world war-II
-
ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్లపై డైవర్ ఎరిక్ పెట్కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు. వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా. అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్‌ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు. (చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక) -
ఉక్రెయిన్‌కి మద్దతుగా కీలకమైన బిల్లు...పుతిన్ పని ఔట్
Putin doesn't know way out of war: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై సాగిస్తున్న దాడిని సైనిక చర్యగానూ, మాతృభూమి రక్షణ కోసం చేస్తున్న పోరాటంగా సమర్థించుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. గత రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దాడిని గత దశాబ్దాల కాలంలో ఐరోపాలో జరగని అత్యంత ఘోరమైన యుద్ధంగా బైడెన్ అభివర్ణించారు. అంతేకాదు బైడెన్ ఉక్రెయిన్‌కు సహాయాన్ని వేగవంతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఉక్రెయిన్‌కు మరో 4,000 కోట్ల డాలర్ల సైనిక, మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం సంతకం చేశారు. రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించడంలో ఈ సాయం కీలకంగా మారనుందని అనంతరం ఓ ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని సహాయం చేసేలా రెండో ప్రపంచ యుద్ధం నాటి లెండ్ లీజు చట్టాన్ని ప్రవేశ పెట్టారు. ఈ మేరకు బైడన్ ఆ బిల్లు పై సంతకం చేస్తూ..."ఉక్రెనియన్ ప్రజలు తమ మాతృభూమి కోసం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ కీలకమైన బిల్లుపై నేను సంతకం చేస్తున్నాను. ఇది రెండోవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా తన మిత్రదేశాలకు సహాయం చేయడంలో ఉపకరించిన లెండ్ లీజు చట్టం. 1941 వరకు యుఎస్ యుద్ధంలోకి ప్రవేశించనప్పటికీ, ఈ చట్టంతో దాని మిత్రదేశాలకు సహాయం చేసిందని చెప్పారు. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పని అయిపోయినట్లేనని, ఇక యుద్ధం నుండి బయటపడే మార్గమే ఉండదన్నారు. ఈయుద్ధం కారణంగా నాటో, యూరోపియన్ యూనియన్ విడిపోతాయని పుతిన్ చాలా తప్పుగా భావించారు. పుతిన్ సాగిస్తున్న యుద్ధం యూరప్‌లో విధ్వంసాన్ని తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు భంగం కలిగించింది. శాంతియుత పరిష్కారంపై ఆధారపడిన భవిష్యత్తుకు శాశ్వతమైన నిబద్ధతను పునరుద్ఘాటించేందుకే ఈ బిల్లు పై సంతకం చేశాను. ఈ బిల్లుకు మద్దతిచ్చి ఆమోదించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ సభ్యులకు ధన్యావాదాలు. అని అన్నారు. అంతేకాదు పుతిన్ సాగిస్తున్న దురాక్రమణ చర్యలను తన సొంతగడ్డలోని ప్రజలే వ్యతిరేకించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కూడా. (చదవండి: పుతిన్ ఫొటో వైరల్.. ఆరోగ్యంపై అనుమానాలకు మరింత బలం!) -
రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు
వార్సా: రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్ కాలువలో పేలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాల్‌బాయ్ లేదా భూకంపంగా పిలిచే ఈ బాంబు దాదాపు 5వేల కిలోల ఉంటుందని అక్కడి నేవీ అధికారులు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దం నాటి ఈ బాంబును మంగళవారం బాల్టిక్ సముద్రం సమీపంలోని కాలువలో నిర్వీర్యం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. (చదవండి: ‘జాన్సన్’ టీకా ప్రయోగానికి బ్రేక్) 1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ క్రూయిజర్ లుట్జోపై దాడి చేసేందుకు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఈ బాంబును పొలాండ్‌లో వదిలినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ బాంబు అక్కడే ఉందని నేవీ అధికారులు తెలిపారు. దీనిపై నేవీ అధికారి మాట్లాడుతూ.. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో బాంబును మంగళవారం స్వీనోజ్‌సై ప్రాంతంలోని పియూస్ట్ కాలువలో నిర్వీర్యం చేస్తుండగా పేలినట్లు వెల్లడించారు. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో కాలువ సమీపంలో నివసించే 750 మందిని అక్కడి నుంచి తరలించారు. ఈ బాంబు దాదాపు 5400 కిలోల బరువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై కూడా దీనివల్ల ఎలాంటి ముంపు ఉండదని ఆయన స్ఫష్టం చేశారు. (చదవండి: సహజీవనం.. ఆసక్తికర అధ్యయనం!) -
భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో..
-
భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో..
హాంకాంగ్ : యుద్ధాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బాంబులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏళ్ల తర్వాత బయటపడుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హాంకాంగ్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. వెయ్యి పౌండ్ల బరువు ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలానికి చెందిన ఓ బాంబును హాంకాంగ్‌లో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాల వీధిలో గుర్తించారు. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దానిని పేలకుండా బయటకు తీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. దీనిపై హాంకాంగ్ పోలీసులు వివరాలు చెబుతూ గడిచిన వారంలోనే ఇది రెండో బాంబు అని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో పలు ప్రాంతాల్లో భూమిలోపల బాంబులు పేలకుండా పడిపోయి ఉన్న విషయం తెలిసిందే. ఏదైనా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు జరిపే తవ్వకాల్లో ఇవీ అనూహ్యంగా బయటపడుతున్నాయి. తాజాగా బయటపడిన బాంబు అమెరికా తయారు చేసిన ఏఎన్-ఎం65 బాంబు అని, ప్రస్తుతం అది బయటపడిన చోటు ఒకప్పుడు జపాన్ ఆదీనంలో ఉండేదని అధికారులు చెప్పారు. దాదాపు 4000 మందిని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించి రాత్రికి రాత్రి తీవ్రంగా శ్రమించి ఆ బాంబు నిర్వీర్యం చేశారు. -
జర్మనీలో రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు!
రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు ఒకటి పశ్చిమ జర్మనీలో కనిపించింది. దాదాపు 250 కిలోల బరువున్న ఆ బాంబును గుర్తించిన పోలీసులు వెంటనే బాంబు నిర్వీర్య దళానికి చెప్పడంతో వాళ్లు వచ్చి, దాన్ని నిర్వీర్యం చేశారు. అందుకోసం ఏకంగా 5000 మంది ప్రజలను అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం నాడు అక్కడ కడుతున్న ఓ 45 అంతస్థుల అపార్టుమెంటు బిల్డింగ్ కోసం తవ్వకాలు జరుపుతుండగా ఆ తవ్వకాల్లో ఈ బాంబు బయటపడింది. అప్పటికే అక్కడ చాలావరకు తవ్వకం పూర్తి కావడంతో ఆ బాంబును కంట్రోల్డ్ డిటొనేషన్ ద్వారా పేల్చేయాలని నిపుణులు నిర్ణయించారు. అందుకే దానికి 300 మీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాదాపు 5000 మంది ప్రజలను ఖాళీ చేయించారు. ఇంతకుముందు కూడా ఇక్కడి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కూడా రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు ఒకదాన్ని నిర్వీర్యం చేశారని, అప్పుడు దాదాపు 1800 మందిని ఖాళీ చేయించారని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. జర్మనీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక బాంబులు భూమిలో కప్పెట్టి ఉన్నాయి. జనవరి 3వ తేదీన ఓ నిర్మాణ కార్మికుడు డిగ్గర్తో తవ్వుతుండగా బాంబుపేలి ప్రాణాలు కోల్పోయాడు.