
అలీ హాసన్
లక్నో : మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయటానికి అనుమతించిన మసీదు పెద్దకు భారీ షాక్ తగిలింది. ఈ విషయంపై భగ్గుమన్న మసీదు కమిటీ మసీదు పెద్దకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, వినయ్‌పుర్‌కు చెందిన మనుపాల్ భన్సాల్ ‘జనసంఖ్య సమాధాన్ ఫౌండేషన్’కు జాతీయస్థాయి వైస్ ప్రెసిడెంట్. ఓ రోజు ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమం కోసం గ్రామంలోని మసీదులో కూర్చోవటానికి మసీదు పెద్ద అలీ హాసన్ అనుమతి అడిగాడు. ఆయన సరే నన్నాడు. కార్యక్రమం మొదలవగానే మనుపాల్ హనుమాన్ చాలీసా పారాయణం చేశాడు. అయితే కార్యక్రమం జరుగుతున్నంతసేపు పెద్దగా పట్టించుకోని మసీదు కమిటీ పెద్దలు ఆ తర్వాత సీరియస్ అయ్యారు. ( బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు )
అలీ, మనుపాల్‌లను పిలిచి పంచాయితీ పెట్టారు. ఇద్దరూ చెరో 5 లక్షల రూపాయలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చేసేదీమీ లేక సరేనని, కమిటీ చెప్పిన కాగితాలపై సంతకం చేసి వచ్చేశారు. దీనిపై అలీ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు మనుపాల్ నా దగ్గరకు వచ్చి మసీదు లోపల కూర్చోవటానికి అనుమతి అడిగాడు. నేనెలా కాదనగలను. ప్రతీ ఒక్కరికి దేవుడి సన్నిధిలో కూర్చునే హక్కు ఉంటుంది. ప్రస్తుతం నన్ను మసీదునుంచి బయటకు పంపేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ( గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! )
Comments
Please login to add a commentAdd a comment