Kabul blast
-
మసీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి!
కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరగటంతో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు.. 35 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తాలిబన్ నిఘా విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర కాబుల్, ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కిటికీలు, అద్దాలు పగిలిపోయాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల్లో మసీదు ఇమామ్ సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిఘా విభాగం బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టాయి. ఇదీ చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ.. తీర్పు ఏంటంటే? -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యూఎస్ అమర సైనికుని భార్య
కాబూల్ ఉగ్రవాద పేలుడులో మరణించిన ఓ సైనికుడి భార్య ఇటీవల ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తన భర్త జ్ఞాపకార్థం తన కూతురుకి అతని పేరు పెట్టుకుంది. దురదృష్టవశాత్తు బేబీ లెవీ రైలీ రోజ్ పుట్టినప్పటి నుంచి తన వీరోచిత తండ్రి రైలీ మెక్‌కొల్లమ్‌ని చూడలేదు. ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన భయానక బాంబు దాడిలో రైలీ మరణించాడు. ఆ ఘటనలో 170 మంది స్థానికులు, 13 మంది యూఎస్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆ పేలుడుకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్-కే ప్రకటించింది. ఆఫ్గన్ నుంచి తరలింపు ప్రారంభమైన కారణంగా రైలీని యూఎస్ ప్రభుత్వం అక్కడికి పంపింది. ఘటన జరిగిన రోజు విమానాశ్రయ తనిఖీ కేంద్రం నిర్వహిస్తున్నప్పుడు ఈ విషాదం చోటు చేసుకుని ఉండొచ్చని అధికారులు తెలిపారు. రైలీ మెక్‌కొల్లమ్‌కి ఈ ఫిబ్రవరిలో వివాహం జరిగింది. రైలీ దేశ సేవలో ప్రాణాలు కోల్పోయినందుకు తాను చాలా గర్వపడుతున్నానని అతని తల్లి తెలిపింది. అనంతరం ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. 15 సంవత్సరాల క్రితం, తొమ్మిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త మరణించాడని, దురదృష్టవశాత్తు అదే చరిత్ర పునరావృతమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! -
కాబూల్ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు
-
నేనే గనుక పదవిలో ఉండి ఉంటే.. : ట్రంప్ భావోద్వేగం
వాషింగ్టన్: తాను ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే కాబూల్ పేలుళ్ల ఘటన జరిగి ఉండేది కాదని మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తను పదవిలో ఉండి ఉంటే ఈ శోకం సంభవించేది కాదని పేర్కొన్నారు. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వేలాది మంది దేశాన్ని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా మృతి చెందగా.. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘ ధైర్య సాహసాలు ప్రదర్శించి సేవానిరతితో పని చేస్తూ అఫ్గనిస్తాన్ పేలుళ్ల దాడిలో అసువులు బాసిన అమెరికా సైనికులను గుర్తు చేసుకుంటూ జాతి నివాళులు అర్పిస్తోంది. శోకంలో మునిగిపోయింది. కర్తవ్య నిర్వహణలో భాగంగా మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. నేను గనుక మీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంతటి విషాదం ఎన్నడూ చోటుచేసుకునేది కాదు. ఎప్పటికీ ఇలా జరిగేది కాదు. దేశం కోసం, ఇతర దేశాల పౌరులను కాపాడే క్రమంలో ప్రాణలను పణంగా పెట్టిన అమెరికా హీరోల త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుందాం’’ అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. కాగా రెండు దశాబ్దాలుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా సేనలను... ట్రంప్ హయాంలో తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం ద్వారా పలు దఫాలుగా ఉపసంహరించకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ప్రావిన్సులపై పట్టు సాధించిన తాలిబన్లు.. అఫ్గన్ సైన్యాన్ని ఓడించి దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో.. అమెరికా చరిత్రలో ఇదో ఘోర ఓటమి అంటూ ట్రంప్.. బైడెన్ ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేశారు. చదవండి: Kabul Airport Attack: వేట తప్పదన్న బైడెన్.. దాడిని ఖండించిన తాలిబన్లు -
మసీదులో పేలుడు: 12 మంది మృతి
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కాబుల్ సమీపంలోని ఓ మసీదులోశుక్రవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరో 15 పైగా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాజధాని షకర్ దారా జిల్లాలోని జరిగిన ఈ పేలుడులో మసీదు ఇమామ్ ఉన్నట్లు కాబూల్ పోలీసు ప్రతినిధి ఫెర్డస్ ఫరామార్జ్ తెలిపారు. వారం రోజుల కిందట ఒక పాఠశాల వద్ద జరిగిన పేలుడులో 80 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. రంజాన్ ప్రార్థనలు జరగడానికి ముందే.. మసీదులో పేలుడు పదార్ధాలను అమర్చినట్లు పోలీసుల ప్రతినిధి ఫెర్‌దావస్ ఫరమార్జ్ తెలిపారు. ప్రార్థనలు ప్రారంభమైన కొద్ది సమయానికే బాంబు పేలిందని, అయితే దీనిపై ఏ తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మసీదు నుంచి పెద్ద శబ్దం వచ్చింది. కళ్లముందే ధ్వంసమైంది. పెద్దల, పిల్లల అరుపులు, ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుంటే చాలా మంది రక్తపు మడుగులో కనిపించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు చనిపోయారని’ తెలిపారు. ఈ పెలుడు పై విచారణ మొదలుపెట్టినట్లు కాబూల్ పోలీసులు తెలిపారు. ( చదవండి: 500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’ ) -
సత్యం చూపిన కన్ను.. ఇక లేదు
కాబూల్: నెత్తుటి మరకలతో అప్ఘనిస్థాన్ రోదించింది. సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 42 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో పది మంది విలేకరులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు. కాబూల్ మృతుల్లో ఏఎఫ్‌పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు. షా మరై గురించి... వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. అధికార మార్పిడి, అంతర్యుద్ధంతో సతమతమైన అఫ్ఘన్ చీకటి గతాన్ని రెండు దశాబ్దాలకు పైగా తన కెమెరాలో బంధించారు. ఉత్తర కాబూల్ షమాలి ప్రాంతానికి చెందిన షా మరై తర్వాత కాబూల్‌కు వలస వెళ్లారు. 1996లో ఏఎఫ్‌పీ వార్తా సంస్థలో ఓ డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని ఆయన మొదలుపెట్టారు. అరుదైన ఫోటోలను తాను పని చేసే సంస్థకు అందించి ఫోటోగ్రాఫర్‌గా మారిపోయారు. ముఖ్యంగా 2001లో అమెరికా సైన్యం అప్ఘనిస్థాన్‌పై విరుచుకుపడ్డప్పుడు ఆయన ఇచ్చిన ఫోటోలు ప్రపంచాన్ని కదిలించాయి. ఆయన టాలెంట్‌ను గుర్తించిన ఏఎఫ్‌పీ..ఆ మరుసటి సంవత్సరమే ఫోటో స్ట్రింగర్‌గా ఆయన్ని నియమించింది. ఆపై చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా ఆయన పదొన్నతి పొందారు. యుద్ధం అంటే ఇలా ఉంటుందా? ఫోటోల కోసం ఆయన చాలా శ్రమించేవారు. కొన్ని నెలలపాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఎత్తైన కొండలు, గుహలను దాటుకుని.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఆయన ప్రయాణించేవారు. ఆయన మూలంగానే అఫ్ఘన్‌లో యుద్ధ పరిస్థితులు ప్రపంచానికి తెలిశాయి. విస్మయపరిచే కోణాల్లో ఆయన తీసిన ఫోటోలు ‘యుద్ధం అంటే ఇలా ఉంటుందా?’ అన్న భావన కలిగించేవి. ఫోటోగ్రఫీని ఓ వృత్తి.. ప్రవృత్తిలా కాకుండా.. ఓవైపు ఉగ్ర కోరలు, మరోవైపు సంయుక్త సైన్యాల దాడులతో నలిగిపోతున్న ప్రజా జీవితాన్ని సమాజానికి తెలియపరచాలనే ఆయన ఆరాటపడేవారు. అలాంటి వ్యక్తి చివరకు ఉగ్ర ఘాతుకానికి బలైపోయారు. మరైకు భార్య, ఆరుగురు సంతానం. ఈ మధ్యే ఆయనకు కూతురు కూడా పుట్టింది. నిబద్ధతకు ప్రతిరూపం... షా మరై మరణంపై ఏఎఫ్‌పీ స్పందించింది. ‘నిబద్ధత.. నిజాయితీ కలిగిన వ్యక్తి షా మరై. ధైర్యశాలి. ప్రాణాలను పణంగా పెట్టి ఆయన తీసిన ఫోటోలు ఎన్నో. ఆయన కెమెరా కన్నులొంచే యుద్ధ బీభత్సాన్ని ప్రపంచానికి తెలిసింది. అలాంటి కన్ను చివరకు చిధ్రమైపోయింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని ఏఎఫ్‌పీ గ్లోబల్ న్యూస్ డైరెక్టర్ మైకేలే లెరిడాన్ ప్రకటన వెలువరించారు. ఆయన తీసిన కొన్ని ఫోటోలు కింద -
బాంబులతో దద్దరిల్లిన కాబూల్..
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. రాజధాని కాబూల్‌లోని ఓ షియా సాంస్కృతిక కళా వేదిక వద్ద పలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొని దాదాపు 40 మంది మృత్యువాతపడ్డారు. 30మందికి పైగా గాయాలపాలయ్యారు. చాలా రోజుల తర్వాత అత్యంత దారుణమైన హింసాత్మక ఘటన ఇదే. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా బలగాలు మాత్రం తాలిబన్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాబూల్ అంతర్గత భద్రతా వ్యవహారాల అధికార ప్రతినిధి నస్రాత్ రహిమి మీడియాతో మాట్లాడుతూ షియా సాంస్కృతిక కళా సెంటర్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అన్నారు. అఫ్ఘనిస్థాన్‌లో సోవియెట్ దురాక్రమణకు 38 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ ఓ కార్యక్రమం జరుగుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ‘40మంది చనిపోయినట్లు మా దగ్గర సమాచారం ఉంది. మరో 30 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే మొత్తం ప్రాణ నష్టంగా చెప్పలేము.. ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు. -
కాబూల్ రక్తసిక్తం..
-
కాబూల్ రక్తసిక్తం..
ట్రక్కు బాంబుతో ఆత్మాహుతి దాడి ∙ 90 మంది మృతి.. - 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడు - స్వల్పంగా దెబ్బతిన్న ఎంబసీ భవనం.. సిబ్బంది సేఫ్ ∙ దాడిని ఖండించిన ప్రధాని మోదీ కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని కాబూల్‌లో ఓ ఉగ్ర వాది భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ హింసాకాండలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృత్యువాతపడగా.. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వివిధ దేశాల ఎంబసీలు ఉండే చోట బుధ వారం ఉదయం 8.30 సమయంలో ఈ ఘట న చోటు చేసుకుంది. పేలుడు ధాటికి కిలో మీటర్ పరిధిలో ఉన్న భవనాల అద్దాలు, కిటి కీలు ధ్వంసమయ్యాయి. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరం లోనే ఈ దాడి జరిగింది. దాడిలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. భయానక వాతావరణం.. పేలుడు తర్వాత ఎటుచూసినా మృతదేహా లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ప్రాణాలు దక్కించుకునేందుకు గాయపడిన వారు, మహిళలు, స్కూల్ విద్యార్థినులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. పేలు డు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. తమ వారి గురించి ఆరా తీస్తూ చాలా మంది కన్నీరుమున్నీర య్యారు. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ‘దాడి మృతుల, బాధితుల్లో చాలా మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు’ అని అఫ్గాన్ ఆరోగ్య , హోం శాఖలు వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ఉదయం 8.30 సమయంలో జాన్‌బాగ్ స్క్వేర్ ప్రాంతం లో భారీగా పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు తో ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దురా గతానికి పాల్పడ్డాడని, ఈ దాడిలో 50 వాహ నాలు ధ్వంసమయ్యాయని వివరించాయి. బాధితులను ఆదుకునేందుకు కాబూల్ వాసులు ముందుకు రావాలని, రక్తానికి తీవ్ర కొరత ఉన్న దృష్ట్యా రక్త దానం చేయాలని కోరాయి. దాడిలో బీబీసీ చానల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. మా పని కాదు: తాలిబాన్ ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే తాలిబాన్ ఈ దాడి తాము చేయలేదని స్పష్టం చేసింది. రంజాన్ మాసం కావడంతో ప్రస్తుతం దాడులకు విరామం ప్రకటించామని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. భారతీయులంతా క్షేమం పేలుడులో భారత ఎంబసీ కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఎంబసీకి సమీపంలోనే పేలుడు సంభవిం చిందని, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఆఫ్గాన్‌లోని భారత రాయబారి మన్‌ప్రీత్ వోహ్రా తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలతో పాటు ఎంబసీ తలుపులు, కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. జపాన్ ఎంబసీ కూడా స్వల్పంగా దెబ్బతినగా, అక్కడి ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయప డ్డారు. దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు ట్విట్టర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భారత ఎంబసీ అధికారులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. -
బాంబులతో దద్దరిల్లిన కాబూల్
-
కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి
-
కాబూల్ జంటపేలుళ్లలో 10మంది మృతి
-
కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో 61మంది దుర్మరణం చెందగా, 200మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం కాబూల్‌లోని దహ్మజంగ్ సర్కిల్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. కాగా వందల మంది షియా ముస్లింలు ఓ చోట చేరి నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతంలో బాంబులు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు సూసైడ్ బాంబర్స్ పేల్చుకున్నట్లు తెలిపారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.