Pipe bomb
-
Japan PM: జపాన్ ప్రధానికి తప్పిన ముప్పు.. అతి సమీపంలో పేలుడు..
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ ప్రాంత వకయామ ప్రిఫెక్చర్‌లోని తీర నగరం సైకజాకిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ప్రసంగానికి కొద్దిసేపటి ముందు కిషిదా నిల్చున్న ప్రదేశానికి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు వినిపించింది. అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు మాస్క్ ధరించి ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మరో ట్యూబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh — BNO News Live (@BNODesk) April 15, 2023 పేలుడుతో అక్కడికి చేరిన ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో కిషిదా కొంత భయపడినట్లు కనిపించారు. అనంతరం ప్రచార కార్యక్రమాలను ఆయన యథా ప్రకారం కొనసాగించారు. అనుమానిత వస్తువును విసిరినట్లు భావిస్తున్న ఒక యువకుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరొకజు మట్సునో చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన.. ఘటన వెనుక కారణాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అది ఎటువంటి పేలుడు వస్తువనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పైపు బాంబు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం హాట్ స్ప్రింగ్ రిసార్టు పట్టణం కరుయిజావాలో జి–7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన జపాన్ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు, మేలో కిషిదా సొంత పట్టణం హిరోíÙమాలో జి–7 నేతల శిఖరాగ్రం జరగనుంది. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
గ్యాస్‌గోడౌన్ పక్కనే పైప్ బాంబు
గుర్తించి నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్ జగ్గయ్యపేటలో తప్పిన పెను ప్రమాదం జగ్గయ్యపేట, న్యూస్‌లైన్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ గోడౌన్ పక్కనే హైఎక్స్ప్లోజివ్ పైప్బాంబు లభించడం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గయ్యపేటలోని జైసంతోషి గ్యాస్ గోడౌన్ లో బాంబు ఉందంటూ ఈనెల 7న గోడౌన్ యజమాని మూర్తికి ఫోన్‌కాల్ వచ్చింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గోడౌన్‌ను, కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినా బాంబు ఆచూకీ తెలియలేదు. అయితే గోడౌన్లో బాంబు ఉందంటూ ఎస్ఐ శ్రీనుకు గురువారం, శుక్రవారం కూడా ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో ఎస్ఐ మరోసారి ఉదయం నుంచి తన సిబ్బందితో గోడౌన్ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్ సుమారు గంటపాటు తనిఖీ చేసిన అనంతరం గోడౌన్ పక్కన కారు పార్కింగ్ సమీపంలో ఉన్న పొదల్లో బాంబును గుర్తించారు. మూడు గంటలపాటు శ్రమించి దాన్ని నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అరకిలో అమోనియో నైట్రేట్, 250 గ్రాముల జిలిటెన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను 12అంగుళాల పైపులో ఉంచి దానికి సేప్టీ ఫీజును ఏర్పాటుచేసి ఈ బాంబును తయారుచేశారు. ఇది పూర్తిగా నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ కావడంతో నిర్వీర్యం చేయడానికి స్క్వాడ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ బాంబు పేలితే పక్కనే ఉన్న గ్యాస్ గోడౌన్కూడా పేలి పెను ప్రమా దం సంభవించేదని, వేలాదిమంది మృతి చెందేవారని ఆందోళన వ్యక్తంచేశారు. -
మసీదు ఎదుట బాంబు పేలుడు
తమిళనాడు మదురై సమీపంలోని నెలపట్టయిలో మసీదు ఎదుట శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. పేలిన బాంబు అంత శక్తిమంతమైనది కాదని, అందువల్ల ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే మసీదు సమీపంలో పార్క్ చేసి ఉంచిన రెండు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. బాంబు పేలుడు ఘటనతో నెలపట్టయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. బాంబు పేలుడుపై బాంబు నిపుణులను సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత నెలలో ఉత్తంగుడిలోని మార్కెట్ గోడ వద్ద పైప్ బాంబును స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబు పేలకుండా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. -
పేలుడుకు కుట్ర!
సాక్షి, చెన్నై: మదురైలో పేలుడుకు సంఘ విద్రోహ శక్తులు చేసిన కుట్ర భగ్నం అయింది. ఓ షాపింగ్‌మాల్‌లో అమర్చిన పైప్ బాంబును మంగళవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. నగరంలో నిఘాను మరింత పటిష్టం చేశారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంపై సంఘ విద్రోహ శక్తులు గురి పెట్టినట్టుగా ఇటీవల కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ చర్యలు చేపట్టారు. సంఘ విద్రోహశక్తుల కదలికలపై డేగ కన్నువేశారు. అయినప్పటికీ పేలుడుకు కుట్ర పన్ని మంగళవారం నగరంలోని ప్రధాన షాపింగ్ మాల్ వెనుక పైప్ బాంబు అమర్చి ఉండడం వెలుగులోకి వచ్చింది. పైప్ బాంబుకు టైమర్ అమర్చి ఉండడంతో అందులో నుంచి వస్తున్న శబ్దాన్ని అక్కడి సిబ్బంది గుర్తిం చారు. తక్షణం పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాంబును స్వాధీనం చేసుకున్న నగర పోలీసులు వైగై నదిలోకి తీసుకెళ్లారు. దానిని నిర్వీర్యం చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే, ఆ బాంబు షాపింగ్ మాల్ వద్దకు ఎలా వచ్చిందో విచారణ జరుపుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి ఇంటి వద్ద లభించిన తరహాలోనే ఈ పైప్ బాంబు ఉండటంతో పోలీసుల్ని కలవరంలో పడేస్తోంది. ఈ పైప్ బాంబు పేలి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకుని ఉండేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పైపు బాంబు ద్వారా నగరంలో పేలుడుకు కుట్ర జరిగిన సమాచారం అక్కడి ప్రజల్లో కలకలానికి దారి తీసింది. దీంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మీనాక్షి అమ్మవారి ఆలయం, బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటుగా ముఖ్య ప్రదేశాల్లో భద్రతను ఏడంచెలకు పెంచారు. ఈ పైప్ బాంబును అమర్చి పేలుడుకు కుట్ర చేసిన సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకోవడం లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఉన్నాయి. -
కేంద్ర మంత్రి కారు కింద బాంబు
-
కేంద్ర మంత్రి కారు కింద బాంబు!
యానాం, న్యూస్‌లైన్/పుదుచ్చేరి: కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద శక్తిమంతమైన పైపు బాంబు బయటపడింది. బుధవారం వేకువజామున పుదుచ్చేరి ఎలైమనన్ కోయిల్ వీధిలోని ఆయన ఇంటి బయట నిలిపి ఉంచిన కారు అడుగున ఇది కనిపించింది. దీన్ని గమనించిన కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. రెండు వైపులా మూసేసి, రెండు వైర్లు తగిలించి ఉన్న గొట్టంలాంటి ఆ బాంబును తమిళనాడు పోలీసు విభాగానికి చెందిన బాంబ్‌స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. కేజీన్నర బరువున్న ఈ బాంబుకు చిన్నచిన్న ఎలక్ట్రికల్, నాన్-ఎలక్ట్రికల్ డిటోనేటర్లు అమర్చారని పోలీసులు తెలిపారు. ఇది పేలి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని అన్నారు. ఈ ఉదంతంపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీజీపీ కామ్రాజ్ చెప్పారు. ఈ సంఘటన తర్వాత మంత్రి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంత్రి నారాయణసామి మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో అసాంఘిక శక్తులు విజంభిస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. బాంబు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.