కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కాబుల్ సమీపంలోని ఓ మసీదులోశుక్రవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరో 15 పైగా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాజధాని షకర్ దారా జిల్లాలోని జరిగిన ఈ పేలుడులో మసీదు ఇమామ్ ఉన్నట్లు కాబూల్ పోలీసు ప్రతినిధి ఫెర్డస్ ఫరామార్జ్ తెలిపారు.
వారం రోజుల కిందట ఒక పాఠశాల వద్ద జరిగిన పేలుడులో 80 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. రంజాన్ ప్రార్థనలు జరగడానికి ముందే.. మసీదులో పేలుడు పదార్ధాలను అమర్చినట్లు పోలీసుల ప్రతినిధి ఫెర్‌దావస్ ఫరమార్జ్ తెలిపారు. ప్రార్థనలు ప్రారంభమైన కొద్ది సమయానికే బాంబు పేలిందని, అయితే దీనిపై ఏ తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మసీదు నుంచి పెద్ద శబ్దం వచ్చింది. కళ్లముందే ధ్వంసమైంది. పెద్దల, పిల్లల అరుపులు, ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుంటే చాలా మంది రక్తపు మడుగులో కనిపించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు చనిపోయారని’ తెలిపారు. ఈ పెలుడు పై విచారణ మొదలుపెట్టినట్లు కాబూల్ పోలీసులు తెలిపారు.
( చదవండి: 500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’ )
Comments
Please login to add a commentAdd a comment