
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతి
సనా: యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రగాయాలైనట్టు అధికారులు తెలిపారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
యెమన్ అధ్యక్షుడు అబ్ద్రుబ్ మన్సూర్ రెండు రోజుల కింద సౌదీ అరేబియానుంచి తిరిగి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ మిలిటెంట్ల హిట్ లిస్ట్లో ఉండటంతో మన్సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు.