జర్మనీలో 1400 కిలోల బాంబు
ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలని బాంబును కనుగొన్నారు. బ్లాక్‌బస్టర్‌గా పిలిచే ఈ భారీ బాంబును వచ్చే ఆదివారం నిర్వీర్యం చేయనున్నారు. దీంతో బాంబును గుర్తించిన చోటు నుంచి సుమారు 70 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి స్థానిక అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
గోథె యూనివర్సిటీ వెస్ట్‌ఎండ్ క్యాంపస్ సమీపంలో కొనసాగుతున్న భవన నిర్మాణ పనుల్లో 1400 కిలోల బరువున్న ఈ బాంబు బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.