
ఇస్లామాబాద్: తాలిబన్ల పితామహుడిగా(ఫాదర్ ఆఫ్ తాలిబన్) భావించే, మత గురువు మౌలానా సామ్యూల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం (నవంబర్ 2) గుర్తు తెలియని వ్యక్తులు హక్ గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. దాడికి కొన్నిక్షణాల ముందే మౌలానా అంగరక్షకుడు బయటికి వెళ్లాడనీ, అతడు తిరిగొచ్చేసరికి మౌలానా తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడని మౌలానా కుమారుడు హమిదుల్ హక్ తెలిపాడు. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు దైవదూషణ కేసులో క్రిస్టియన్ మహిళకు మరణశిక్షను రద్దు చేయడానికి నిరసనగా చెలరేగిన హింసాకాండలో భాగంగానే హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే మౌలానాకు హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో హక్ మద్దతుదారులు ఇస్లామాబాద్, రావల్పిండిలో విధ్వంసానికి దిగారు. రాషాకాయి టోల్‌ప్లాజాను తగులబెట్టారు. అయితే ప్రశాంతంగా ఉండాల్సిందిగా హక్ కుటుంబం విజ్ఞప్తి చేసింది. మరోవైపు హక్ హత్యపై, పాకిస్తాన్ అంతర్గత మంత్రి, షెహార్ అఫ్రిది, సున్నీ నాయకుడు మౌలానా ఫజల్-ఉర్ రెహ్మాన్, పాకిస్తానీ తాలిబాన్ ఆర్మీ చీఫ్ సహా పలువురు పాకిస్తానీ అధికారులు, మత ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. హక్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మౌలానాకు హత్యకు బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment