
మస్కట్: ఒమన్‌లోని వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం(జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పులువురికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment