China Pakistan Secretly Developing Virus Deadlier Than Covid, Report Says - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ రిపోర్ట్‌: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్‌-చైనా!

Published Tue, Nov 8 2022 8:24 PM | Last Updated on Tue, Nov 8 2022 8:39 PM

China Pakistan Secretly Developing Virus Deadlier Than Covid Report - Sakshi

ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కోవిడ్‌-19 వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ చైనాలోని వ్యూహాన్‌ ల్యాబ్‌లో అభివృద్ధి చేసినట్లు మొదట్లో వార్తలు వచ్చినా.. అందుకు తగిన ఆధారాలు లభించలేదు. అయితే, కరోనాను మించిన ప్రాణాంతక వైరస్‌ను పాకిస్థాన్‌-చైనాలు కలిసి సీక్రెట్‌గా సిద్ధం చేస్తున్నాయని ఓ నివేదిక షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. పాకిస్థాన్‌లోని రావల్‌పిండి పరిశోధన ల్యాబ్‌లో సీక్రెట్‌గా ఈ ప్రాణాంతక వైరస్‌ను ఇరుదేశాల భాగస్వామ్యంతో అభవృద్ధి చేస్తున్నట్లు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ‘జియోపాలిటిక్’ను సూచిస్తూ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ కథనం వెలువరించింది. ఈ ప్రత్యేక ప్రాజెక్టును వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌, డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌(డీఎస్‌టీఓ)లు సంయుక్తంగా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ డీఎస్‌టీఓను పాకిస్థాన్‌ ఆర్మీ నిర్వహిస్తోంది. 

అయితే, ప్రాణాంతక వైరస్‌ను రూపొందించేందుకు స్పెషల్‌ ప్రాజెక్టును చేపట్టారన్న నివేదకలను 2020లోనే తిరస్కరించింది పాకిస్థాన్‌. మరోవైపు.. పాకిస్థాన్‌ ల్యాబ్‌ బయోసెఫ్టీ లెవల్‌-3కి సంబంధించి ఎలాంటి రహస్య ప్రాజెక్టులు లేవని పాక్ విదేశాంగ శాఖ తెలిపినట్లు జియోపాలిటిక్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో పేర్కొన్న పరిశోధన కేంద్రం రావల్‌పిండిలోని చక్లాలా కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, దీనికి 2 స్టార్‌ జనరల్‌ అధ్యక్షత వహిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 

మరోవైపు.. కరోనా మహమ్మారులను మించిన ప్రాణాంతక వైరస్‌లను రూపొందించటంలో చైనా నిమగ్నమైనట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది చైనా. కానీ, వూహాన్‌ ల్యాబ్‌పై చాలా దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ను సైతం వూహాన్‌ ల్యాబ్‌లోనే అభివృద్ది చేసి ఉంటారని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement