మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగర శివారులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ లోకెన్ నివసిస్తున్న కాంప్లెక్స్లో బుధవారం సాయంత్రం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. అయితే పేలుడు సంభవించిన సమయంలో ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారని, కానీ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
పేలుడు వల్ల ఆ కాంప్లెక్స్లోని కొంత భాగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. బాంబు పేలుడు ఘటన తీవ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.