రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు ఒకటి పశ్చిమ జర్మనీలో కనిపించింది. దాదాపు 250 కిలోల బరువున్న ఆ బాంబును గుర్తించిన పోలీసులు వెంటనే బాంబు నిర్వీర్య దళానికి చెప్పడంతో వాళ్లు వచ్చి, దాన్ని నిర్వీర్యం చేశారు. అందుకోసం ఏకంగా 5000 మంది ప్రజలను అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం నాడు అక్కడ కడుతున్న ఓ 45 అంతస్థుల అపార్టుమెంటు బిల్డింగ్ కోసం తవ్వకాలు జరుపుతుండగా ఆ తవ్వకాల్లో ఈ బాంబు బయటపడింది. అప్పటికే అక్కడ చాలావరకు తవ్వకం పూర్తి కావడంతో ఆ బాంబును కంట్రోల్డ్ డిటొనేషన్ ద్వారా పేల్చేయాలని నిపుణులు నిర్ణయించారు. అందుకే దానికి 300 మీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దాదాపు 5000 మంది ప్రజలను ఖాళీ చేయించారు.
ఇంతకుముందు కూడా ఇక్కడి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కూడా రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు ఒకదాన్ని నిర్వీర్యం చేశారని, అప్పుడు దాదాపు 1800 మందిని ఖాళీ చేయించారని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. జర్మనీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక బాంబులు భూమిలో కప్పెట్టి ఉన్నాయి. జనవరి 3వ తేదీన ఓ నిర్మాణ కార్మికుడు డిగ్గర్తో తవ్వుతుండగా బాంబుపేలి ప్రాణాలు కోల్పోయాడు.
జర్మనీలో రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు!
Published Fri, Jan 31 2014 12:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement