మరో చోటా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మసీదును యథాస్థానంలో కాకుండా మరో చోట నిర్మించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూల్చిన జాగాలోనే నిర్మించేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్ జావిద్, మహ్మద్ అఫ్జలుద్దీన్, ఖాజా ఐజాజుద్దీన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సచివాలయం ఆవరణలో మసీదు నిర్మిస్తామని ప్రభుత్వం సింగిల్ జడ్జి దగ్గర హామీ ఇచ్చింది కదా? అదే అంశంపై మళ్లీ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది యాసర్ మమూద్ని ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యమంత్రి స్వయంగా మసీదు, ఆలయం నిర్మిస్తామని పత్రికా ముఖంగా ప్రకటించారని, ఇంకా సచివాలయం నూతన భవన నిర్మాణం ప్రారంభం కాకముందే సందేహాలు ఎందుకని ప్రశ్నించింది. మసీదు నిర్మాణం చేపట్టకపోతే అప్పుడు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. అయినా దేవున్ని ఎక్కడి నుంచైనా ప్రార్థించుకోవచ్చుకదా? ఫలానా దగ్గర మాత్రమే ప్రార్థన చేయాలని ఎక్కడుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే మసీదును ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలో స్పష్టత లేదని, కూల్చిన ప్రదేశంలోనే నిర్మించాలని మమూద్ నివేదించారు. మసీదు 647 గజాల విస్తీర్ణంలో ఒక మూలకు ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం 1,500 చదరపు అడుగులు మాత్రమే మసీదుకు కేటాయిస్తామంటోందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నూతన సచివాలయం నిర్మిస్తున్నారని, మసీదు నిర్మించిన భూమి వక్ఫ్ బోర్డు ఆస్తి అని, దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని మమూద్ వివరించారు. వక్ఫ్ చట్టంతోపాటు భూసేకరణ చట్టం నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని వివరించారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని మరో వందేళ్ల వరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సచివాలయం నిర్మించడం వ్యక్తిగత ప్రయోజనం ఎలా అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చని, ఇందుకు వక్ఫ్ బోర్డు అనుమతి కోరవచ్చని పేర్కొంది. ఉద్ధేశ్యపూర్వకంగా ప్రభుత్వం మసీదును కూల్చలేదని, ప్రభుత్వ ఖర్చుతో మసీదును నిర్మిస్తామని, అయితే ఎక్కడ నిర్మిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని తెలియజేస్తానని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం... వక్ఫ్ బోర్డుతోపాటు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో అక్టోబరు 1లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. -
దేవుడికి ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కూల్చివేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఖర్చుతో నూతన మసీదును నిర్మిస్తామని చెప్పారు. మసీదును ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరారు. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని తెలిపింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వాలు ఆ పని చేయవని తెలిపింది. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబందించి నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. -
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్ గ్యాస్‌పైప్‌లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్‌లైన్ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
అక్కడికెళ్లి ఏం చూస్తారు?
సాక్షి, హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి ప్రజాప్రతినిధులు వెళ్లి ఏం చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గుడి, మసీదు కూల్చామని ప్రభుత్వమే ప్రకటించిందని, ఈ విషయం ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చిందని, అలాంటప్పుడు అక్కడ కొత్తగా చూసి శోధించాల్సింది ఏముందని ప్రశ్నించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతివ్వాలని కోరినా ప్రభుత్వం అనుమతించట్లేదని, ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలం టూ కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాది అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలేవీ లేవం టూ అభ్యర్థనను తిరస్కరించింది. 138 ఏళ్ల పురాతనమైన గుడిని కూల్చారని, అప్రకటిత నిషేధం విధించి ఎవరినీ కూల్చివేత ప్రదేశాలకు అనుమతివ్వడం లేదని వారి తరఫు న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి నివేదించారు. జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉంది కాబట్టే ఎవరినీ అనుమతించట్లేదన్న అనుమానాలున్నాయని, ప్రజాప్రతినిధులు అక్కడికెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలపాలనుకుంటున్నారని వివరించారు. ‘నిధులు వెలికితీస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లో ఒక బాబా సమాధిలోకి వెళ్లాడు. నిధి వెలికి తీయడమేమోగానీ సమాధి నుంచి మళ్లీ ఆయన బయటకు తిరిగి రాలేదు. అలాగే సచివాలయంలోని జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్తామనడం సరికాదు. అక్కడ నిధి ఉందని ఏ విభాగం ధ్రువీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వాదనలు వినిపించడం సరికాదు’ అని ధర్మాసనం సూచించింది. సందర్శనకు అనుమతించండి సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీమంత్రి మహ్మద్ అలీ షబ్బీర్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖ లు చేశారు. సచివాలయం భవనాల కూల్చి వేత ప్రదేశానికి అనుమతించాలంటూ గత నెల 27న, 30న డీజీపీకి వినతిపత్రం సమర్పించినా స్పందన లేదన్నారు. 25.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న సచివాలయం 10 బ్లాకులుగా ఉందని, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేత పనులను రహస్యంగా చేపడుతున్నారని తెలిపారు. నల్లపోచమ్మ దేవాలయం, మసీదు కావాలని కూల్చలేదని, తిరిగి వాటిని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అనేక అనుమానాలకు ఆస్కారమిస్తోందన్నారు. నిజాం 132 ఏళ్ల క్రితం నిర్మించిన జీ బ్లాక్ కింద నిధి ఉందనే వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉండి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నారు. ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే సచివాలయం చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలోకి ప్రజలనెవరినీ అనుమతించలేదని తెలిపారు. సచివాలయం సందర్శనకు అనుమతించేలా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
యోగి వ్యాఖ్యలపై దుమారం
లక్నో : అయోధ్యలో నిర్మించే మసీదు ప్రారంభానికి ఆహ్వానిస్తే తాను హాజరు కాబోనని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు యోగి ఆదిత్యానాథ్ తాను చేసిన ప్రమాణానికి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించారని ఎస్పీ ప్రతినిధి పవన్ పాండే విమర్శించారు. రాష్ట్రమంతటికీ ఆయన ముఖ్యమంత్రని, హిందువులకు మాత్రమే కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న హిందూ, ముస్లింలందరికీ ఆయనే ముఖ్యమంత్రని..ఆయన అలా మాట్లాడటం గౌరవం అనిపించుకోదని పాండే అన్నారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యానాధ్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఓ యోగి, హిందువుగా తాను మసీదు ప్రారంభానికి వెళ్లనని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రిగా మీరు నన్ను అడిగితే ఏ విశ్వాసం, మతం, కులంతో నాకు ఎలాంటి సంబంధం లేదు..ఒక యోగిగా మీరు నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లబోను..హిందువుగా నా ప్రార్ధనా పద్ధతులను అనుసరించడం నా కర్తవ్యం..అందుకు అనుగుణంగా నడుచుకుంటా’నని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తాను వాదిని కాదు..ప్రతివాదినీ కాదని అంటూ తనను పిలిచినా పిలవకపోయినా తాను హాజరుకానని..అసులు తనకు అలాంటి ఆహ్వానం అందబోదని ఆయన వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై ఎస్పీ మండిపడింది. ఆయన తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. చదవండి : మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా? -
‘గురుద్వార్‌ను మసీదుగా మార్చడాన్ని ఖండిస్తున్నాం’
చండీగఢ్ : లాహోర్‌లోని చారిత్రాత్మక గురుద్వార్‌ను మసీదుగా మార్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం ఖండించారు. ఈ అంశంపై భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పంజాబ్ సీఎం స్పందిస్తూ..సిక్కుల సమస్యలను పొరుగు దేశానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘లాహోర్‌లోని పవిత్ర గురుద్వార్ శ్రీ షాహిది అస్తాన్‌ను మసీదుగా మార్చడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిక్కుల గౌరవ ప్రదేశాలను కాపాడటానికి పంజాబ్ ఆందోళనలను పాకిస్తాన్‌కు బలంగా తెలియజేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతున్నాం’ అని సింగ్ ట్వీట్ చేశారు. (పంజాబ్‌లో పెన్షన్ స్కామ్ కలకలం) కాగా గురుద్వార్ షాహిది అస్తాన్ 1745లో భాయ్ తరు సింగ్ ప్రాణాంతకంగా గాయపడిన ప్రదేశంలో నిర్మించిన చారిత్రక మందిరం. గురుద్వార్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. లాహోర్‌లోని గురుద్వార్‌ను మసీదుగా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలపై పాకిస్తాన్ హైకమిషన్‌కు భారత్ సోమవారం తీవ్ర నిరసన తెలిపింది. ఈ సంఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఈ విషయంపై దర్యాప్తు జరిపి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు పిలుపునిచ్చినట్లు ఎంఈఎం ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. పాకిస్తాన్లో మైనారిటీ సిక్కు సమాజానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. (కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు) -
తబ్లిగీ కేసులు అనడంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా మరణించిన కొన్ని కేసులను తబ్లిగీ జమాత్, మసీదు, మర్కజ్ కేసులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ మాటలు వాడకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిని తక్షణం నియంత్రించాలని లాయర్లు ఫోజియా రహమాన్, ఖయ్యాముద్దీన్‌ల ద్వారా ఎం.ఎం.కశ్యప్ అనే న్యాయవాది పిటిషన్‌ను దాఖలు చేశారు. మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగీ జమాత్ జరిగిన తర్వాత కేజ్రీవాల్ ట్విట్టర్లో ఉద్దేశపూర్వకంగానే పలు కోవిడ్ కేసులను మసీదు మర్కజ్ కేసులుగా పేర్కొన్నారని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలతో సమాజంలో ఒక మతం పట్ల వ్యతిరేకత, ద్వేషం పెరిగిందన్నారు. ఈ పిటిషన్ 20న విచారణకు రానుంది. -
మసీదుకు సీల్ వేసిన ఢిల్లీ అధికారులు
-
నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్లో ఈ నెల నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు మసీదుకు సీల్ వేశారు. అలాగే మర్కజ్లో ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై పోలీసు కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మర్కజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో అక్కడి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. (తెలంగాణలో కరోనా కల్లోలం) కాగా మర్కజ్ ప్రార్థనలకు ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన దాదాపు 280 మంది హాజరయ్యారు. దీంతో ఆ ప్రార్థనలో పాల్గొన్న వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ఢిల్లీ వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన కరోనా మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మర్కజ్లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీనిలో తెలంగాణకు చెందిన ఆరుగురు, కశ్మీర్‌కు చెందిన ఒకరు మరణించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరోవైపు ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందికిపైగా కరోనా అనుమానితులను అధికారులు క్వారెంటైన్‌ను తరలించారు. వీరిలో ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రభుత్వ కోరుతోంది. ఇక ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడపడుతున్నారు. -
మసీదులో హిందూ పెళ్లి
అలప్పుజ : కేరళలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదులో ఆదివారం హిందూ పెళ్లి జరిగింది. మసీదు ఆవరణలో హిందూ పూజారి ఆధ్వర్యంలో అంజు, శరత్‌లు ఏకమయ్యారు. ఈ పెళ్లికి వారి బంధుమిత్రులతో పాటు మసీదు పెద్దలు హాజరవడం విశేషం. పెళ్లి అనంతరం శాకాహార విందు సైతం ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురి తల్లి మసీదు పెద్దల సహాయం అర్థించడంతో ఈ పెళ్లి సాకారమైంది. పెళ్లికి మసీదు పెద్దలు 10 సవర్ల బంగారంతో పాటు రెండు లక్షల కట్నం కూడా ఇచ్చారు. 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు మసీదు కమిటీ కార్యదర్శి నుజుముదీన్ అలుమ్మూట్టిల్ చెప్పారు. ఈ పెళ్లిపై ఫేస్బుక్ వేదికగా కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి గుర్తుగా ఈ పెళ్లి నిలుస్తోందన్నారు. సీఏఏ, ఎన్నార్సీల పేరుతో దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పెళ్లి ఆదర్శనీయమైనదని చెప్పారు. -
యెమెన్ రక్తసిక్తం
దుబాయ్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ మరోసారి రక్తమోడింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా జరిగిన డ్రోన్ క్షిపణి దాడిలో 80 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు హుతి తిరుగుబాటుదారులే కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్ ప్రావిన్సు సైనిక శిబిరంలోని మసీదులో శనివారం సైనికులంతా ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. ఘటనలో 83 మంది సైనికులు చనిపోగా 148 మంది గాయపడ్డారని ఆస్పత్రి వర్గాల సమాచారం. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, నిహ్మ్ ప్రాంతంలో జరిపిన సైనిక చర్యలో పెద్ద సంఖ్యలో హుతిలను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా హుతి తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. తాజా ఘటనపై హుతి తిరుగుబాటు నేతలు స్పందించలేదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కీలకమైన హొడైడా నౌకాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం నుంచి వైదొలిగేందుకు ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత ఏడాది కాలంగా హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఒప్పందంలోని అంశాల అమలు నత్తనడకన సాగుతుండటంతో శాంతిస్థాపనపై నీలినీడలు అలుముకున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దేశంలో వేలాది మంది చనిపోగా లక్షలాదిగా జనం నిరాశ్రయులయ్యారు. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. -
ఆ మసీదు అందరిదీ...
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బిహార్, నలంద జిల్లాలోని మారి గ్రామం. అక్కడ 200 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఉపాధి కోసం ఆ గ్రామంలోని ముస్లిములంతా ఏనాడో వలసవెళ్లిపోయారు. మిగిలింది హిందువులే. ఒక్క ముస్లిం కూడా ఆ గ్రామంలో లేకుండా పోయినప్పటి నుంచి ఆ మసీదు సంరక్షణ బాధ్యతను గ్రామంలోని హిందువులే తీసుకున్నారు. ఆ ప్రార్థన మందిరాన్ని రోజూ శుభ్రంగా ఉడ్వడం... తడిగుడ్డతో తుడవడం దగ్గర్నుంచి పెచ్చులూడిపోతున్న గోడలకు మరమ్మతులు చేయడం.. పెయింటింగ్ వేయడం వంటి అన్ని పనులూ హిందువులే నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. అజా వేళ్లల్లో అజానూ వినిపిస్తున్నారు. ‘‘పెన్‌డ్రైవ్‌లో అజాను రికార్డ్ చేయించి టైమ్‌కి ఆ రికార్డ్‌ను వేస్తున్నాం. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఈ ఊళ్లో అందరికీ ఈ మసీదు పవిత్ర స్థలమే. ఈ ఊళ్లో ఏ హిందువుల ఇంట్లో పెళ్లయినా ఆ కొత్త జంట ముందుగా ఈ మసీదుకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఊరి సంప్రదాయం అది. ఈ చుట్టుపక్కల ఊళ్లల్లో హిందూముస్లింల మధ్య చాలానే గొడవలయ్యాయి. కానీ మా ఊళ్లో ఎలాంటి గొడవలూ జరగలేదు. మేమంతా కలిసిమెలిసే ఉంటూ వస్తున్నాం. ఉంటాం కూడా’’ అని చెప్తాడు ఆ మసీదును చూసుకుంటున్న మారి గ్రామ నివాసి ఒకరు. -
అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు
జలాలాబాద్: శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మసీదులో జరిగిన ఒక భారీ పేలుడులో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నన్ఘఢార్ రాష్ట్రంలో, జలాలాబాద్‌కు 50 కి.మీ.ల దూరంలోని హస్కమినలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మసీదు పై కప్పు కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్నారు. 36 మంది గాయపడ్డారని, వారిని జలాలాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఇది ఆత్మాహుతి దాడేనా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, తూర్పుఅఫ్గానిస్తాన్‌లో తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రసంస్థలు చురుకుగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో హింస తారస్థాయికి చేరిందంటూ ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసిన మర్నాడే ఈ దాడి జరిగింది. ఈ జూలైలో గతమెన్నడూ లేనంత హింస చోటు చేసుకుందని, ఐరాస గణాంకాలు సేకరించడం ప్రారంభించిన తరువాత, ఒక నెలలో హింసాత్మక ఘటనల్లో అత్యధిక సంఖ్యలో పౌరులు మరణించడం ఈ జూలైలోనేనని ఐరాస ఆ నివేదికలో పేర్కొంది. -
పిటిషన్ వేయడానికి మీరెవరు.. సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ముస్లిం మహిళలను మసీదులోకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అఖిల భారత హిందూ మహాసభ కేరళ విభాగం అధ్యక్షుడు దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం మహిళల తరుఫున పిటిషన్‌ను దాఖలు చేయడానికి మీరెవరని ఘాటుగా ప్రశ్నించింది. వారకి అన్యాయం జరగుతుందని భావిస్తే.. వారే స్వయంగా కోర్టు దృష్టికి తీసుకువస్తారని అప్పుడు ఖచ్చితంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. పిటిషన్ దాఖలు చేయడానికి మీకు ఎలాంటి అర్హత లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. వ్యక్తిగత ప్రచారం కోసమే పిటిషన్ వేశారని.. దీనిలో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ముస్లిం మహిళలను కోల్పోతున్నారని.. అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా వారిని కూడా మసీదులోకి అనుమతించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే దానిని స్వీకరించేందుకు ఎలాంటి మేరిట్ లేదని కోర్టు తోసిపుచ్చింది. కాగా గతంలో కేరళ హైకోర్టు కూడా పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని సుప్రీం ప్రస్తావిస్తూ.. దిగువ కోర్టు ఎందుకు కొట్టివేసిందో తెలుసుకోవాలని సూచించింది. -
స్వర్గవాసి ఆరాధన
ఒకసారి ప్రవక్త మహనీయులు మస్జిదె నబవీలో సహచరులతో సమావేశమై ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి మస్జిదులోకి ప్రవేశించాడు. ఆయన గడ్డం నుండి వజూ నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. అతన్ని చూసి ప్రవక్త మహనీయులు, ‘ఇతను స్వర్గవాసి’ అన్నారు.ప్రవక్త స్వయంగా స్వర్గవాసి అని చెప్పారంటే, ఈయనలో ఏదోప్రత్యేకత ఉండి ఉంటుంది, తెల్లవార్లూ దైవారాధనలోనే గడుపుతాడేమోని భావించిన ఒక సహచరుడు, అదేమిటో తెలుసుకోవాలని ఆయన్ని అనుసరించాడు.కాని తన అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇషా నమాజ్ అనంతరం దువా చేసుకొని పడుకున్న పెద్దమనిషి ఫజర్ నమాజు అజాన్ పిలుపునకు మాత్రమే లేచాడు. రాత్రంతా కనీసం ఒక్క నఫిల్ నమాజు కూడా చేయలేదు! ఈ రోజు ఆరోగ్యం బాగోలేక చెయ్యలేదేమో.. అనుకొని రెండవరోజు గమనించాడు. రెండవరోజూ అదే పరిస్థితి. అలా నాలుగురోజులు గడిచి పొయ్యాయి.చివరికి ఉండబట్టలేక ‘ప్రవక్తవారు మిమ్మల్ని స్వర్గవాసి అన్నారు. మీ ఆరాధనల్లోని ప్రత్యేకత ఏమిటి?’ అని ప్రశ్నించాడు.దానికాయన, ‘ప్రత్యేకత ఏమీ లేదు బాబూ!’ అన్నాడు.‘లేదు.. లేదు.. ఏదో ఉంది. దయచేసి చెప్పండి’ అని బతిమాలాడు.దానికాయన, ‘బాబూ.. ఏమీ లేదు కాని ఒక చిన్న విషయం. అదేమిటంటే, మనసును ఎప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకుంటాను. రవంత అసూయా ద్వేషాలు కూడా మనసులోకి రానివ్వను. ఇదొక్కటే.. ఇది తప్ప ఇంకెలాంటి ప్రత్యేకతా లేదు’ అన్నాడు.అందుకే ముహమ్మద్ ప్రవక్త వారు, ‘అగ్ని కట్టెల్ని భస్మం చేసినట్లు అసూయ సత్కార్యాలను భస్మం చేస్తుందని, నరకానికి తీసుకుపోతుందని చెప్పారు. మనసు స్వచ్ఛంగా నిష్కల్మషంగా లేకుండా ఎన్ని ఆరాధనలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. మనసులో ఎవరి పట్లా కుళ్లు, కుట్ర, ఈర్షా్యద్వేషాలు లేకుండా, నిష్కల్మష హృదయంతో అందరినీ ప్రేమించగలిగే వారికే స్వర్గం లభిస్తుందన్నది ఇందులోని సారాంశం. – మదీహా -
తల్లి
మాస్టర్ హమీద్ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాదులోని పహాడి మొహల్లా. అతని తండ్రి రషీదాబాద్‌లో కంచరపని చేస్తూ ఉండేవాడు.హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్దిరోజులు ముల్లా సాహెబ్ బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్టప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకున్నాడు.హమీద్ ఉర్దూ పాసయిన రోజుల్లో రషీదాబాద్‌లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది.ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెఖ్ఖ చూసుకుంటే డెబ్బై రూపాయలు మిగిలినవి. మిడిల్ ప్యాసయిన తరువాత హమీద్‌కు ఇంగ్లీష్ గూడా చదువుకొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోడం?వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండడంవల్ల హమీద్ రెండుమూడుసార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పదిహేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకున్నాడు.పోలీసు కానిస్టేబుల్ నవరుల్లాఖాన్ ఇల్లు ఎలాగా తెలుసుకోవడం!చచ్చిచెడి అతని ఇల్లు తెలుసుకున్నాడు. నవరుల్లాఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతను హమీద్‌ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోడానికి అవకాశం కలుగజేశాడు. నవరుల్లాఖాన్ ఇంట్లోనే ఉంటూ హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు.లెక్కల్లో హమీద్ నిధి.ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించాడు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమిలాడినా నవరుల్లాఖాన్ అంగీకరించనందున, హమీద్ విధిలేక అక్కడే ఉండిపోయాడు.ఆవిధంగా పదినెలల్లో హమీద్ డెబ్బయి రూపాయల రొక్కం సంపాదించాడు. తల్లి దగ్గరి నుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయాలు మనియార్డర్ పంపించింది. మొత్తం అతని దగ్గర ఎనభైరెండు రూపాయాలు పోగుపడినవి.స్కూలుకు వేసవి సెలవులు ఇచ్చారు.నవరుల్లాఖాన్ కూడా సెలవు పెట్టాడు.ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు.అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇంటి ముందు ఉన్న పనసచెట్టు అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం పాతికరూపాయల ఆదాయం వస్తూ ఉండేది.ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్‌కు వివాహసంబంధం మాట్లాడి సిద్ధం చేసి పెట్టింది. ఆ డబ్బు హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదోవిధంగా హమీద్‌ఖాన్ వివాహం పూర్తి చేసింది. పెళ్లి అయిన ఏడో రోజున తిరిగి హమీద్ ఢిల్లీకి వెళ్లాడు. ఆ సంవత్సరం పరీక్షల్లో పాసయ్యాడు.ఇక ఉద్యోగం! ఒక ప్రైవేటు స్కూల్లో కోద్దిరోజులు నౌకరీ కుదిరింది. తరువాత ఇంకొక స్కూళ్లో, ఆ తరువాత ఇంకొంక స్కూల్లో, చివరకు ఒక స్కూల్లో అతని పనిచూసి సంతోషించి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతడి ఉద్యోగం ఖాయం చేశాడు.నెలకు ఇరవైరూపాయల జీతం. ఇక వేరే కాపురం పెడతానని హమీద్ నవరుల్లాఖాన్ను అడిగాడు.ఒంటరి కాదు. భార్యను కూడా తీసుకొని రమ్మని నవరుల్లాఖాన్ మూడురూపాయల అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టాడు. హమీద్‌ఖాన్ రషీదాబాద్ వెళ్లి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు.రషీదాబాద్‌లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది. హమీద్ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయారు. హమీద్ భార్యకు కూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్‌కు ఎండదెబ్బ తగిలి పదిహేనురోజులు మంచంలోనే ఉండిపోయాడు. అటు స్కూల్లో పని పెరిగిపోయింది. ఇటు జీతం మప్పైరూపాయలయింది. పది రూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కాని ఢిల్లీలో ఆ డబ్బు అతనికి ఏమాత్రం సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. కాని డబ్బు లేక తల్లిని చూడాలని ఎంత కుతూహలమున్నా హమీద్ రిషీదాబాదుకు పోలేకపోయాడు.రోజు ఉదయమే లేచి మసీదుకు పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్లో నుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతని అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ ముసలిచాకలి జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకుంటూ చాకిరేవుకు పోతూ కనబడేది, కాని ఎందువల్లనో అయిదు రోజుల నుంచి జానకి కనబడడం లేదు. హమీద్‌కు ఆశ్చర్యం వేసింది. జానకి కనబడని రోజే లేదు. ఎందువల్ల కనపడడం లేదో తెలుసుకుంటానని జానకి ఇంటికి వెళ్లాడు. జానకి ఏమైందని అక్కడి వాళ్లను ప్రశ్నిస్తే నిన్నరాత్రి చనిపోయిందని వాళ్లు జవాబు చెప్పారు.జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్‌కు ఏమి సంబంధం ఉన్నదో భగవంతునికి తెలియాలి! స్కూలుకు పోయాడు. అక్కడ అతనికి ఏమీ తోచలేదు. ఏదోవిధంగా కాలక్షేపం చేసి స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి చేరాడు.‘‘ఒంట్లో బాగలేదా?’’ అని అడిగింది భార్య.ఏమీ వినిపించుకోలేదు, తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవ, స్టేషన్‌కు పోయి రషీదబాద్కు టికెట్ కొన్నాడు. రైల్లో పడ్డాడు. బక్రీదురోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజు లేదు. ఖుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. కళ్ల ముందు ముసలితల్లి కనిపించడం ఆరంభించింది. తెల్లబడిపోయిన వెంట్రుకలు, ముడతలు పడిపోయిన శరీరం, వంగిపోయిన నడుము, భార్య, పిల్లల మీద మక్కువ వల్ల హమీద్ ముసలితల్లిని మరిచిపోలేదు. నాలుగైదు సార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనియార్డర్ కూడా పంపించాడు. ఆ డబ్ము పంపినప్పుడల్లా, తనూ, తన పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు, తన తల్లికి ఉత్తరాలు రాసినప్పుడు పిల్లల చేత కూడా ఆ ఉత్తరాల మీద ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తన తల్లి సంతోషించవలెనని తన అభిప్రాయం. అతని భార్య కూడా రాయడం నేర్చుకుంది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంటరోజుల్లో తప్పక వస్తానని రాసేవాడు. కుటుంబంతో పోవాలి. పళ్ళు ఫలాలు తీసుకొని పోవాలి. అందుకు డబ్బు కావాలి. వచ్చే జీతంతో తిండి గడపడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణాన్ని ఆపుకునేవాడు. కాని జానకి మరణవార్త విని గుండె పగిలినట్లయి ఆగలేక ఒంటరిగా బయలుదేరాడు.బక్రీదునాడు సూర్యస్తమయం సమయానికి హమీద్ రషీదబాదు చేరాడు. పై నుండి భోరున వర్షం కురవడం ఆరింభించింది. అతనికి స్మృతి వచ్చినట్లయింది, గొడుగు మాత్రం చేతిలో ఉన్నది. అయ్యో! బట్టలన్నా తెచ్చుకోలేదు అనుకున్నాడు. గొడుగు వేసుకొని బయలుదేరాడు. జనం నివసించే చోట నీళ్లు నిలవకూడదనే ఆరోగ్యసూత్రం గ్రామస్తులకు అర్థమయ్యేది కాదు, అర్థమైనా వాళ్లు పట్టించుకునే వాళ్లు కారు. మోకాళ్లలోతు నీళ్లలో పడుతూ, లేస్తూ మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. తలుపు లోపల వేసి ఉన్నది. తలుపు తట్టాడు. ‘‘అమ్మా! అమ్మా!’’ అని పెద్దగా పిలిచాడు.లోపల నుంచి ఒక లావుపాటివాడు వచ్చి తలుపు తెరిచాడు. బక్రీదు పిండివంటలన్నీ తిని అరగడానికి నిద్రబోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు, హమీద్‌ను గుర్తుపట్టి మూడుసంవత్సరాల క్రితం ఆ ఇల్లును కొన్నట్లున్నూ, హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో ఉన్నదని చెప్పాడు. తలుపు వేసుకొని లోపలికి వెళ్లిపోయాడు.హమీద్‌కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు అనుకున్నాడు. పనసచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని చాలా పొరపాటు చేశాననుకున్నాడు.ఆ తల్లికి ముఖం చూపించడం ఎలా?ఎంత స్వార్థం తనలో బలిసిపోయింది. తన పిల్లలు మంచినీ, తన మంచినీ తను చూసుకున్నాడేగాని ముసలితల్లి గురించి ఆలోచించనైనా లేదుగదా అని పశ్చాత్తాపపడ్డాడు. మెల్లగా దర్జీ ఆమె ఇంటిదగ్గరకు కాళ్లీడ్చుకుంటూ చేరాడు. తలుపు తట్టబోయినాడు. చెయ్యి లేవలేదు.దర్జీ సోతీ వచ్చి తలుపు తీసింది. హమీద్‌ను గుర్తుపట్టింది.‘‘హమీద్ వచ్చాడు. హమీద్ వచ్చాడు’’ అంటూ లోపలకు పరుగెత్తింది. హమీద్ తల్లి ఈమధ్య అశక్తత వల్ల ఇంట్లో అటూ ఇటూ మనలడం కూడా మానుకున్నది. ఆమె కళ్లు కూడా ఏమీ కనిపించేవికావు. కాని హమీద్ వచ్చాడనడంతోనే ఆ సంతోషంలో ఎక్కడి నుండి శక్తి వచ్చిందో గభీమని లేచి వాకిట్లోకి దూకి హమీద్‌ను ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది.ఆమె శరీరంలో ఎముకలు తప్పా ఏమీలేవు.తల మీద వెంట్రుకలు తెల్లబడిపోయినవి. నడుము వంగిపోయింది. మెడ శిరస్సు భారాన్ని కూడా సహించలేకుండా ఉన్నది. ప్రేమ వల్లనో, ముసలితనం వల్లనో ఆమె శరీరం వణకనారంభించింది.చాలాసేపూ ఇద్దరూ మాట్లాడలేకపోయారు. చివరికి తల్లి మెల్లగా కంఠం పెకిలించుకొన్నది.‘‘నాయనా! చాలా దూరం నుండి వచ్చావు. బట్లలన్నీ తడిసిపోయాయి. బట్టలు మార్చుకో. టీ తీసుకొని వస్తాను. పిల్లలంతా కులాసాగా ఉన్నారా!’’ అని ప్రశ్నించింది.‘‘అమ్మా! ఇల్లు అమ్మివేశావా? నాకు చెప్పలేదేమిటి?’’ అని అడిగాడు.‘‘నాయనా! నీకు తెలిస్తే మాత్రం నువ్వేమీ చేస్తావు. నీకు మాత్రం కష్టాలు తక్కువ ఉన్నవి గనుకనా! ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది. నీ కష్టాలు నీకు గాక నా బాధ కూడా నీకెందుకు నాయనా? ఈ జన్మలో నిన్ను చూడలేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు’’ అన్నది.హమీద్ కళ్ల వెంట బొటా బొటా నీళ్లు కార్చాడు. ఇల్లు నలువైపులా కలయజుశాడు. ఎదుట మంచం మీద దర్జీ ఆమె ఇద్దరు పిల్లలూ నిద్రబోతున్నారు. ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు.దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది. ఆమె కొనుక్కున్న రవిక వీపు మీద చిరిగిపోయి ఉన్నది. బట్టలు మాత్రం తెల్లగా ఉన్నవి. బక్రీదు పండుగ కదూ!‘‘అమ్మా! రోజూ నువ్వు ఇక్కడనే నిద్రపోతుంటావా?’’‘‘కాదు నాయనా! ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకుంటుంది. నేను అవతలి గదిలో పడుకుంటాను’’ అన్నది తల్లి.‘‘అమ్మా! నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? చేతులు పనిచేయనిస్తున్నాయా’’‘‘చేతులు బాగానే ఉన్నవిగాని కళ్లు మాత్రం నెలరోజుల నుండి కనబడడం లేదు నాయనా’’‘‘కళ్లు కనబడడం లేదా?’’ అన్నాడు ఆతురతతో హమీద్.తల్లి హమీద్ తలను చేతితో నిమిరింది. చేయి బుగ్గలదాకా పోనిచ్చింది. అతని తలను తన హృదయానికి హత్తుకుంది. చిరునవ్వు నవ్వింది.‘‘కళ్లు కనబడడం లేదా అంటున్నావా నాయానా! నీవు కనబడుతూనే ఉన్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు. అంతే, మిగిలిన వస్తువులు ఏమీ కనబడవు. చిన్నపిల్లవాడు కులాసాగా ఉన్నాడ? వాడి వయస్సెంత?’’ అని అడిగింది. ‘‘సంవత్సరంన్నర’’‘‘అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి’’ అంటూ ఒక పాత బట్టల మూట విప్పి అందులో నుండి ఒక చొక్కాను, బుటేదారీ పనిచేసియున్న ఒక టోపీని బయటకు తీసింది.‘‘మజీద్ కోసం ఇవి తయారుచేశావా?’’ అని హమీద్ కన్నీళ్లు కార్చాడు.‘‘కాదు నాయానా! సలమా కోసం కుట్టి తయారుచేశాను. పంపుదామంటే నీవు రానేలేదు. తరువాత సలామా చచ్చిపోయిందని ఉత్తరం రాశావు’’ అని చొక్కా వంక చూసి కన్నీళ్లు పెట్టుకొన్నది. లేచి లోపలికి వెళ్లిపోయింది. టీ తెచ్చి ఇచ్చింది. తాగాడు. తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు.ఏమిటేమిటో ఆలోచనలు!హమీద్ తనను తాను మరచిపోయినాడు.అలా రెండు గంటలు గడిచింది.పక్క ఇంటి నసీబన్ కూడా వచ్చింది.నసీబన్, హమీద్ తల్లి, సోతి వంట ఇంట్లో ఏమిటేమిటో చేస్తూ ఉండిపోయినారు.సుమారు ఎనిమిది గంటలకు హమీద్ తల్లి బయటికి వచ్చి–‘‘నాయానా! భోజనానికి లేవమ’’న్నది.అప్పటికి హమీద్‌కు కొద్దిగా నిద్రపట్టింది. ఉలిక్కిపడి లేచాడు.బీదస్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె తయారుచేసి ఉంటుందనుకున్నాడు. కాని వడ్డించిన పదార్థలను చూసి ఆశ్చర్యపడ్డాడు.కబాబు, మేక గుండెకాయ కూర, పరాఠాలు, మినప్పప్పు పప్పు, మామిడికాయ పచ్చడి, ఒక కప్పులో మీగడ, ఒక ప్లేటులో పండిన మామిడి పండు ముక్కలు ఘుమఘుమలాడుతున్నవి. ఇంత బీదతనంలో ఉన్న తల్లి ఈ సామానంత ఎలా సేకరించిందా అని ఆలోచించాడు. భోజనం చేశాడు.భోజనం చేస్తున్నంతసేపూ తల్లి దగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్పింది. కొసరి కొసరి వస్తువులు వడ్డించింది. తృప్తిగా భోజనం చేశాడు. లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు.దర్జీ ఆమె, నసీబన్ ఇద్దరూ బయటకు వెళ్లి కొంత సేపట్లో తిరిగివచ్చారు.తల్లి హమీద్ దగ్గరకు వచ్చింది.‘‘నాయనా! ఒక్కమాట చెపుతాను. వింటావా?’’ అని అడిగింది.హమీద్ ముఖం వెలవెలబోయింది. గుండె దడదడలాడింది.బహుశా తల్లి తనతో కూడా ఢిల్లీ వస్తానంటుందనుకున్నాడు. లోలోపల అనేక ఆలోచనలు! తనకు వచ్చే జీతం చాలా కొద్ది, ఢిల్లీలో ఆ కొద్ది జీతం మీద అంతమందీ బతకడం ఎలాగా? భార్య, పిల్లలూ, తల్లీ ఇంత మందిని తను పోషించగలడా! తల్లివంక అలాగే చూస్తూ ఉండి పోయినాడు. ‘‘నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి. నౌకరీదారుడివి. నేను పరాయివాళ్ల పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను? నసీబన్‌ను పంపించి ఖాన్సాహెబ్గారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది. ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనస్సుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను. భయపడుతున్నాను. నాయనా! నా కోరిక పూర్తి చేస్తావా?’’ అని భయపడుతూ అడిగింది.‘‘అదుగో, మంచం కూడా తెప్పించాను’’ అని ఎదుట పరిచి ఉన్న మంచం చూపించింది.తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది.నోట నుండి మాట రాలేదు.‘‘అమ్మా! నీ దగ్గర ఉండకపోతే నేను ఇంకెక్కడకు పోతాను?’’ అన్నాడు.తల్లి ఆనందభరితురాలయింది.హమీద్ శిరస్సును ఆఘ్రాణించింది. నసీబన్‌ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒక మూట విప్పి తెల్లటి దుప్పటి బయటకు తీసింది. ఆ దుప్పటి మీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి. ఆ మూటలో నుంచి రెండు దిండ్లు బయటకుతీసింది. తెల్లటి గలీబులు కుట్టి ఉన్నవి.చిన్న సీసాలో నుంచి తీసి గలీబులకు అత్తరు రాసింది.మంచం కింద ఒక పీక్దాసును పెట్టించింది. ఢిల్లీపూల నల్ల చెప్పుల జోడు–కొత్తది–మంచం కాళ్ల వైపున పెట్టి ‘‘నాయనా! అలిసిపోయినావు. ఈ మంచం మీద పడుకొని నిద్రబొమ్మన్న’’ది.హమీద్ ఈ తమాషా అంతా చూస్తున్నాడు.యా అల్లాహ్! ఈ సామానంతా ఎలా వచ్చింది? చివరకు తల్లిని అడిగాడు. రషీదాబాద్ కూడా చిన్న బస్తీలాంటి గ్రామమే. అన్నీ ఈ ఉళ్లోనే దొరికినవని జవాబు చెప్పింది.‘‘అమ్మా! భోజనం సంగతి సరే. ఈ చెప్పులు, ఈ పీక్దాసు, ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు?’’తల్లి వేడి వేడి కన్నీళ్లు కార్చింది.మాతృదేవతా వాత్సల్యం అనుపమానం!‘‘ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువులన్ని సేకరించాను. నీ కోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు గాచినవి. నాయానా! ఈ వస్తువుల్ని సేకరించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. సలమాను చూడనే లేదు’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.తల్లి మాటను విని శాంతిదేవత ఆ చిన్నగది నిండా తన రెక్కలను విప్పింది. ఇక ఎవరూ మాట్లాడలేదు.తెల్లవారింది. హమీద్ తల్లి ఇక కళ్లు తెరవలేదు. -
నెలంతా రోజా పరిమళాలు
సాయంత్రాలు ఇఫ్తార్ విందులతో వీధులన్నీ ఘుమఘుమలాడ బోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా సందడిగా మారనుంది. మసీదు మినార్లనుండి సైరన్ మోతలు వీనులవిందు చేయనున్నాయి. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించనుంది. మానవాళి పాపాలను తొలగించి, పునీతం చేసే పవిత్రరమజాన్ నెల ప్రారంభం కాబోతున్నది. మనిషిలోని దుర్లక్షణాలను హరింప చేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి. రమజాన్ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆధ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండువసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవనసాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్ లో పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్‌లో ఉపవాసాలు విధిగా నిర్ణయించ బడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్’ కూడా రమజాన్ లోనే ఉంది. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది.రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో ఒక చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్ నమాజులు ఆచరించబడతాయి. సాధారణ దానధర్మాలతోపాటు, ఫిత్రా’అనబడే ప్రత్యేక దానం కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్ ’ కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. అంతేకాదు, రమజాన్ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన ‘రోజా’ (ఉపవాసవ్రతం) యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి.నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన. దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది. ఇది అనాదిగా అన్నికాలాల్లో. అన్ని సమాజాల్లో చెలామణిలోఉన్నట్లు దైవగ్రంథం పవిత్రఖురాన్ చెబుతోంది.‘విశ్వాసులారా..! పూర్వప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’అంటే, ఉపవాస వ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్ధమవుతోంది. ఈ రోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్నిజాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. అందుకే దేవుడు సృష్టిలో ఏ జీవరాసికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుధ్ధికుశలత, విచక్షణా జ్ఞానం ఒక్కమానవుడికే ప్రసాదించాడు. కాని మనిషి తనస్థాయిని గుర్తించక, దేవుడు ప్రసాదించిన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇష్టానుసారం జీవితం గడుపుతూ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఎలా బతికినా ఇహలోక జీవితం సుఖంగా, సాఫీగా గడిచిపోతున్నదంటే ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ దైవం ముందు హాజరై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది, ఫలితం అనుభవించవలసి ఉంటుంది.అందుకని మానవుడు తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనతలవల్ల జరిగిన తప్పుల్ని తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపుకు మరలి సత్కార్యాల్లో లీనమై పోవాలి. దానికోసం పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. ఈ నెలలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. గోరంతచేసి కొండంత పొందవచ్చు. ఒక నఫిల్కు సున్నత్‌తో సమానంగా, సున్నత్‌కు ఫర్జ్‌తో సమానంగా, ఒక పర్జ్కు 70 ఫరజ్లతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మానవుడి ప్రతి ఆచరణకు పదినుండి ఏడు వందల రెట్లవరకు పుణ్యఫలం పెరిగిపోతుంది. అయితే ఒక్క ఉపవాసం మాత్రం వీటన్నిటికంటే అతీతం, ప్రత్యేకం. దీనికి ఒక పరిమితి అంటూ లేదు. ఉపవాసం ప్రతిఫలం అనంతం. అనూహ్యం. విశ్వప్రభువైన అల్లాహ్ తన అనంత ఖజానాలోంచి ఉపవాస ప్రతిఫలాన్ని స్వయంగా తానే అనుగ్రహిస్తానంటున్నాడు. అల్లాహు అక్బర్! కనుక అత్యంత భక్తిశ్రద్ధలతో రోజా పాటించి పరమ ప్రభువైన అల్లాహ్ నుండి నేరుగా ప్రతిఫలాన్ని అందుకొనే ప్రయత్నం చెయ్యాలి.మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధితో ఉపవాసాలు పాటించేవారి అంతర్గతంతో పాటు, బాహ్య శరీరంలోని పవిత్రాత్మనిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ, అన్నిరకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనతవల్ల ఏవో చిన్న చిన్న పొరపాట్లు దొర్లిపోవచ్చు. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్లనుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్ ప్రవక్త(స)ఫిత్రాలు చెల్లించమని ఉపదేశించారు. వీటివల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. సమాజంలోని పేదసాదలకు ఈ ఫిత్రాల ద్వారా కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని ‘దీనులు, నిరుపేదల భృతి’ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖసంతోషాలతో జీవితం గడుపుతూ, పరలోక సాఫల్యం పొందాలన్నది ఇస్లామ్ ఆశయం. అందుకే జకాత్ , ఫిత్రాద్ ఖ, ఖైరాత్ అంటూ రకరకాల దానధర్మాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన కార్యాచరణను ప్రతిపాదించింది. పవిత్రఖురాన్ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్షకు, సింహావలోకనానికి రమజాన్ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై వైఖరేంటి?
న్యూఢిల్లీ: మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ప్రార్థనలకు అనుమతించే విషయంలో వైఖరి వెల్లడించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ విషయమై పుణేకు చెందిన యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే, జుబేర్ అహ్మద్ నజీర్ అహ్మద్ పీర్జాదే అనే మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మేమిచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ పిటిషన్‌ను స్వీకరిస్తున్నాం. మరోవిధంగా అయితే, మీరు మాకు సరైన సమాధానాలు ఇవ్వలేరు’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లోని సమానత్వపు హక్కు మరో వ్యక్తి నుంచి పొందేందుకు కూడా వర్తిస్తుందా? మసీదులో ప్రభుత్వ పాత్ర ఎక్కడుంది? అని ధర్మాసనం ప్రశ్నించగా.. దేశంలోని మసీదులకు ప్రభుత్వ సాయం, గ్రాంట్లు అందుతున్నాయని పిటిషనర్ సమాధానం ఇచ్చారు. మసీదులోకి రానివ్వడం లేదంటూ తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బదులిచ్చారు. మహిళలను మసీదుల్లోకి రానివ్వవద్దంటూ మత గ్రంథాల్లో లేదని, పవిత్ర మక్కాతోపాటు కెనడాలోని మసీదుల్లోకి మహిళలు ప్రవేశించి ప్రార్థనాలు చేసుకునే వీలుందని పిటిషనర్ తెలిపారు. సౌదీలో మసీదులోకి మహిళల ప్రవేశంపై ఫత్వా ఉందన్నారు. కొన్ని చోట్ల మహిళలను లోపలికి అనుమతిస్తున్నా వారికి వేరుగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మనం దేశంలోని సున్నీల్లోనే మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉందని తెలిపారు. పురుషులతోపాటు మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు గల రాజ్యాంగ హక్కు కల్పించాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్రంతోపాటు న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ, జాతీయ మహిళా కమిషన్, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డ్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది. -
కన్నెత్తయినా చూడలేదు
శిరిడీలో బాబా అరవై ఏళ్లపాటు నడయాడితే, ఆ అరవై ఏళ్లపాటూ బాబా వెన్నంటే నడిచిన పునీతుడు మహల్సాపతి. సాయిప్రేమను సంపూర్ణంగా పొందిన మహల్సాపతి సదాచార సంపన్నుడు. సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ కలిగినవాడు. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోంచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జి కుక్క ఒకటి ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండు మూడుమార్లు దానిని అదిలించాడు. అయినా అది తన వెనకే రావడంతో విసుగెత్తి కర్ర తీసుకుని ఈడ్చిపెట్టి కొట్టాడు. పాపం ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘‘మహల్సా! పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తోంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది?’’ అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ. బాబాతో అన్నేళ్లు సావాసం చేసి కూడా మహల్సాపతి ఆ నీతిని గ్రహించలేకపోయాడు. తోటి ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉండడం, ఉన్నంతలో సత్కర్మలు ఆచరించడం, చిత్తశుద్ధితో మనసును పరిశుద్ధం చేసుకోవడం... ఇవే భగవంతునికి మనం ఇవ్వగల నివేదనలు. డా. కుమార్ అన్నవరపు -
స్వేదం చిందించనిదే సంపద దక్కుతుందా?
కుశాల్ చంద్ బాబా భక్తుడు. తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు షిడ్డీలోని మసీదే అతని ఆవాసం. ఏ పనీ చేయకుండా మసీదులోనే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలం పాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్‌చంద్‌ని దగ్గరకు పిలిచి, ‘‘నీకు పొలం ఉంది కదా! అందులో పంటలు పండించడం లేదా?’’ అని అడిగారు. ‘‘లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు’’ కుశాల్ చంద్ చెప్పాడు. ‘‘భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను’’ అని బాబా అతనికి చెప్పారు. కుశాల్ చంద్ పొలం మొత్తం దున్ని లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ ‘‘దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్’’ అని అడిగారు. కుశాల్‌చంద్ నిలువుగా దున్నానని చెప్పగానే, ‘‘ఈసారి అడ్డంగా దున్ని చూడు. తప్పకుండా దొరుకుతాయి’’ అని బాబా చెప్పారు. కుశాల్‌చంద్ అలా కూడా చేసి లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. ‘‘సరే, దొరక్కపోతే ఏం చేస్తాం! ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి అందులో మిరప విత్తనాలు చల్లు’’ అని సూచించారు బాబా. కుశాల్‌చంద్ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరప పంటన్నదే లేదు. కుశాల్‌చంద్ ఒక్కడే పండించాడు. దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. కుశాల్‌చంద్ తనకొచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు. సుఖం, కోరికలు, సంపద, కీర్తిప్రతిష్ఠలు ఏవైనా సరే ఆయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిదే సంపద దక్కదు. సాధన చేయనిదే ఏదీ సాధ్యం కాదు. భక్తి మంచిదే కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డం. పనిపాటలు చేసుకుంటూనే భగవంతుని నామాన్ని నిత్యం స్మరించుకో. ఇక నువ్వు చేసే పనికి తిరుగుండదు. నీ పనికీ ఆటంకం ఉండదు’’అని బోధించారు విపులంగా. డా. కుమార్ అన్నవరపు -
అప్పుడిచ్చిందే ధర్మం
‘‘ఏదీ ఆ సంచీ ఇటివ్వు, అందులో అయిదు వందల దీనారులు ఉండాలి.. నువ్వేమన్నా తీసుకున్నావా?’’ అని అన్నాడు ధనవంతుడు ఆత్రుతతో. అదొక మసీదు. అక్కడ వాకిట్లో ఓ యాచకుడు కూర్చున్నాడు. ధర్మం చెయ్యండి బాబూ అంటూ యాచిస్తున్నాడు. అటువైపుగా కొందరు ధనవంతులు వచ్చారు. వారిని చూసీ చూడడంతోనే యాచకుడు చేతిలోని భిక్షపాత్రను చాచి.. ‘ధర్మం బాబయ్యా’ అని అడిగాడు. కానీ వారిలో ఒక్కరూ చిల్లిగవ్వ కూడా ఆ పాత్రలో వెయ్యలేదు. అలా వెళ్లిపోయిన వారిలో ఓ ధనవంతుడి దగ్గరున్న ఓ డబ్బు సంచీ కింద జారిపడిపోయింది. ఆ విషయం అతనికి తెలియలేదు. కానీ ఆ డబ్బు సంచీని యాచకుడు చూశాడు. దాన్ని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. మసీదు లోపలికి వెళ్లిన కాస్సేపటికి డబ్బు సంచీ పోగొట్టుకున్న వ్యక్తి రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘ఇక్కడెక్కడైనా నా సంచీ పడిపోయుంటే చూసేవా?’’ అని అడిగాడు ఆ ధనవంతుడు. చూశానని, ‘మీరొస్తే మీకివ్వాలనే నా పక్కనే పెట్టుకున్నాను’ అనీ చెప్పాడు యాచకుడు. ధనవంతుడు ఆత్రుతతో ‘‘ఏదీ ఆ సంచీ ఇటివ్వు, అందులో అయిదు వందల దీనార్లు ఉండాలి.. నువ్వేమన్నా తీసుకున్నావా?’’ అని అన్నాడు. ‘‘నేనసలు ఆ సంచీ లోపల ఏం ఉందో కూడా చూడలేదండీ, మీరు లెక్కపెట్టుకోండి’’ అన్నాడు యాచకుడు. ధనవంతుడు లెక్కపెట్టి చూసుకుంటే అతను చెప్పిన అయిదు వందల దీనార్లు అలాగే ఉన్నాయి. దాంతో అతని ముఖాన అప్పటి వరకూ ఉన్న కంగారు, దాంతో పుట్టిన పట్టిన చెమటా మటుమాయమైంది. సంతోషం ఉప్పొంగింది. ఆ పట్టరాని ఆనందంతోనే అతను అందులోంచి పదిహేను దీనార్లు లెక్కపెట్టి ఇదిగో ఇది నా కానుక అంటూ యాచకుడికి ఇచ్చాడు. కానీ యాచకుడు తనకక్కరలేదని సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు, ఇలా అన్నాడు.. ‘‘మీరు కానుకగా ఇచ్చే సొమ్ము నాకక్కరలేదు. నేను మొదట మిమ్మల్ని ధర్మం చెయ్యండి బాబూ అని ధర్మం అడిగాను. అప్పుడే ఇచ్చి ఉంటే మహదానందంగా తీసుకునేవాడిని అన్నాడు యాచకుడు. ధనవంతుడు మౌనంగా వెళ్లిపోయాడు. – యామిజాల జగదీశ్ -
శక్తి మేరకు కట్టుబాటు
ఆంగ్లేయుల కాలంలో ఓ మసీదు ఇమామ్ సాబ్ ను బ్రిటీషు పోలీసులు దేశద్రోహం కేసులో అరెస్టు చేసి జైలులో వేశారు. ధార్మికంగా నిష్టగా ఉండే ఇమామ్ గారికి జైలులో నమాజు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ శుక్రవారం జుమా నమాజు కోసం మసీదుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. బ్రిటీషు పోలీసులు అనుమతిచ్చేవారు కాదు. అయినప్పటికీ జుమా నమాజు కోసం తలంటు స్నానం చేసి సిద్ధమయ్యేవారు. జుమా నమాజు అజాన్ వేళయిందంటే చాలు అజాన్ పిలుపు వినేందుకు ఎంతో ఆతృతతో జైలు ప్రవేశ ద్వారం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి జైలు ఇనుప చువ్వలు పట్టుకుని నిల్చునే వారు. అజాన్ పలుకులు పూర్తిగా విన్న తరువాతనే తన జైలు గదిలోకి వెళ్లి కూర్చునేవారు. ఆయన ప్రతీసారీ శుక్రవారం ఇలానే చేసేవారు. ఎన్నో శుక్రవారాలపాటు ఈ వ్యవహారమంతా గమనించిన జైలరు గారు ఒకరోజు హాఫిజ్ గారిని తన గదికి పిలిపించుకుని ‘‘ఈ జైలు పరిసరాలనుంచి నువ్వు బయటికెళ్లలేవని తెలిసి కూడా ప్రతి శుక్రవారం నమాజు కోసం సిద్ధమయ్యి గేటు దగ్గర అలా ఎందుకు ఎదురు చూస్తుంటావు’’ అని అడిగారు. దానికి ఇమామ్ సాబ్ ‘‘జైలరు గారూ, శుక్రవారం అజాన్ వినగానే పనులన్నీ పక్కనపెట్టి నమాజు కోసం బయలుదేరాలన్నది నా ప్రభువు ఆజ్ఞ. నా శక్తిమేరకు నా ప్రభువు ఆజ్ఞకు కట్టుబడి ఉన్నానని అనుకుంటున్నాను. నా ఈ పరిస్థితిని చూసి అల్లాహ్ తన దాసుల జాబితాలో నాపేరును తప్పకుండా నమోదు చేసుకుంటాడు. ఎందుకంటే అల్లాహ్ ఎవ్వరి పైనైనా శక్తికి మించిన భారం మోపడు. అల్లాహ్ నాకు తప్పకుండా శుక్రవారం నమాజు పుణ్యాన్నిస్తాడు. నా ఈ ఆచరణ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే’’ అని చెప్పాడు! జైలరు గారు ఆశ్చర్యపోయారు. ప్రతీ భక్తుని ఆలోచనా దృక్పథం ఇలానే ఉండాలి. మనం మన పరిధిలో, మన శక్తిమేర ధర్మంపై నిలకడను ప్రదర్శించాలని, ధర్మాజ్ఞలకు కట్టుబడేందుకు కృషిచేయాలని ఈ గాథ తెలియజేస్తోంది – నాజియా -
సింగపూర్‌ను చుట్టేస్తున్న ప్రధాని మోదీ
-
మసీదు విధ్వంసం.. కలకలం!
ఇస్లామాబాద్ : ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే మసీదును కొందరు సున్నీ అతివాదులు కూల్చేయడం పాకిస్తాన్లో కలకలం రేపింది. సియాల్కోట్లోని అహ్మదీ సెక్టార్లో గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మసీదు మూసివేసి ఉండటంతో ప్రాణనష్టం సంభవించలేదు. కానీ ఇలాంటి చర్యలు తగవంటూ ముస్లిం సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై సున్నీలు కక్షగట్టారని అందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అహ్మదీ సెక్టార్లో నివసించే వారిని ముస్లింలు కాదంటూ పాకిస్తాన్ ప్రభుత్వం 1974లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివాదం ఏంటంటే.. గతంలో ప్రముఖ మతగురువు మిర్జా గులామ్ అహ్మద్ ఈ మసీదును సందర్శించారు. 19వ శతాబ్దంలో ఆయన మత ప్రచారారాలు నిర్వహించారు. అయితే మెజార్టీ వర్టీయులైన సున్నీలు, అహ్మదీ సెక్టార్ ప్రజలను ముస్లింలుగా భావించలేదు. పాక్‌లో మైనార్టీగా ఉన్న అహ్మద్ సెక్టార్ వాసులు తమను ముస్లింలుగా భావించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కారణంగా అహ్మద్ సెక్టార్‌లోని మసీదును నాలుగు దశాబ్దాల కిందటే మూసివేశారు. అయితే తరచుగా ఈ ప్రాంత ప్రజలపై దాడులకు పాల్పడే సున్నీ మిలిటెంట్లు మసీదు విధ్వంసకాండకు పాల్పడ్డ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
గుంటూరులో సైకో వీరంగం..దేహశుద్ధి
-
గుంటూరులో సైకో వీరంగం..
సాక్షి, మాచర్ల: ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక రెంటచింతల మండలం పసర్లపాడు గ్రామానికి చెందిన జానీ పాషాకు గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదు. గుంటూరుకు తీసుకెళ్లి పాషా తండ్రి అతడికి చికిత్స చేయించాడు. బుధవారం ఉదయం కుమారుడిని గ్రామానికి తీసుకొస్తుండగా ఒక్కసారిగా తండ్రిపై దాడి చేసి పాషా పరారయ్యాడు. అనంతరం మాచర్లలోని స్థానిక మసీదులోకి చొరబడిన పాషా ప్రార్థనలు చేస్తున్నవారిపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. సైకో దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
మసీదులో ప్రార్థన చేస్తుండగా దారుణం
కసాల(సూడాన్) : మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అగంతకుడి కత్తి దాడిలో ముగ్గురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సూడాన్‌లోని కసాల నగరంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కసాల నగరంలోని ఓ మసీదులో సాయంకాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవ్వరూ తనకు బదులు చెప్పకపోవడంతో ఆగ్రహించిన దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రార్థన చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొంత సమయం తర్వాత తేరుకున్న అక్కడి వారు ఆ దుండగుడిపై దాడిచేసి చంపేశారు. గాయాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కసాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, వందల మంది సూడాన్ సైనికులు నగరాన్ని మోహరించినా ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
భారత్‌కు పెట్రోల్, గ్యాస్ అమ్మేందుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రౌహనీ శుక్రవారం చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా నంటూ రౌహనీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐక్యత లేకపోవడం వల్లే.. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించే సాహసం చేసిందని రౌహనీ విమర్శించారు. ముస్లింల మొదటి కిబ్లా(నమాజ్ చేసే వైపు) ఇప్పుడు ఇజ్రాయెల్ అధీనంలో ఉండటానికి ఇస్లామిక్ దేశాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమన్నారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేనందున అమాయక పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంద న్నారు. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికాలో మానవత్వం మంటగలుస్తోందని, అమెరికాలోని విద్యాలయాలు, వ్యాపార సంస్థల్లో అమాయకులపై దాడులు సర్వసాధారణం అయ్యాయన్నారు. ఇస్లామిక్ దేశాలు తమ వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలను పక్కన పెట్టి ఇస్లాం ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని ఇది సరికాదన్నారు. ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని పాటించే వారని, ఇస్లాం వైషమ్యాలను, భయాందోళలను సృష్టించే మతం కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య కొత్త శకం.. భారత్–ఇరాన్ మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమవుతోందని రౌహనీ చెప్పారు. భారత్–ఇరాన్ మధ్య దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో వ్యాపార, దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు వెస్ట్రన్ ఆసియా దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల ఎదుగు దలకు దోహదం చేస్తాయన్నారు. భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటి దని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నా యని పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని రౌహనీ సూచించారు. భారత్‌లో అన్ని వర్గాల మధ్య శాంతి, సామరస్యం ఎప్పటికీ కొన సాగాలని ఆకాంక్షించారు. పలు దేశాలు ఇరాన్ ప్రజలకు వీసాల జారీలో జాప్యం చేస్తున్నాయని, ఇరాన్ మాత్రం అన్ని దేశాలు ప్రత్యే కించి భారత ప్రజలకు వీసాల జారీని సులభతరం చేసిందన్నారు. -
మసీదుకు స్థలమిచ్చిన ఆలయాధికారి
సాక్షి, మంగళూరు : దేశంలో మతసామరస్యం ఇంకా ఉందని కర్ణాటకలోని ఒక ఆలయాధికారి నిరూపించారు. మతాలు, ప్రార్థనలు వేరయినా.. భగవంతుడు ఒక్కడే అని ఆయన తన చేతుల ద్వారా నిరూపించారు. మసీదు స్థలం సరిపోక ముస్లిం సోదరులు కొంత కాలంగా అవస్థలు పడుతున్నారు. వారి ఇబ్బందిని గమనించిన శ్రీ విష్ణుమూర్తి ఆలయ కమిటీ అధ్యక్షుడు తన సొంత స్థలాన్ని మసీదుకు దానం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ ఘటన కర్ణాకటలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కెయ్యూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఒలముండు గ్రామంలో జరిగింది. ఒలమండు గ్రామంలోని మసీదు చిన్నది కావడంతో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మసీదు విస్తరణలో భాగంగా ముస్లిం మత పెద్దలు.. మసీదుకు ఆనుకుని ఉన్న మోహన్ రాయ్ స్థలాన్ని ఇవ్వమని కోరారు. ముస్లిం మత పెద్దల కోరికను విన్న మోహన్ తన 12 సెంట్ల స్థలాన్ని మసీదుకోసం ఉచితంగా ఇచ్చారు. మసీదుకు స్థలాన్ని దానం చేసిన మోహన్ రాయ్‌పై ముస్లిం మత పెద్దలు ఉమర్ ముస్లియార్, కేఆర్ హుస్సేన్ తదితరులు ప్రశంసలు కురిపించారు. -
మసీదులో 235 మంది ఊచకోత
ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడి నెత్తుటేర్లు పారించారు. మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అమాయకులపై గుళ్ల వర్షం కురిపించి 235 మంది నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ముందు మసీదులో బాంబు పేల్చి, అనంతరం భయంతో పారిపోతున్న వారిపై నలువైపుల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇస్లామిక్ దేశం ఈజిప్ట్‌లోని సమస్యాత్మక ఉత్తర సినాయ్ ప్రాంతంలోని అల్–అరిష్ పట్టణంలో ఉన్న అల్–రౌదా మసీదులో ఈ ఘోరం చోటు చేసుకుంది. సాధారణంగా ఐఎస్ ఉగ్రసంస్థ ద్రోహులుగా పరిగణించే సూఫీలు ఈ మసీదులో ప్రార్థనలు జరుపుతారని స్థానికులు తెలిపారు. కైరో: ఈజిప్ట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అల్ అరిష్ పట్టణంలోని మసీదులో శుక్రవారం మధ్యాహ్నం పవిత్ర ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై ఉగ్రవాదులు బాంబులు, భారీ ఆయుధాలతో దాడి చేశారు. ఆ దేశం గతంలో ఎన్నడూ చూడని రీతిలో దాదాపు 235 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 109 మందిని గాయపరిచారు. ఈ దారుణ ఘటనతో మసీదు ప్రాంగణమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రులు, రక్తపు ధారలతో భీతావహంగా మారింది. నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు తొలుత మసీదులోని చిన్నారుల సంరక్షణ కేంద్రం వద్ద బాంబు పేల్చారనీ, ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు తీస్తున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారని ఈజిప్ట్ అధికార వార్తా సంస్థ ‘మెనా’ వెల్లడించింది. ఇది ఉగ్రదాడేనని ఈజిప్ట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గాయపడిన వారిని వైద్యశాలలకు తరలించేందుకు 50కిపైగా అంబులెన్సులు ఘటనాస్థలం వద్దకు చేరుకున్నాయి. సూఫీలే లక్ష్యంగా.. సూఫిజం మద్దతుదారులు, ఈజిప్ట్ భద్రతాదళాలను సమర్థిస్తున్నవారు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రసంస్థ కూడా సూఫీలను ఇస్లాం ద్రోహులుగా భావిస్తుంది. అయితే, ఈ దాడికి ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యతను ప్రకటించుకోలేదు. దాడి చేసిన ఉగ్రవాదులు ఏమయ్యారన్న దానిపై కూడా సమాచారం లేదు. అయితే దాడి జరిగిన తీరును బట్టి ఇది ఐఎస్ ఉగ్రసంస్థ పని అయ్యుండొచ్చని భావిస్తున్నారు. అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్–సిసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి దాడి తీవ్రత, ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈజిప్ట్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు హోస్ని ముబారక్‌ను పదవి నుంచి దింపివేసిన తర్వాత 2011 జనవరి నుంచి ఉత్తర సినాయ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇస్లాంవాది అయిన మరో మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ 2013లో పదవి కోల్పోయాక ఈ ప్రాంతంలోని పోలీసులు, సైన్యం లక్ష్యంగా ఉగ్రవాదులు మరింత పేట్రేగిపోయారు. అప్పటి నుంచి ఇప్పటికి 700 మందికిపైగా భద్రతా సిబ్బంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది తొలి నుంచీ ఈజిప్ట్‌లో ఉగ్రదాడులు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మే 26న క్రైస్తవులను ఎక్కించుకుని వెళ్తున్న ఓ బస్సుపై జరిగిన దాడిలో 28 మంది మరణించారు. ఏప్రిల్ 9న కూడా అలెగ్జాండ్రియా, టాంట నగరాల్లోని చర్చిల వద్ద జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 46 మంది చనిపోయారు. పిరికిపందల చర్య: ట్రంప్ దాడిలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు. దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించిన ట్రంప్ ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని ఇక భరించలేదు. మనం మన సైన్యాలతోనే వారిని ఓడించాలి’ అంటూ ట్వీట్ చేశారు. ‘ఉగ్ర’ పోరుకు మా మద్దతు: మోదీ దాడిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘ఈ ఆటవిక ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు దేశం తరఫున సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ మద్దతుగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈజిప్టులో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా దాడిని ఖండించారు. ప్రతీకారం తీర్చుకుంటాం: సిసీ ఉగ్రవాదులపై తమ ‘క్రూర సైన్యం’ ద్వారా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్–సిసీ శపథం చేశారు. ఇలాంటి దాడుల వల్ల ఉగ్రవాదంపై పోరాటంలో తమ బలం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. -
అఫ్గాన్‌లో మారణకాండ
-
అఫ్గాన్‌లో మారణకాండ
కాందహార్: అఫ్గానిస్తాన్‌లో శుక్రవారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. రాజధాని కాబూల్‌తో పాటు, మరో చోట మసీదుల్లో జరిపిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 47 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాలుగురోజుల క్రితం 80 మందిని, గురువారం కాందహార్ ప్రావిన్స్‌లో 43 మంది సైనికుల్ని పొట్టనపెట్టుకున్న ఘటనలు మరువక ముందే ఉగ్రవాదులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. కాబూల్‌లోని షియా మసీదులో ప్రజలు సాయంత్రపు ప్రార్థనల కోసం గుమిగూడిన సమయంలో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఉగ్రదాడిలో 32 మంది మరణించగా, 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ నగర శివార్లలోని దాస్తే బర్చీలో ఈ ఆత్మహుతి దాడి జరిగిందని కాబూల్ పోలీసు ప్రతినిధి అబ్దుల్ బసీర్ తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. ఇక మరో ఘటనలో ఘోర్ ప్రావిన్స్‌లోని సున్నీ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య 30 వరకూ ఉండొచ్చని స్థానిక అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మీ శిబిరంపై దాడిలో 43 మంది మృతి గురువారం కాందహార్ ప్రావిన్స్‌లోని మైవాండ్ జిల్లా చస్మోలో ఆర్మీ శిబిరంపై ఉగ్ర దాడిలో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్ రక్షణ శాఖ ఒక తెలిపింది. శిబిరంలో మొత్తం 60 మంది సైనికులకు గాను ఇద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. 9 మంది గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. -
మసీదుతో శబ్ద కాలుష్యం!
న్యూఢిల్లీ: ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ఆరో తరగతి పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఇచ్చిన పాఠంలో ‘మసీదు’ ఫొటోను ప్రచురించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఎస్ఈ ఆరో తరగతి సైన్స్ పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఓ పాఠం ఉంది. అందులో కాలుష్యానికి కారకాలుగా రైలు, కారు, విమానంతో పాటు మసీదు పేరు పేర్కొంది. దీనికి మసీదు ముందు ప్రార్థన చేస్తున్న వ్యక్తుల ఫొటోను ముద్రించింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచురణకర్త హేమంత్ గుప్తా స్పందిస్తూ.. తప్పు భావనతో తాము మసీదు ఫొటోను ప్రచురించలేదని.. ఇది ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని పేర్కొన్నారు. అలాగే వెంటనే పుస్తకంలోని 202 పేజీలోంచి ఫొటోను తొలగిస్తామని తెలిపారు. -
లండన్ తరహాలో ఫ్రాన్స్‌లో కూడా వాహనంతో..
క్రెటెయిల్: ఫ్రాన్స్‌లో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్ తరహాలో ఓ వ్యక్తి వాహనంతో ఓ మసీదుపైకి దూసుకెళ్లాడు. ఆ మసీదుకు రక్షణగా ఏర్పాటుచేసి బారీగేడ్లను, కాంక్రీటు దిమ్మెలను ఢీకొట్టి మరీ ఈ చర్యకు దిగాడు. దీంతో లండన్ తరహా ఉగ్రదాడి అయ్యుంటందని పోలీసులు క్షణాల్లో అప్రమత్తమయ్యారు. అయితే, ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అందులో నుంచి దిగి పారిపోగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ముస్లిం పెద్దలు ముమ్మాటికీ కావాలని చేసిన దాడి అని అన్నారు. ఈ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అది అతడి సొంతవాహనం అని తేలింది. ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక అనూహ్యం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కారణాలు శోధించేందుకు పోలీసులు అతడి ఇంటిని కూడా సోదా చేశారు. ఆ వ్యక్తి 43 ఏళ్ల అమెరికన్‌గా గుర్తించారు. కాగా, వాహనం మసీదు వైపు దూసుకెళ్లిన సమయంలో అతడు మద్యం కూడా సేవించి లేడని తెలిసింది. దీంతో ఇప్పుడు విచారణ అధికారులంతా గందరగోళంలో పడి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లండన్‌లో ఇటీవల ఈ తరహా దాడులు రెండుసార్లు జరగడం, అవి తామే చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు అదే కోణంలో అతడిని విచారించనున్నారు. అతడికి లై డిటెన్షన్ పరీక్ష కూడా చేయనున్నారు. -
ఇది మతతత్వ గూండాగిరీ
గుళ్లు, మసీదులపై సోనూ నిగమ్ వ్యాఖ్య ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గుళ్లు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. ‘గుళ్లు, మసీదులు.. ప్రజలను లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎందుకు నిద్ర లేపుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. బలవంతపు మతతత్వాన్ని ప్రజలపై రుద్దడాన్ని ఆపేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘దేవుడు అందరినీ ఆశీర్వదించాలి. నేను ముస్లింను కాను. కానీ ప్రతి రోజూ తెల్లవారుజామునే అజాన్‌తో నిద్ర లేస్తున్నాను. దేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడూ అంతమవుతుందో..’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ‘మహ్మద్ ప్రవక్త కాలంలో కరెంట్ లేదు. ఎడిసన్ తర్వాతే ఎందుకు నాకీ గోల (లౌడ్స్పీకర్లలో అజాన్ ఇవ్వడంపై)’ అని విమర్శించారు. -
అజాన్ సంప్రదాయం ఏర్పడిందిలా!
ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలన్నా, ఎటువంటి ప్రకటన చెయ్యాలన్నా ప్రవక్త మహనీయులు మసీదునే వేదికగా చేసుకునేవారు. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ప్రసంగ వేదిక (మింబర్ ) మొదటి మెట్టుపై నిలబడి ప్రసంగించేవారు. సంభాషణ అయితే ’మింబర్ ’ రెండవ మెట్టుపై కూర్చుని మాట్లాడేవారు. ప్రారంభంలో ఎవరికివారు నమాజు వేళకు మస్జిదుకు చేరి ప్రార్థన చేసేవారు. కాని అందరూ ఫలానా సమయానికి మస్జిదుకు రావాలని పిలిచే పద్ధతేదీ లేదు. అందుకని ప్రవక్తమహనీయులు సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దూరాన ఉన్నవారికి తెలియడం కోసం ఏదో ఒకవిధానం రూపొందించాలన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. కొందరు బాకా ఊదడం గాని, గంట మోగించడం గాని చేద్దామన్నారు. మరికొందరు శంఖం పూరిస్తే బాగుంటుందన్నారు. ఈవిషయంపై ఏకీభావం కుదరగానే శంఖాన్ని ఏర్పాటు చేయమని ప్రవక్తవారు హజ్రత్ ఉమర్ గారికి పురమాయించారు. ఇవే ఆలోచనలతో ఇంటికి వెళ్ళిన ఉమర్ ఆ రాత్రి ఒక కలగన్నారు. ’గంటలు, బాకాలు కాదు ‘అజాన్ ’ పలకండి’ అని ఆ కల సారాంశం. ఈ ‘అజాన్ ’ ఏమిటీ? తెల్లవారిన తరువాత ఈ విషయం ప్రవక్తకు తెలియజేద్దామని, అసలు ‘అజాన్ ’ అంటే ఏమిటీ అని ఆలోచిస్తూ మసీదువైపు బయలుదేరారు. అంతలో మసీదు పక్కనే ఓ ఇంటికప్పుపై హజ్రత్ బిలాల్ నిలబడి ’అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్ హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్...’ అని పలుకుతున్న మధురవచనాలు చెవిన పడ్డాయి. అజాన్ అంటే ఇదేనేమో... మరి బిలాల్‌కు ఎవరు చెప్పారీ పలుకులు అనుకుంటూ వడివడిగా అడుగులేశారు. అప్పటికే అక్కడ కొంతమంది విశ్వాసులు ఈ విచిత్ర పలుకుల్ని వింటున్నారు. అక్కడికి చేరుకున్న ఉమర్ , బిలాల్ నుద్దేశించి, ‘ఎవరు చెప్పారు ఇలా చదవమని?’ అంటూ ప్రశ్నించారు సంభ్రమాశ్చర్యాలతో.. ఇప్పుడే హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ వచ్చి, తనకు ఎవరో కలలో కనిపించి, అజాన్ ఇలా పలకాలని చెప్పినట్లు తనకు చెప్పారన్నారు బిలాల్. అక్కడినుండి హజ్రత్ ఉమర్ నేరుగా ప్రవక్త వారి వద్ద కెళ్ళి, ’దైవప్రవక్తా! రాత్రి నాకు, అబ్దుల్లాబిన్ జైద్ ఇద్దరికీ ఒకేలాంటి కల వచ్చింది’ అని అంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇదంతా విన్న దైవప్రవక్త, ‘ఉమర్! ఇది అల్లాహ్ మహదానుగ్రహం. నా వద్దకు కూడా ఇలాంటి సందేశమే వచ్చింది’. అన్నారు సంతోషంగా. ఈ విధంగా ప్రార్థన (నమాజ్ ) కోసం మసీదుకు రమ్మని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. అప్పటినుండి మసీదు పక్కనే ఉన్న ఇంటికప్పుపై నిలబడి హజ్రత్ బిలాల్ (ర) అజాన్ పలికేవారు. అదేవిధానం యావత్ ప్రపంచంలో కొనసాగుతోంది. ప్రళయకాలం వరకూ ఇన్షా అల్లాహ్ ఇదే పద్ధతి కొనసాగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం) -
పాక్‌లో ఆత్మాహుతి దాడి; 22 మంది మృతి
పెషావర్: పాకిస్థాన్‌లో ఓ మసీదులో ఆత్మాహుతి బాంబుపేలుడు ఘటనలో కనీసం 22 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని వాయవ్య ప్రాంతం, అఫ్ఘానిస్థాన్ సరిహద్దున ఉన్న ఖైబర్ పఖ్టున్ఖ్వా ప్రావిన్స్‌లోని పేయీ ఖాన్ గ్రామం మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ దాడి చేశాడు. దాడి జరిగిన సమయంలో మసీదులో చాలామంది ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో అల్ ఖైయిదా, తాలిబన్, ఇతర ఇస్లామిక్ గ్రూపుల ప్రాబల్యం ఉంది. కాగా దాడికి పాల్పడింది ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్ అని అజాన్ వినిపించగానే అమితమైన భక్తితో మస్జిద్ వైపు కదులుతారు. పాతికవేల మంది ఒక్కచోట చేరినా ఇతరులకు ఇబ్బంది లేకుండా నమాజ్ ఆచరిస్తారు. వేలాదిమంది కలిసికట్టుగా ప్రార్థించే ఈ ప్రాంత ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. నిండైన వస్త్రధారణ..! జామె మసీదును సందర్శించాలనుకునేవారు నిండైన వస్త్రధారణ కలిగి ఉండాలి. స్లీవ్‌లెస్‌లు, షార్ట్‌లు వేసుకుని వెళ్లేవారికి అక్కడి నిర్వాహకులు వస్త్రాలు ఇస్తారు. స్త్రీలు తలపై వస్త్రం కప్పుకోవాలి. వస్త్రాలు సమకూర్చినందుకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరు. వచ్చేటప్పుడు ఆ దుస్తులను తిరిగి ఇచ్చేయాలి. ఐదేళ్ల క్రితం... కొంతమంది మిత్రులం కలిసి జమాత్ మహాసభలకోసం ఢిల్లీ వెళ్ళాము. ఎలాగూ ఢిల్లీ వచ్చాం కదా, ఇక్కడికొన్ని చారిత్రక ప్రదేశాలు చూసివెళదామని అనుకున్నాం. అక్కడి మహాసభల నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో ఇండియా గేట్, లాల్ ఖిలా, జామా మస్జిద్ లాంటి కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శించాము. జామా మసీదు చూడాలని బయలుదేరిన మమ్మల్ని ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా టాక్సీ డ్రైవర్ కొంతదూరంలోనే విడిచి పెట్టాడు. అక్కడినుండి కాలినడకనే వెళ్ళాము. మీనా బజార్ మార్గం గుండా వెళ్ళిన మాకు ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. ఎలాగోలా మస్జిద్కు చేరుకున్నాం. దాన్నే జామా మస్జిద్, జుమ్మా మస్జిద్ అని కూడా అంటారు. తీరా వెళ్ళిన తర్వాత అది చాలా ఎత్తులో కనబడింది. దాదాపు 30 మెట్లు ఎక్కేసరికి అలసట వచ్చింది. పైకి వెళ్ళిన తరువాత మేము పొందిన అనుభూతి అంతాయింతా కాదు. అదొక అధ్భుత ఆధ్యాత్మిక కళాఖండమే కాక చారిత్రక సంపద కూడా! ఇస్లామీయ వాస్తు నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఆ మస్జిద్ మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఉత్తర ద్వారానికి సమీపంలో చెక్కతో నిర్మించిన ఒక గదిలో ప్రత్యేకమైన ఫలకం మీద ఖురాన్ వాక్యాలు రాయబడి ఉన్నాయని, ముహమ్మద్ ప్రవక్తకు చెందిన కొన్ని స్మృతి చిహ్నాలు ఉన్నాయని అక్కడి వారు కొందరు చెప్పారు. వాటిని కూడా మేము సందర్శించాం. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న, అంతటి అత్యధ్భుత ఇస్లామిక్ శిల్పకళా నైపుణ్యానికి అచ్చెరువొందాం. ఇదే నమూనా గల మస్జిదును పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నిర్మించారట. ఈ అద్భుత కట్టడం గురించి మాకెన్నో విషయాలు తెలిశాయి. ఇస్లామీయా కళాసంస్కృతి మొఘల్ చక్రవర్తుల కళారాధనకు, శిల్పకళా నైపుణ్యానికి ఈ మస్జిద్ సజీవ సాక్ష్యం. మొఘల్ చక్రవ ర్తి షాజహాన్ దీనిని నిర్మించాడు. ఆయన నిర్మించిన అనేక కట్టడాల్లో ఈ మస్జిద్ అత్యంత ప్రాముఖ్యతను పొందింది. దేశ విదేశాల నుండి నిత్యం వేలాదిమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ మసీదు అసలు పేరు ‘మస్జిదె జహా నుమా’. బహుశా ఈ మస్జిద్ కాంతులు జగమంతా ప్రసరించాలని షాజహాన్ ఈ పేరు పెట్టి ఉంటాడు. ఇస్లామీయ కళాసంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దబడిన ఈ మసీదు నిర్మాణం 1644లో ప్రారంభించారు. షాజహాన్ ఆంతరంగికుడు, ఆయన కొలువులో ప్రధానమంత్రి అయిన సఅదుల్లా ఖాన్ పర్యవేక్షణలో సుమారు 6 వేల మంది నిపుణులు, శ్రామికులు, శిల్పులు పదేళ్లకు పైగా రేయింబవళ్ళు శ్రమించి ఈ అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. 1656 జూలై 23న దీని ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చక్రవర్తి షాజహాన్ ఆహ్వానం మేరకు బుఖారాకు చెందిన ప్రముఖ దార్మిక విద్వాంసుడు షాహ్ బుఖారీ జామా మస్జిద్ను ఈదుల్ ఫిత్ ్ర(రమజాన్) పర్వదినాన లాంఛనంగా ప్రారంభించారు. ఈ మస్జిద్కు మౌలానా సయ్యద్ అబ్దుల్ గఫూర్ షా బుఖారీని చక్రవర్తి షాజహాన్ మొట్టమొదటి ఇమామ్‌గా నియమించాడు. తరువాతి కాలంలోనూ, నేటివరకూ అదే వంశానికి చెందిన బుఖారీలే జామె మస్జిద్ ఇమాములుగా కొనసాగుతున్నారు. ఒకేసారి 25,000 మంది నమాజ్ ఈ మస్జిదు పొడవు 261 అడుగులు, వెడల్పు 90 అడుగులు. ఒకేసారి 25,000 మంది నమాజ్ ఆచరించుకునేటంత వైశాల్యం కలిగిన ఈ మసీదు భారతదేశంలోనే అతి పెద్ద మస్జిదు. మస్జిద్‌పై కప్పు మూడు గుమ్మటాలను పాలరాతితో అత్యద్భుతంగా నిర్మించారు. మసీదుకు రెండువైపులా రెండు అందమైన, ఎత్తై మినార్లు ఉన్నాయి. ఈ మినార్ల ఎత్తు సుమారు 130 అడుగులు. మినార్లపైకి చేరుకోవడానికి ఒక్కొక్క మినారుకు 132 చొప్పున 264 మెట్లు కూడా ఉన్నాయి. మసీదులో ప్రవేశించడానికి పెద్ద పెద్ద గేట్లు మూడున్నాయి. ప్రధాన గేటు మిగిలిన రెండింటికన్నా చాలా పెద్దది. ఇది ‘లాల్ ఖిలా’ (ఎర్రకోట) వైపు ఉంటుంది. ఈ ద్వారాన్ని‘బాద్ షా దర్వాజా’ అంటారు. చక్రవర్తి షాజహాన్ ఈ ద్వారం గుండానే నమాజుకు వచ్చేవాడట. ఇప్పుడు జామె మస్జిద్ ఉన్న ప్రాంతం ఒకప్పుడు ఎత్తై కొండ ప్రాంతం. మస్జిద్ నిర్మాణం కోసం కొండను తొలగించినప్పటికీ ఇంకా అది చాలా ఎత్తులోనే ఉంది. మస్జిద్లోకి వెళ్లాలంటే సుమారు 35 మెట్లు పైకి ఎక్కవలసిందే. ప్రాంగణం మధ్యలో పాలరాతి తొట్టి జామె మస్జిద్ గర్భ నిర్మాణానికి, నిర్మలమైన పాలరాతిని ఉపయోగించారు. మిగతా నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు. ప్రాంగణం మధ్యలో ‘వజూ’ (నమాజ్ సమయంలో ముఖం, కాళ్లు చేతులు కడుక్కోవడం) చేసుకునేందుకు తెల్లని పాలరాతితో ఒక పేద్ద హౌజు నిర్మించారు. ఆ కాలంలో బావి నీటితోనే తొట్టిని నింపేవారు. దీనికోసం ఉత్తరవైపు ద్వారానికి దగ్గరలో ప్రత్యేకంగా ఒక బావిని తవ్వించారు. ఆధ్యాత్మిక పరిమళాలు నిత్యం వేలాదిమంది నమాజీలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ అపురూప మస్జిదు రమజాన్ మాసంలో మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సుందర కట్టడాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు కుప్పలు తెప్పలుగా పోటెత్తుతుంటారు. మస్జిద్ కట్టడం, ఆ రాజసం కనులారా వీక్షించాల్సిందే తప్ప ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి చారిత్రక మసీదును సందర్శించే అవకాశం కల్పించిన దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రెండు రకాత్‌ల నమాజ్ చేసుకొని తీయని అనుభూతులతో తిరుగుప్రయాణమయ్యాము. - యండీ.ఉస్మాన్ ఖాన్ చేరుకోవడం ఇలా! దేశంలోనే అతి పెద్ద మెట్రో పాలిటన్ నగరాలలో ఒకటి ఢిల్లీ. ఇక్కడే ఈ అద్భుత చారిత్రక కట్టడం ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 1543 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చాందినీ చౌక్‌లోని మస్జిద్ చేరుకోవడానికి ట్యాక్సీలు, బస్సులు ఉన్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 10- 15 నిమిషాలలోపు జామె మస్జిద్కు చేరుకోవచ్చు. దేశంలోని అన్ని చోట్ల నుంచి ఈ నగరానికి కనెక్టివిటీ ఉంది. మసీదు దగ్గర ిపిల్లలెంతో ఉత్సాహంగా... ఈ మసీదు దగ్గర పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. రమజాన్ నెలవంక కోసం చిన్న పిల్లలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. నెలవంక కనిపించగానే వారి కళ్ళలో కనిపించే ఆనందం వర్ణనాతీతం. పెద్దవాళ్ళతోపాటు ఉత్సాహంగా రోజా పాటిస్తారు. సాయంత్రం ఇఫ్తార్ వేళ వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. ఎంతో భక్తిశ్రధ్ధలతో శుభ్రమైన వస్త్రాలు ధరించి, చక్కని టోపీలు పెట్టుకొని మసీదులకు క్యూ కడతారు. సైరన్ మోగేవరకూ నిరీక్షించి పెద్దలతో కలసి ఇఫ్తార్ చేస్తారు. పెద్దలు కూడా వారిని ప్రోత్సహిస్తూ, ఎంతసేపటి వరకు ఉండగలరో అప్పటివరకూ రోజా పాటింపజేస్తారు. దీనివల్ల చిన్నతనం నుండే వారిలో భక్తిభావం, నైతిక విలువలు అలవడతాయి. పేదసాదలకు దానం చేయడానికి కూడా కొంతసొమ్ము వారిచేతికిచ్చి వారి చేతులతోనే దానధర్మాలు చేయిస్తారు. దీనివల్ల వారిలో ఇప్పటినుండే దానగుణం కూడా అలవడుతుంది. ఇక పండుగనాటి వారి సంతోషానికి ఆకాశమే హద్దు. తెల్లవారుజాము నుంచే పిల్లల హడావిడి మొదలవుతుంది. స్నానపానాదులు ముగించుకొని పెద్దలతో కలసి మస్జిద్కు వెళతారు. అమ్మా నాన్నలు ఇచ్చిన పైకాన్ని దారిలో ఉన్న పేదసాదలకు దానం చేసి సంతోషిస్తారు. -
మసీదు లక్ష్యంగా దాడి: 20 మంది మృతి
డమాస్కస్(సిరియా): ఐసిస్ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో 20 మంది మృతిచెందారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా డమాస్కస్‌లోని సయ్యిదా జీనాబ్ మసీదుకు వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశారు. మసీదు బయట ఓ కారు బాంబు, మరో ఆత్మాహుతి దాడి జరిగింది. రెండు బాంబు పేలుళ్లలో మొత్తం 20 మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రార్థన కోసం మసీదుకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐఎస్ఐఎస్ ఈ దాడులకు తెగబడింది. -
ముస్లిం మహిళలకు కఠిన నిబంధనలు!
ముస్లిం మతాచారాలు కట్టుబాట్లలో ఇప్పటికే మహిళలకు ఎన్నో నిబంధనలు ఉన్నాయి. బ్రిటన్ లోని ఓ మసీదు తాజాగా మరిన్ని నిబంధనలు విధించింది. భర్త అనుమతి లేకుండా ముస్లిం మహిళలు ప్యాంట్లు వేసుకోకూడదని, సామాజిక మాధ్యమాలు వాడకూడదని, ఒంటరిగా ఇంటినుంచి బయటకు వెళ్ళకూడదంటూ కఠిన నిబంధనలు జారీ చేసింది. టైమ్స్ పరిశోధన నివేదికలో తాజాగా.. విస్మయపరిచే ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్ లోని ముస్లిం సంఘాలు, మసీదులు ప్రచురించిన నిబంధనలను 'ద టైమ్స్' ఓ నివేదికలో ప్రస్తావించింది. లండన్ ఇస్లామిక్ సెంటర్, క్రోయ్ డాన్ మసీదు, సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్ కొత్త నిబంధనలు జారీ చేసినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం ఆ దేశంలో భర్త అనుమతి లేకుండా ఇంటినుంచి మహిళలు బయటకు రావడం ఎంతో ప్రమాదకరమని, అలాగే భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయొద్దని సూచించింది. ముఖ్యంగా మహిళలు ప్యాంట్లు ధరించకూడదని, ఫేస్ బుక్ వాడకూడదని, ఒక వేళ ఇప్పటికే అకౌంట్లు ఉన్నవారు వెంటనే డిలీట్ చేసేయాలని తెలిపింది. సెంట్రల్ మసీద్ ఆఫ్ బ్లాక్ బర్న్.. డేంజర్స్ ఆఫ్ ఫేస్ బుక్ తన వెబ్ పోస్టులో మద్యపానం పాపం అనే ఖురాన్ సూక్తిని ప్రస్తావిస్తూ, ఇది మహిళలు సామాజిక మాధ్యమాల వినియోగానికి వర్తింస్తుందని, దీని ద్వారా ముస్లిం మహిళలు బలవుతున్నారని వివరించింది. అంతేకాక ముస్లిం మహిళలు మోడలింగ్, యాక్టింగ్ చేయడంతో పాటు, గర్భస్రావం చేయించుకోవడం కూడ అనైతిక చర్య అని, అది మహాపాపం అంటూ మరో పోస్టులో ప్రస్తావించింది. అయితే మసీదులు, ఇస్లామిక్ సంఘాలు వెబ్ సైట్లో జారీ చేసిన నిబంధనలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అనంతరం ముస్లిం మతపెద్ద, క్రాయ్డాన్ అండ్ ఇస్లామిక్ సెంటర్ ట్రస్టీ షుహైబ్ యూసఫ్ మాత్రం ఈ ఆంక్షలు తప్పని అంగీకరించారు. వెబ్ సైట్ లింక్ ను వెంటనే తొలగించామని, సాహిత్యాత్మక తప్పిదాలు జరిగినట్లు అభిప్రాయపడ్డారు. సైట్ లో రాసిన వివరాలను శుద్ధీకరించి, ప్రభావవంతమైన కథనాలను ప్రచురించాలని సూచించారు. అయితే ముస్లిం సంఘాల నిబంధనలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఆధునిక యుగంలోనూ వ్యక్తుల సంకుచిత ధోరణికి అద్దం పడుతున్నాయంటూ ఆరోపిస్తున్నాయి. -
మసీదులో తేనెటీగల కలకలం
ఫినిక్స్ : మసీదులో ప్రార్థనలు చేసే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో కలకలంరేగింది. ఈ సంఘటన అమెరికాలోని ఫినిక్స్‌లోని మసీదులో చోటుచేసుకుంది. శుక్రవారం(భారత కాలమాన ప్రకారం శనివారం) మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడున్న వారి పై తేనెటీగలు దాడి చేశాయి. అయితే వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సేప్టీ సిబ్బంది ఫోమ్ సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కవర్లు, దుప్పట్ల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మసీదులో ఉన్న తేనెతెట్టను శనివారం అక్కడ నుంచి తీసివేయాలని అనుకున్నారు. కానీ, ఈ లోపే ఈ ఘటన చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలయిన 24 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో 20 మందికి స్పల్పగాయాలవ్వగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. -
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతి
-
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతి
సనా: యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రగాయాలైనట్టు అధికారులు తెలిపారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. యెమన్ అధ్యక్షుడు అబ్ద్రుబ్ మన్సూర్ రెండు రోజుల కింద సౌదీ అరేబియానుంచి తిరిగి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ మిలిటెంట్ల హిట్ లిస్ట్‌లో ఉండటంతో మన్సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు. -
మసీదులో పేలుడు: 11 మందికి గాయాలు
శ్రీనగర్ : కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని జమియా ట్రెంజ్ మసీదులో గురువారం గ్రేనెడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉదయం మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. మసీదు ప్రాంగణంలో లోహ పదార్థంతో తయారు చేసిన వస్తువును స్థానికులు గుర్తించారు. దీంతో దానిని వెలికి తీసే క్రమంలో ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఇదిలా ఉండగా ఇదే ప్రాంతంలో బుధవారం గస్తీ తిరుగుతున్న భద్రత దళాలపైకి ఆగంతకులు గ్రేనెడ్ విసిరారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పోలీసు ఉన్నతాధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లుతో పాటు ఓ పౌరుడు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు. -
మార్కెట్ వద్ద బాంబు పేలి 10 మంది మృతి
అబుజా: మరోసారి నైజీరియా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సోమవారం మధ్యాహ్నం బార్నో రాజధాని మైదుగురి నగర మార్కెట్లో బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన బార్నోఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. గతవారం ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించి 35 మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. స్థానికంగా స్థావరాలు ఏర్పరుచుకున్న ఒక ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో మూడు వేల మందికి పైగా మృతి చెందారని బార్నో అధికారులు తెలిపారు. -
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతి
అబూజా : ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది మరణించగా... 150 మంది గాయపడ్డారని నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు మసీదు వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని చెప్పారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని.... ఆ వెంటనే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు బాధ్యులం తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పారు. నైజీరియాలోని బోకోహరామ్ తీవ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ఏడాది జరిపిన విధ్వంసంలో దాదాపు 3 వేలమందికి పైగా మరణించారని పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు. -
అద్భుతమైన మస్జిద్ల వైపుగా ప్రయాణం...
ముస్లిమ్‌ల ప్రార్థనాలయం మస్జిద్. ప్రపంచంలో పేరెన్నికగన్నవి, అత్యద్భుతమైనవి వందల సంఖ్యలో మస్జిద్లు ఉన్నాయి. ఈ కట్టడాలను ఒక్కసారి దర్శిస్తే చాలు ముస్లిమ్‌ల నిర్మాణ నైపుణ్యాలు ఎంత గొప్పవో అవగతమవుతాయి. ఇస్లామ్ చక్రవర్తులు తమ కళలను ప్రపంచమంతా ఎలా వ్యాపింపచేశారో తేటతెల్లం అవుతాయి. యూరప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మస్జిద్లు ప్రపంచం నలుమూలలా అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా, ఠీవిగా దర్శనమిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పవిత్ర మస్జిద్ల గురించి కొంత సమాచారం ఈ వారం... జామా మస్జిద్: న్యూ ఢిల్లీ! మన దేశంలో అతిపెద్దది, అతి సుందరమైనదిగా జామా మస్జిద్కు పేరుంది. 1658లో ఎర్ర ఇసుకరాయి, తెల్లని మార్బుల్‌తో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ మస్జిద్ను నిర్మించాడు. ఈ మస్జిద్ నిర్మాణానికి 5 వేల మంది, 6 సంవత్సరాల పాటు పనిచేశారు. దేశరాజధాని ఢిల్లీలోని జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్‌లో గల ఈ మస్జిద్ ప్రాంగణంలో దాదాపు 25 వేల మంది ఒకేసారి ప్రార్ధనలు జరపవచ్చు. ఇలా వెళ్లాలి: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన జామా మస్జిద్కు 17 కి.మీ. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ. ఢిల్లీలోని మూడు ప్రధాన బస్సు స్టేషన్ల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు బస్సు సర్వీసులలో మస్జిద్కు చేరుకోవచ్చు. బ్లూ మాస్క్- అజ్రత్ అలీ పవిత్రక్షేత్రం: ఆప్ఘనిస్థాన్ ఆప్ఘనిస్తాన్‌లోని మజర్-ఇ-షరీఫ్ పట్టణంలో ఉంది ఈ మస్జిద్. నీలాకాశం రంగులో ఆప్ఘనిస్థాన్ హృదయపీఠంగా పిలువబడుతున్న ఈ కట్టడాన్ని ‘మజర్’గా పిలుస్తారు. ఇదే పేరుమీదుగా ఈ పట్టణం వృద్ధి చెందింది. హజ్రత్ అలీ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మస్జిద్ చుట్టూ అత్యంత సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఇలా వెళ్లాలి: ఢిల్లీ నుంచి ఆప్ఘనిస్తాన్‌లోని మజర్ కి విమానంలో చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా స్విస్వింగ్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా మజర్ చేరుకునే ప్రయాణికులకు రాబోయే 10 రోజుల్లో అత్యంత తక్కువ టికెట్ ధర కేవలం రూ.18771 గా నిర్ణయించింది. ఈ అవకాశం జూలై 15, 2014 వరకు మాత్రమే ఉంది. ఆసక్తి గల వారు www.goibibo.com/flights-schedule/delhi/mazar-i-sharif/కు లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవచ్చు. సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దిన్ మస్జిద్: బ్రూనై బ్రూనై దేశ రాజధాని అయిన బండార్ సెరి బెగవాన్ ప్రాంతంలో బంగారపు బురుజు గల ఈ మస్జిద్ ఉంది. పసిఫిక్ ఆసియాలోనే అత్యంత సుందరమైన మస్జిద్‌గా పర్యాటకులను ఆకర్షిస్తోంది. 1958లో నిర్మించిన ఈ కట్టడంలో ఇటాలియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తుంది. 171 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మస్జిద్ నిర్మాణంలో గాజు తలుపులు, చిమ్నీలు, బురుజులు, పాలరాయి, గ్రానైట్‌ను ఉపయోగించారు. ఇలా వెళ్లాలి: బ్రూనై నది మార్గాన నేరుగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. చెన్నై మీనంబాకమ్ విమానాశ్రయం నుంచి - బంగార్ సెరి బెగవాన్‌కు టికెట్ ధర రూ. 30,900 పై చిలుకు. మక్కా మస్జిద్ హైదరాబాద్! హైదరాబాద్‌లోని చార్మినార్‌కు నైరుతి దిశలో, 100 గజాల దూరంలో ఉంది ఈ మస్జిద్. ఇందులోని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మస్జిద్ నిర్మాణంలో మక్కా నుండి ఇటుకలు తెప్పించారని, వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారని, అందుకే దీనికి మక్కా మస్జిద్‌గా పేరు వచ్చిందని అంటారు. మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని ఇందులో భద్రపరచారని, చరిత్ర చెబుతోంది. ఇలా వెళ్లాలి: దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు, రైలు, అంతర్జాతీయ విమాన సదుపాయాలున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 11 కి.మీ దూరం. -
మసీదు ఎదుట బాంబు పేలుడు
తమిళనాడు మదురై సమీపంలోని నెలపట్టయిలో మసీదు ఎదుట శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. పేలిన బాంబు అంత శక్తిమంతమైనది కాదని, అందువల్ల ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే మసీదు సమీపంలో పార్క్ చేసి ఉంచిన రెండు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. బాంబు పేలుడు ఘటనతో నెలపట్టయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. బాంబు పేలుడుపై బాంబు నిపుణులను సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత నెలలో ఉత్తంగుడిలోని మార్కెట్ గోడ వద్ద పైప్ బాంబును స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబు పేలకుండా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.