ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద సహాయక బృందాలు
పారిస్: ఆగ్నేయ ఫ్రాన్స్‌లో రెండు సైనిక హెలికాఫ్టర్లు ఢీకొన్నాయని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖాధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరొకరి జాడ తెలియాల్సి ఉంది. సెయింట్ ట్రోపెజ్ పట్టణానికి ఉత్తరాన ఉన్న కార్కస్ సరస్సు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు గాజెల్లె హెలికాఫ్టర్లు ఫ్రెంచ్ ఆర్మీ లైట్ ఏవియేషన్ స్కూల్‌కు చెందినవి.
ఈ స్కూల్లో మొత్తం 82 హెలికాఫ్టర్లు ఉన్నాయి..ఇక్కడ ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్ దేశాలకు చెందిన హెలికాఫ్టర్ పైలట్లకు శిక్షణ అందిస్తారు. సంఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు తప్పిపోయిన ఆరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment