సాక్షి, మంగళూరు : దేశంలో మతసామరస్యం ఇంకా ఉందని కర్ణాటకలోని ఒక ఆలయాధికారి నిరూపించారు. మతాలు, ప్రార్థనలు వేరయినా.. భగవంతుడు ఒక్కడే అని ఆయన తన చేతుల ద్వారా నిరూపించారు. మసీదు స్థలం సరిపోక ముస్లిం సోదరులు కొంత కాలంగా అవస్థలు పడుతున్నారు. వారి ఇబ్బందిని గమనించిన శ్రీ విష్ణుమూర్తి ఆలయ కమిటీ అధ్యక్షుడు తన సొంత స్థలాన్ని మసీదుకు దానం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ ఘటన కర్ణాకటలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కెయ్యూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఒలముండు గ్రామంలో జరిగింది.
ఒలమండు గ్రామంలోని మసీదు చిన్నది కావడంతో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మసీదు విస్తరణలో భాగంగా ముస్లిం మత పెద్దలు.. మసీదుకు ఆనుకుని ఉన్న మోహన్ రాయ్ స్థలాన్ని ఇవ్వమని కోరారు. ముస్లిం మత పెద్దల కోరికను విన్న మోహన్ తన 12 సెంట్ల స్థలాన్ని మసీదుకోసం ఉచితంగా ఇచ్చారు. మసీదుకు స్థలాన్ని దానం చేసిన మోహన్ రాయ్‌పై ముస్లిం మత పెద్దలు ఉమర్ ముస్లియార్, కేఆర్ హుస్సేన్ తదితరులు ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment