రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు | 5 Thousand Kgs World War 2 Bomb Explodes Underwater In Poland | Sakshi
Sakshi News home page

రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు

Published Wed, Oct 14 2020 6:37 PM | Last Updated on Wed, Oct 14 2020 7:19 PM

5 Thousand Kgs World War 2 Bomb Explodes Underwater In Poland - Sakshi

వార్సా: రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్‌ కాలువలో పేలిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టాల్‌బాయ్‌ లేదా భూకంపంగా పిలిచే ఈ బాంబు దాదాపు 5వేల కిలోల ఉంటుందని అక్కడి నేవీ అధికారులు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దం నాటి ఈ బాంబును మంగళవారం బాల్టిక్‌ సముద్రం సమీపంలోని కాలువలో నిర్వీర్యం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘జాన్సన్‌’ టీకా ప్రయోగానికి బ్రేక్)

1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ క్రూయిజర్‌ లుట్జోపై దాడి చేసేందుకు బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును పొలాండ్‌లో వదిలినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ బాంబు‌ అక్కడే ఉందని నేవీ అధికారులు తెలిపారు. దీనిపై నేవీ అధికారి మాట్లాడుతూ.. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో బాంబును మంగళవారం స్వీనోజ్‌సై ప్రాంతంలోని పియూస్ట్‌ కాలువలో నిర్వీర్యం చేస్తుండగా పేలినట్లు  వెల్లడించారు. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో కాలువ సమీపంలో నివసించే 750 మందిని అక్కడి నుంచి తరలించారు. ఈ బాంబు దాదాపు 5400 కిలోల బరువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై కూడా దీనివల్ల ఎలాంటి ముంపు ఉండదని ఆయన స్ఫష్టం చేశారు. (చదవండి: సహజీవనం.. ఆసక్తికర అధ్యయనం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement