
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్‌కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్‌లపై డైవర్ ఎరిక్ పెట్‌కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు.
వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా.
అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్‌ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు.
(చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక)
Comments
Please login to add a commentAdd a comment