లండన్‌ తరహాలో ఫ్రాన్స్‌లో కూడా వాహనంతో.. | Man held after driving into barriers protecting Paris mosque | Sakshi
Sakshi News home page

లండన్‌ తరహాలో ఫ్రాన్స్‌లో కూడా వాహనంతో..

Published Fri, Jun 30 2017 6:44 PM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM

లండన్‌ తరహాలో ఫ్రాన్స్‌లో కూడా వాహనంతో.. - Sakshi

లండన్‌ తరహాలో ఫ్రాన్స్‌లో కూడా వాహనంతో..

క్రెటెయిల్‌: ఫ్రాన్స్‌లో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్‌ తరహాలో ఓ వ్యక్తి వాహనంతో ఓ మసీదుపైకి దూసుకెళ్లాడు. ఆ మసీదుకు రక్షణగా ఏర్పాటుచేసి బారీగేడ్లను, కాంక్రీటు దిమ్మెలను ఢీకొట్టి మరీ ఈ చర్యకు దిగాడు. దీంతో లండన్‌ తరహా ఉగ్రదాడి అయ్యుంటందని పోలీసులు క్షణాల్లో అప్రమత్తమయ్యారు. అయితే, ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అందులో నుంచి దిగి పారిపోగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ముస్లిం పెద్దలు ముమ్మాటికీ కావాలని చేసిన దాడి అని అన్నారు.

ఈ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అది అతడి సొంతవాహనం అని తేలింది. ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక అనూహ్యం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కారణాలు శోధించేందుకు పోలీసులు అతడి ఇంటిని కూడా సోదా చేశారు. ఆ వ్యక్తి 43 ఏళ్ల అమెరికన్‌గా గుర్తించారు. కాగా, వాహనం మసీదు వైపు దూసుకెళ్లిన సమయంలో అతడు మద్యం కూడా సేవించి లేడని తెలిసింది. దీంతో ఇప్పుడు విచారణ అధికారులంతా గందరగోళంలో పడి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లండన్‌లో ఇటీవల ఈ తరహా దాడులు రెండుసార్లు జరగడం, అవి తామే చేశామంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ దర్యాప్తు అధికారులు అదే కోణంలో అతడిని విచారించనున్నారు. అతడికి లై డిటెన్షన్‌ పరీక్ష కూడా చేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement