ప్రముఖ ఆలయంలో అతియా శెట్టి- కేఎల్ రాహుల్.. వీడియో వైరల్! | Athiya Shetty-KL Rahul Visit Kuttaru Koragajja Temple In Mangaluru, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Athiya Shetty-KL Rahul: ఆలయంలో అతియా శెట్టి- కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు!

Published Mon, Jul 15 2024 7:24 PM | Last Updated on Mon, Jul 15 2024 7:29 PM

Athiya Shetty- KL Rahul visit Kuttaru Koragajja temple in Mangaluru

బాలీవుడ్ భామ అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2015లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముబాకరన్, నవాబ్‌జాదే, మోతీచూర్ చక్నాచూర్‌ చిత్రాల్లో మెరిసింది. అయితే కొన్నేళ్లపాటు టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో డేటింగ్‌ కొనసాగించిన భామ.. గతేడాది వివాహాబంధంలోకి ‍అడుగుపెట్టింది.

తాజాగా ఈ జంట కర్ణాటకలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. మంగళూరులోని కుట్టారు కొరగజ్జ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా ఉన్నారు.  అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ నటి కత్రినాకైఫ్‌ సైతం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి కర్ణాటకలోని తులునాడు మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. అంతకుముందే మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కత్రినా, అథియా, అహన్ శెట్టి, కేఎల్ రాహుల్ హాజరయ్యారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement