గాజాలో మసీదుపై ఇజ్రాయెల్‌ దాడులు.. 24 మంది మృతి | Israel Strikes On Mosque In Central Gaza | Sakshi
Sakshi News home page

గాజాలో మసీదుపై ఇజ్రాయెల్‌ దాడులు.. 24 మంది మృతి

Published Sun, Oct 6 2024 12:34 PM | Last Updated on Sun, Oct 6 2024 1:13 PM

Israel Strikes On Mosque In Central Gaza

గాజా:ఓ పక్క లెబనాన్‌లో హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ సేనలు మరోపక్క పాలస్తీనాలోని గాజాలోనూ దాడులు కొనసాగిస్తున్నాయి.ఆదివారం(అక్టోబర్‌6)సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24మంది మరణించారు. మృతులంతా పురుషులేనని అధికారులు తెలిపారు.

డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదులో నిరాశ్రయులైన ప్రజలుంటున్నారు. ఆదివారం ఉదయం ఈ మసీదుపై ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడిలో 24మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

 ఈ దాడిపై ఇజ్రాయెల్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.2023అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడితో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో దాదాపు 42వేల మంది మరణించారు.

ఇదీ చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement