పాక్లో ఆత్మాహుతి దాడి; 22 మంది మృతి | Suicide bombblast in Pakistan mosque | Sakshi
Sakshi News home page

పాక్లో ఆత్మాహుతి దాడి; 22 మంది మృతి

Published Fri, Sep 16 2016 5:35 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

పాక్లో ఆత్మాహుతి దాడి; 22 మంది మృతి - Sakshi

పాక్లో ఆత్మాహుతి దాడి; 22 మంది మృతి

పెషావర్: పాకిస్థాన్లో ఓ మసీదులో ఆత్మాహుతి బాంబుపేలుడు ఘటనలో కనీసం 22 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారు. పాకిస్థాన్లోని వాయవ్య ప్రాంతం, అఫ్ఘానిస్థాన్ సరిహద్దున ఉన్న ఖైబర్ పఖ్టున్ఖ్వా ప్రావిన్స్లోని పేయీ ఖాన్ గ్రామం మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ దాడి చేశాడు.

దాడి జరిగిన సమయంలో మసీదులో చాలామంది ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో అల్ ఖైయిదా, తాలిబన్, ఇతర ఇస్లామిక్ గ్రూపుల ప్రాబల్యం ఉంది. కాగా దాడికి పాల్పడింది ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement