Bomb explodes
-
రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు
వార్సా: రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్ కాలువలో పేలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాల్‌బాయ్ లేదా భూకంపంగా పిలిచే ఈ బాంబు దాదాపు 5వేల కిలోల ఉంటుందని అక్కడి నేవీ అధికారులు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దం నాటి ఈ బాంబును మంగళవారం బాల్టిక్ సముద్రం సమీపంలోని కాలువలో నిర్వీర్యం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘జాన్సన్’ టీకా ప్రయోగానికి బ్రేక్) 1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ క్రూయిజర్ లుట్జోపై దాడి చేసేందుకు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఈ బాంబును పొలాండ్‌లో వదిలినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ బాంబు అక్కడే ఉందని నేవీ అధికారులు తెలిపారు. దీనిపై నేవీ అధికారి మాట్లాడుతూ.. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో బాంబును మంగళవారం స్వీనోజ్‌సై ప్రాంతంలోని పియూస్ట్ కాలువలో నిర్వీర్యం చేస్తుండగా పేలినట్లు వెల్లడించారు. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో కాలువ సమీపంలో నివసించే 750 మందిని అక్కడి నుంచి తరలించారు. ఈ బాంబు దాదాపు 5400 కిలోల బరువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై కూడా దీనివల్ల ఎలాంటి ముంపు ఉండదని ఆయన స్ఫష్టం చేశారు. (చదవండి: సహజీవనం.. ఆసక్తికర అధ్యయనం!) -
బాంబు పేలుడు: ఏడుగురికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్‌లోని ప్రధాన మార్కెట్లో బుధవారం సాయంత్రం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మార్కెట్ సమీపంలో శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో బ్యాగ్ ఉంచడంతో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఈ బాంబు పేలుడుకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు. -
మసీదు ఎదుట బాంబు పేలుడు
తమిళనాడు మదురై సమీపంలోని నెలపట్టయిలో మసీదు ఎదుట శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. పేలిన బాంబు అంత శక్తిమంతమైనది కాదని, అందువల్ల ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే మసీదు సమీపంలో పార్క్ చేసి ఉంచిన రెండు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. బాంబు పేలుడు ఘటనతో నెలపట్టయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. బాంబు పేలుడుపై బాంబు నిపుణులను సంప్రదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత నెలలో ఉత్తంగుడిలోని మార్కెట్ గోడ వద్ద పైప్ బాంబును స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబు పేలకుండా నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే నివాసంలో బాంబు పేలుడు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగర శివారులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ లోకెన్ నివసిస్తున్న కాంప్లెక్స్‌లో బుధవారం సాయంత్రం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. అయితే పేలుడు సంభవించిన సమయంలో ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారని, కానీ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ కాంప్లెక్స్‌లోని కొంత భాగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. బాంబు పేలుడు ఘటన తీవ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మణిపూర్ సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడు
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసానికి కూతవేటు దూరంలో మంగళవారం ఉదయం 6 గంటలకు శక్తివంతమైన బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని సీఎం నివాసానికి అత్యంత సమీపంలోని కవైర్రాంబండ మార్కెట్ కాంప్లెక్ సమీపంలోని బిరొడన్ స్కూల్ వద్ద ఆ బాంబు విస్ఫోటం సంభవించింది. సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడుతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు. అయితే తీవ్రవాదులు ఆ బాంబును అమర్చార లేక విసిరార అనేది ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యుల మంటూ ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. గత ఆగస్టులో కూడా సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట బాంబు పేలిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనలో కూడా ఎవరు గాయపడలేదు.