ఇస్లామాబాద్: మహిళల తప్పుల కారణంగానే కరోనా వైరస్ మానవాళిపై కోరలు చాస్తోందని పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రసిద్ధ మతాధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం టెలివిజన్ లైవ్ షోలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఎహ్సాస్ టెలిథాన్’ నిధుల సేకరణ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ చూస్తుండగానే మౌలానా తారిక్ జమీల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఏఎన్‌ఐ వార్త సంస్థ వెల్లడించింది. (తమిళ ప్రజలకు దుల్కర్ క్షమాపణ )
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి మహిళలు పొట్టి పొట్టి దుస్తులు ధరించడమే కారణమని తారిక్ జమీల్ అన్నారు. ఇలాంటి మహిళల ప్రవర్తనపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. మీడియాపైనా ఆయన విమర్శలు గుప్పించారు. మీడియా అబద్దాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, తారిక్ వ్యాఖ్యలను సదరు మీడియా ప్రతినిధులు తప్పుబట్టడంతో చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. నోరు అదుపుతప్పి మీడియాపై నోరుపారేసుకున్నట్టు ఒప్పుకున్నారు. కానీ, మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం తారిక్ క్షమాపణ కోరలేదు. (నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్ అన్నాడు..! )
తారిక్ వ్యాఖ్యలను మానవ హక్కుల కమిషన్ తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని హితవు పలికింది. వివక్షాపూరిత కామెంట్లు మీడియాలో ప్రసారమైతే సమాజంలో చెడు అభిప్రాయం ఏర్పడుతుందని కమిషన్ ట్వీట్ చేసింది. ఇక పాకిస్తాన్‌లోని డాన్ వార్తా పత్రిక తన సంపాదకీయంలో తారిక్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. మహిళలపై ఓ మతాధికారి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను సరిదిద్దుకోకపోవడం సిగ్గుచేటు అని పేర్కొంది.కాగా, పాకిస్తాన్‌లో 11,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 253 మంది మరణించారు.
(‘ఆ భారత బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చాలా కష్టం’ )
Comments
Please login to add a commentAdd a comment