
పాట్నా: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలా ఉండగా.. రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్‌లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని దనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా దుమారం రేపుతున్నాయి. ఇక, యాదవ్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది.
యాదవ్ అంతటితో ఆగకుండా 11 ఏండ్ల ముస్లిం బాలిక భగవద్గీతను పఠించి మెడల్‌ను గెలుచుకున్నప్పుడు హిందుత్వవాదులు నోరుమెదపలేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు.. యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
रामचरित मानस मस्जिद में लिखी गई थी, इतिहास उठाकर देखिए,"
— The Hint News (@TheHintNews) June 16, 2023
RJD के विधायक रीतलाल यादव का बयान। #RitlalYadav #Ramcharitmanas pic.twitter.com/Cl1JxDlDjK
ఇది కూడా చదవండి: పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్‌కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్