ఈ కారు ధర ఎంతో తెలుసా? | Ferrari 250 GTO 1963 Model IS The Most Worlds Expensive Car | Sakshi
Sakshi News home page

ఈ కారు ధర ఎంతో తెలుసా?

Published Tue, Jun 5 2018 11:10 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Ferrari 250 GTO 1963 Model IS The Most Worlds Expensive Car - Sakshi

ఫెరారీ 250 జీటీవో కారు

ప్యారిస్‌ : ఎంత ఖరీదైన కారైనా మహా అయితే నాలుగైదు కోట్లు పలుకుతుంది. ఎంతో ప్రత్యేకమైనదైతే దాదాపు రూ.20 కోట్లదాకా పలకొచ్చు. కానీ రూ.537 కోట్లు విలువ చేసే కారు గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇక్కడ కనిపిస్తున్న ఫెరారీ 250 జీటీవో అనే ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. ప్యారిస్‌లో జరిగిన ఓ వేలంలో ఈ కారు 8 కోట్ల డాలర్లు (సుమారు రూ.537 కోట్లు)కు వెదర్‌టెక్‌ సంస్థ సీఈవో డేవిడ్‌ మెక్‌నీల్‌ సొంతం చేసుకున్నారు.

2014లో  ‘ఫెరారీ 250 జీటీవో’ పేరిటే ఉన్న రికార్డును మళ్లీ అదే మోడల్‌ కారు తిరగరాసింది. అప్పట్లో బోన్‌హామ్స్‌ మానెటరీ ఆక్షన్‌లో ఆ కారు 3.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.255 కోట్లు)కు అమ్ముడుపోయింది. ఇప్పుడా రికార్డు బద్దలైంది. తాజాగా అమ్ముడుపోయిన ఈ కారును 1963లో తయారు చేశారు. 1962–64 మధ్య కేవలం 36 ఫెరారీ 250 జీటీవో మోడల్‌ కార్లను మాత్రమే ఆ సంస్థ తయారు చేసింది.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement