మసీదు ఎదుట బాంబు పేలుడు | Bomb explodes near mosque, no casualty | Sakshi
Sakshi News home page

మసీదు ఎదుట బాంబు పేలుడు

Published Fri, Mar 14 2014 9:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

తమిళనాడు మదురై సమీపంలోని నెలపట్టయిలో మసీదు ఎదుట శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది.

తమిళనాడు మదురై సమీపంలోని నెలపట్టయిలో మసీదు ఎదుట శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. పేలిన బాంబు అంత శక్తిమంతమైనది కాదని, అందువల్ల ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే మసీదు సమీపంలో పార్క్ చేసి ఉంచిన రెండు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. బాంబు పేలుడు ఘటనతో నెలపట్టయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.

బాంబు పేలుడుపై బాంబు నిపుణులను సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత నెలలో ఉత్తంగుడిలోని మార్కెట్ గోడ వద్ద పైప్ బాంబును స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబు పేలకుండా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement