Joe Biden Signs Ukraine Bill: Biden as Us Revives 'WW2 Era Act' for Ukraine - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌కి మద్దతుగా కీలకమైన బిల్లు...పుతిన్‌ పని ఔట్‌

Published Tue, May 10 2022 8:19 PM | Last Updated on Wed, May 11 2022 8:29 AM

Joe President Biden As US Revives WW 2 Era Act For Ukraine - Sakshi

Putin doesn't know way out of war: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ పై సాగిస్తున్న దాడిని సైనిక చర్యగానూ, మాతృభూమి రక్షణ కోసం చేస్తున్న పోరాటంగా సమర్థించుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. గత రెండు నెలలకు పైగా ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దాడిని  గత దశాబ్దాల కాలంలో ఐరోపాలో జరగని అత్యంత ఘోరమైన యుద్ధంగా బైడెన్‌ అభివర్ణించారు.

అంతేకాదు బైడెన్‌ ఉక్రెయిన్‌కు సహాయాన్ని వేగవంతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఉక్రెయిన్‌కు మరో 4,000 కోట్ల డాలర్ల సైనిక, మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సోమవారం సంతకం చేశారు. రష్యాపై ఉక్రెయిన్‌ విజయం సాధించడంలో ఈ సాయం కీలకంగా మారనుందని అనంతరం ఓ ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు.

యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని సహాయం చేసేలా రెండో ప్రపంచ యుద్ధం నాటి లెండ్‌ లీజు చట్టాన్ని ప్రవేశ పెట్టారు. ఈ మేరకు బైడన్‌ ఆ బిల్లు పై సంతకం చేస్తూ..."ఉక్రెనియన్ ప్రజలు తమ మాతృభూమి కోసం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ కీలకమైన బిల్లుపై నేను సంతకం చేస్తున్నాను. ఇది రెండోవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా తన మిత్రదేశాలకు సహాయం చేయడంలో ఉపకరించిన లెండ్ లీజు చట్టం.

1941 వరకు యుఎస్ యుద్ధంలోకి ప్రవేశించనప్పటికీ, ఈ చట్టంతో దాని మిత్రదేశాలకు సహాయం చేసిందని చెప్పారు. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పని అయిపోయినట్లేనని, ఇక యుద్ధం నుండి బయటపడే మార్గమే ఉండదన్నారు. ఈయుద్ధం కారణంగా నాటో, యూరోపియన్‌ యూనియన్‌ విడిపోతాయని పుతిన్‌ చాలా తప్పుగా భావించారు.

పుతిన్ సాగిస్తున్న యుద్ధం యూరప్‌లో విధ్వంసాన్ని తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు భంగం కలిగించింది. శాంతియుత పరిష్కారంపై ఆధారపడిన భవిష్యత్తుకు శాశ్వతమైన నిబద్ధతను పునరుద్ఘాటించేందుకే ఈ బిల్లు పై సంతకం చేశాను. ఈ బిల్లుకు మద్దతిచ్చి ఆమోదించిన ప్రతి ఒక్క కాంగ్రెస్‌ సభ్యులకు ధన్యావాదాలు. అని అన్నారు. అంతేకాదు పుతిన్‌ సాగిస్తున్న దురాక్రమణ చర్యలను తన సొంతగ‍డ్డలోని ప్రజలే వ్యతిరేకించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కూడా.

(చదవండి: పుతిన్‌ ఫొటో వైరల్‌.. ఆరోగ్యంపై అనుమానాలకు మరింత బలం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement