భక్తి శ్రద్ధలతో బక్రీద్ | Devotion with attention bakrid | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో బక్రీద్

Published Thu, Oct 17 2013 1:13 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Devotion with attention bakrid

సాక్షి, న్యూఢిల్లీ : త్యాగానికి ప్రతీకగా చెప్పుకునే బక్రీద్(ఈద్-ఉల్-అజ్‌హ)ను రాజధానిలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం ఉదయం నుం చే నగరంలో మసీదుల వద్ద రద్దీ పెరిగింది. సంప్రదాయ దుస్తుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలతో జామామసీద్ ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. బక్రీద్ సందర్భంగా తమకు దగ్గరలోని మసీద్‌ల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. సామూహిక ప్రార్థనలు వందల సంఖ్యలో ముస్లింలు ఒక్కచోట చేరడంతో ఆ పరిసరాలు క కళకళగా కనిపించాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. 
 
 అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్నారుల ఆటపాటలతో జామామసీద్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొం ది. ఫిరోజ్ షాకోట్లా, పటేల్‌నగర్ మసీద్, ఫతేఫూర్  మసీద్, నిజాముద్దీన్ మసీద్‌లు ముస్లింలతో కిటకిటలాడాయి. ‘దేశంలో శాంతి నెలకొనాలని, సోదరభావం పెంపొందాలని సామూహిక ప్రార్థనలు చేశాం’అని ఫతేఫూర్ మసీద్ ఇమామ్ తెలిపారు. వారం రోజులుగా కొనుగోలు చేసిన మేక లు, గొర్రెలను బలి ఇచ్చారు. 
 
 సంప్రదాయం ప్రకారం మాంసాన్ని పంచి పెట్టారు. బక్రీద్‌ను పురస్కరించుకుని ఈ ఏడాది వందల సంఖ్యలో మేకలు,గొర్రెలు అమ్ముడైనట్టు చాందినీ చౌక్‌కి చెందిన గౌస్ మహ్మద్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా స్నేహితులు, బంధువులతో కలిసి ప్రత్యేక వంటకాలు ఆరగించారు.
 
 సేవా సదన్ కాంప్లెక్స్‌ను సందర్శించిన నజీబ్ జంగ్
 ఈద్‌ను పురస్కరించుకుని లెప్టినెంట్ గవర్నర్ నజీ బ్ జంగ్ లంపుర్‌లోని సేవాసదన్ కాంప్లెక్స్‌ను బుధవారం సందర్శించారు. ఢిల్లీ సమాజ సంక్షేమ విభా గం నడిపే సేవా సదన్ కాంప్లెక్స్‌లో ఉంటున్న వృద్ధులు, మానసిక, శారీరక వికలాంగులతో ఈద్ వేడుకలను జరుపుకున్నారు. సేవాసదన్‌వాసులతో చాలాకాలం గడిపిన లెప్టినెంట్ గవర్నర్ వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement