మసీదులో తేనెటీగల కలకలం | Swarm Of Bees Attacks Worshippers At Mosque | Sakshi
Sakshi News home page

మసీదులో తేనెటీగల కలకలం

Published Sat, Apr 2 2016 4:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

మసీదులో తేనెటీగల కలకలం

మసీదులో తేనెటీగల కలకలం

ఫినిక్స్ : మసీదులో ప్రార్థనలు చేసే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో కలకలంరేగింది. ఈ సంఘటన అమెరికాలోని ఫినిక్స్లోని మసీదులో చోటుచేసుకుంది. శుక్రవారం(భారత కాలమాన ప్రకారం శనివారం) మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడున్న వారి పై తేనెటీగలు దాడి చేశాయి. అయితే వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సేప్టీ సిబ్బంది ఫోమ్ సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కవర్లు, దుప్పట్ల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మసీదులో ఉన్న తేనెతెట్టను శనివారం అక్కడ నుంచి తీసివేయాలని అనుకున్నారు. కానీ, ఈ లోపే ఈ ఘటన చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలయిన 24 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో 20 మందికి స్పల్పగాయాలవ్వగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement