
బాలీవుడ్ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు పాప పుట్టారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. పలువురు సినీతారలు సైతం కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలోనే అతియాశెట్టి గర్భంతో ఉన్నట్లు రాహుల్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మా ఇంటికి అందమైన ఆశీర్వాదం రాబోతుందని పోస్ట్ చేశారు.
కాగా.. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది.
కేఎల్, అతియా శెట్టి ప్రేమ వివాహం
అయితే కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023, జనవరి 23న ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సినీతారలు, పలువురు క్రికెటర్ల సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment