టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ జంట మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారు. అతియా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా అతియా శెట్టి సైతం ఆస్ట్రేలియాలోనే ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ బిజీగా ఉన్నారు. మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతోంది. తాజాగా మెల్‌బోర్న్ స్టేడియంలో అతియాశెట్టి కనిపించింది. ఆమెతో పాటు అనుష్క శెట్టి, నితీశ్ కుమార్ రెడ్డి ఫాదర్ కూడా కనిపించారు. అయితే అతియాశెట్టి బేబీబంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న ముంబయిలో జరిగింది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.
Athiya Shetty with the baby 🥹❤️🧿🤞🏻🥹🧿❤️🪬😭💗😭🥹🪬🥺💗❣️🤍
Also anushka and nitish family 🥹 pic.twitter.com/okzKM5umY4— Tia'world (@singh36896) December 29, 2024
Comments
Please login to add a commentAdd a comment