
మసీదు లక్ష్యంగా దాడి: 20 మంది మృతి
డమాస్కస్(సిరియా): ఐసిస్ తీవ్రవాదులు జరిపిన దాడుల్లో 20 మంది మృతిచెందారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా డమాస్కస్లోని సయ్యిదా జీనాబ్ మసీదుకు వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశారు. మసీదు బయట ఓ కారు బాంబు, మరో ఆత్మాహుతి దాడి జరిగింది.
రెండు బాంబు పేలుళ్లలో మొత్తం 20 మంది మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రార్థన కోసం మసీదుకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐఎస్ఐఎస్ ఈ దాడులకు తెగబడింది.