Cleric
-
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్‌గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్‌లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
ప్రముఖ మతగురువును అరెస్ట్ చేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరో దుశ్చర్యు పాల్పడ్డారు. ప్రముఖ మతగురువు మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు వారు ఒక ఫోటోను విడుదల చేశారు. చదవండి: Taliban: భారత్‌తో సంబంధాలు, తొలిసారి స్పందించిన అగ్రనేత అఫ్గాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు మొహమ్మద్ మౌల్వీ కళ్లకు గంతలు కట్టి ఉన్న సర్దార్ జద్రాన్ ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. కాగా ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో తొలి మహిళా గవర్నర్లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Taliban-Afghanistan: జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు -
మసీదు పెద్దకు భారీ జరిమానా: ఎందుకంటే..
లక్నో : మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయటానికి అనుమతించిన మసీదు పెద్దకు భారీ షాక్ తగిలింది. ఈ విషయంపై భగ్గుమన్న మసీదు కమిటీ మసీదు పెద్దకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, వినయ్‌పుర్‌కు చెందిన మనుపాల్ భన్సాల్ ‘జనసంఖ్య సమాధాన్ ఫౌండేషన్’కు జాతీయస్థాయి వైస్ ప్రెసిడెంట్. ఓ రోజు ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమం కోసం గ్రామంలోని మసీదులో కూర్చోవటానికి మసీదు పెద్ద అలీ హాసన్ అనుమతి అడిగాడు. ఆయన సరే నన్నాడు. కార్యక్రమం మొదలవగానే మనుపాల్ హనుమాన్ చాలీసా పారాయణం చేశాడు. అయితే కార్యక్రమం జరుగుతున్నంతసేపు పెద్దగా పట్టించుకోని మసీదు కమిటీ పెద్దలు ఆ తర్వాత సీరియస్ అయ్యారు. ( బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు ) అలీ, మనుపాల్‌లను పిలిచి పంచాయితీ పెట్టారు. ఇద్దరూ చెరో 5 లక్షల రూపాయలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చేసేదీమీ లేక సరేనని, కమిటీ చెప్పిన కాగితాలపై సంతకం చేసి వచ్చేశారు. దీనిపై అలీ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు మనుపాల్ నా దగ్గరకు వచ్చి మసీదు లోపల కూర్చోవటానికి అనుమతి అడిగాడు. నేనెలా కాదనగలను. ప్రతీ ఒక్కరికి దేవుడి సన్నిధిలో కూర్చునే హక్కు ఉంటుంది. ప్రస్తుతం నన్ను మసీదునుంచి బయటకు పంపేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ( గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! ) -
‘మహిళల తప్పులవల్లే కరోనా వ్యాప్తి’
ఇస్లామాబాద్: మహిళల తప్పుల కారణంగానే కరోనా వైరస్ మానవాళిపై కోరలు చాస్తోందని పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రసిద్ధ మతాధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం టెలివిజన్ లైవ్ షోలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఎహ్సాస్ టెలిథాన్’ నిధుల సేకరణ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ చూస్తుండగానే మౌలానా తారిక్ జమీల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ వెల్లడించింది. (తమిళ ప్రజలకు దుల్కర్ క్షమాపణ ) దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి మహిళలు పొట్టి పొట్టి దుస్తులు ధరించడమే కారణమని తారిక్ జమీల్ అన్నారు. ఇలాంటి మహిళల ప్రవర్తనపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. మీడియాపైనా ఆయన విమర్శలు గుప్పించారు. మీడియా అబద్దాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, తారిక్ వ్యాఖ్యలను సదరు మీడియా ప్రతినిధులు తప్పుబట్టడంతో చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. నోరు అదుపుతప్పి మీడియాపై నోరుపారేసుకున్నట్టు ఒప్పుకున్నారు. కానీ, మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం తారిక్ క్షమాపణ కోరలేదు. (నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్ అన్నాడు..! ) తారిక్ వ్యాఖ్యలను మానవ హక్కుల కమిషన్ తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని హితవు పలికింది. వివక్షాపూరిత కామెంట్లు మీడియాలో ప్రసారమైతే సమాజంలో చెడు అభిప్రాయం ఏర్పడుతుందని కమిషన్ ట్వీట్ చేసింది. ఇక పాకిస్తాన్‌లోని డాన్ వార్తా పత్రిక తన సంపాదకీయంలో తారిక్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. మహిళలపై ఓ మతాధికారి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను సరిదిద్దుకోకపోవడం సిగ్గుచేటు అని పేర్కొంది.కాగా, పాకిస్తాన్లో 11,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 253 మంది మరణించారు. (‘ఆ భారత బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చాలా కష్టం’ ) -
తాలిబన్ల గురువు మౌలానా హక్ దారుణ హత్య
ఇస్లామాబాద్: తాలిబన్ల పితామహుడిగా(ఫాదర్ ఆఫ్ తాలిబన్) భావించే, మత గురువు మౌలానా సామ్యూల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం (నవంబర్ 2) గుర్తు తెలియని వ్యక్తులు హక్ గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. దాడికి కొన్నిక్షణాల ముందే మౌలానా అంగరక్షకుడు బయటికి వెళ్లాడనీ, అతడు తిరిగొచ్చేసరికి మౌలానా తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడని మౌలానా కుమారుడు హమిదుల్ హక్ తెలిపాడు. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు దైవదూషణ కేసులో క్రిస్టియన్ మహిళకు మరణశిక్షను రద్దు చేయడానికి నిరసనగా చెలరేగిన హింసాకాండలో భాగంగానే హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే మౌలానాకు హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో హక్ మద్దతుదారులు ఇస్లామాబాద్, రావల్పిండిలో విధ్వంసానికి దిగారు. రాషాకాయి టోల్‌ప్లాజాను తగులబెట్టారు. అయితే ప్రశాంతంగా ఉండాల్సిందిగా హక్ కుటుంబం విజ్ఞప్తి చేసింది. మరోవైపు హక్ హత్యపై, పాకిస్తాన్ అంతర్గత మంత్రి, షెహార్ అఫ్రిది, సున్నీ నాయకుడు మౌలానా ఫజల్-ఉర్ రెహ్మాన్, పాకిస్తానీ తాలిబాన్ ఆర్మీ చీఫ్ సహా పలువురు పాకిస్తానీ అధికారులు, మత ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. హక్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మౌలానాకు హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
మహిళల మెదడు 'పావుశాతమే'.. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వొద్దు!
రియాద్: పురుషులతో పోలిస్తే మహిళలకు 'పావుశాతం' మెదడు మాత్రమే ఉంటుందని, వాహనాలు నడిపేందుకు వారిని అనుమతించొద్దని సౌదీ అరేబియా మత పెద్ద ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో సౌదీ ప్రభుత్వం సదరు మతపెద్దపై వేటు వేసింది. ప్రార్థనలకు నేతృత్వం వహించడం సహా ఇతర మతకార్యక్రమాలేవీ చేపట్టకుండా ఆయనపై సస్పెన్షన్ విధించింది. సాద్ హిజ్రీ అనే మతపెద్ద మాట్లాడుతూ.. పురుషులతో పోలిస్తే మహిళలకు 'సగం మెదడు' మాత్రమే ఉంటుందని, షాపింగ్ కు వెళ్లినప్పుడు అది పావుశాతానికి కుదించుకుపోతుందని, కాబట్టి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మతవాద దేశమైన సౌదీ అరేబియాలో మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మహిళలు వాహనాలు నడుపడం ఇక్కడ అనుమతించరు. అయితే , మహిళ ఉద్యోగితను పెంచేందుకు ఇటీవల సౌదీలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
వంట పాత్రల కోసం వెళితే వాంఛ తీర్చమన్నాడు!
పనాజీ: అన్నం పెట్టిన విశ్వాసం కూడా లేకుండా ఆ ఇంటి చిన్నారిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 13 ఏళ్ల చిన్నారిని లైంగికంగా వేధించినందుకు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే పనాజీలోని మసీదులో గుమాస్తాగా పనిచేస్తున్న సఫ్రాజ్ అహ్మద్ (32)కు ఈ నెల 15న పక్కింట్లోని వాళ్లు వంటపాత్రల్లో భోజనం పెట్టి ఇచ్చారు. మరుసటిరోజు ఆ పాత్రలను తీసుకురావడానికి వెళ్లిన పక్కింటి చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మొదట విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడిన బాలిక తర్వాత ఆమె తల్లికి చెప్పింది. ఆమె స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అహ్మద్‌పై ఐపీసీ సెక్షన్ 354, 354-ఏ, గోవా బాలల చట్టం 8 కింద కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.