World War 1 memorabilia
-
ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత...
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తిగా ధ్వసంమై సముద్ర గర్భంలో పడి ఉన్న వందేళ్ల నాటి జలాంతర్గామిని శిథిలాల పరిశోధకుడు డైవర్ ఎరిక్ పెట్కోవిక్ కనుగొన్నాడు. ధ్వంసమై సముద్రంలో పడి ఉన్న బోట్లపై డైవర్ ఎరిక్ పెట్కోవిక్ పరిశోధనలు చేస్తుంటాడు. ఈ జలాంతర్గామిని వర్జీనియా తీరంలోని కేవలం 400 అడుగుల లోతుల్లో గుర్తించాడు. వాస్తవానికి ఈ జలాంతర్గామి మొదటి ప్రపంచ యుద్ధంలో 1922లో అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో సుమారు 1600 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబందించి ఐదు జలాంతర్గాములు, రెండవ ప్రపంచ యద్ధానికి సంబంధించి ఎనిమిది జలంతర్గాములను కనుగొన్నారు. అయితే ఈ యూ-111 జలంతర్గామి కూడా వర్జినియాలోనే మునిగిపోయినట్లు పరిశోదకులు గుర్తించలేకపోవడమే కాకుండా కనుగొన లేకపోయారు కూడా. అదీగాక సముద్రంలో ఉండే ఉప్పు కారణంగా మునిగిపోయిన ఓడలు, జలాంతర్గాములు వేగంగా క్షీణిస్తాయి. సముద్రంలో ఉండే కొన్ని రకాల పురుగులు కలపను తినేస్తాయి. అయినప్పటికీ ఈ జలంతర్గామి శిధిలాలు సజీవంగా కనుగొనడం విశేషమే. 1985లో తొలిసారిగా రాబర్ట్ బల్లార్డ్ అనే పరిశోధకుడు టైటానిక్ ఓడల శిధిలాలను కనుగొన్నాడు. అతని తర్వాత డైవర్ ఎరిక్ పెట్ కోవిక్ ఈ ధ్యంసమైన నౌకలను పరిశోధించడం ప్రారంభించాడు. ఈ పరిశోధకుడు తన మిత్రుడు రస్వీ సాయంతో ఎక్స్‌ప్లోరర్ డైవింగ్ నౌకను ఉపయోగించి ఈ జలాంతర్గామి శిథిలాలను వెలికితీశాడు. (చదవండి: Viral Video: సాధారణ తాడుపై సాహసమేముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక) -
మొనగాళ్లకు మొనగాడు
గగనతల పోరాటంలో ఐదు, అంతకుమించిన సంఖ్యలో శత్రువుల యుద్ధ విమానాలను కూల్చి వేసిన పైలట్‌ను ‘ఫ్లయింగ్ ఏస్’ అంటారు. ‘ఫైటర్ ఏస్’, ‘ఎయిర్ ఏస్’ అని కూడా పేరు. సాధారణ భాషలో మొనగాళ్లకు మొనగాడైన యుద్ధవిమాన పైలట్ అని. మన దేశంలో అలాంటి తొలి మొనగాడే ఇంద్రలాల్ రాయ్. మొదటి ప్రపంచ యుద్ధంలో యు.కె. రాయల్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ సైనికుడిగా 170 గంటల నిడివిలో 10 శత్రు విమానాల్ని నేలకూల్చాడు రాయ్! రాయ్ 1889 డిసెంబర్ 2 కలకత్తాలో జన్మించాడు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. దేశ విభజనకు ముందు తూర్పు బెంగాల్లో వీళ్లది పేరున్న జమీందారీ వంశం. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఇంద్రలాల్ రాయ్ లండన్‌లోని సెయిట్ పాల్స్ స్కూల్లో చదువుతున్నాడు. రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్‌కి దరఖాస్తు చేసినప్పుడు రాయ్ కంటి చూపు తీక్షణంగా లేకపోవడంతో అతడిని నిరాకరించారు. అయితే అతడు కంటి స్పెషలిస్టు దగ్గర రెండో అభిప్రాయం తీసుకుని అతడి చూపు పదునుగా ఉందని చెప్పించడంతో అతడిని ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకున్నారు. 1917లో శిక్షణానంతరం నేరుగా వార్‌లోకి పంపించారు. పది ఫ్లయిట్లను పడగొట్టిన అనంతరం జరిగిన ‘డాగ్ ఫైట్’ (అతి సమీపాన్నుంచి శత్రువును డీకొనడం) ప్రాణాలు కోల్పోయాడు రాయ్. అలా 19 ఏళ్ల వయసుకే అమర సైనికుడు అయ్యాడు. నేడు ఇంద్రలాల్ రాయ్ వర్ధంతి. 1978 జూలై 22న అతడు వీర మరణం పొందాడు. (చదవండి: బ్లాక్ అండ్ వైట్ నక్షత్రం) -
యుద్ధంలో ఒక్కసారిగా మారిన సీన్.. రష్యా బలగాల గజగజ
Ukraine War: రష్యా, తూర్పు ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు డోనెట్స్ నదిపై ఉన్న మూడు బ్రిడ్జిలను కూల్చి ఉక్రెయిన్ బలాగాలను నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. పైగా లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటూ రష్యా బలగాలు నినాదాలు చేశాయి. ఈ తరుణంలో ఇవాళ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చేసింది. శత్రుదేశాన్ని మట్టికరిపించేలా మెదటి ప్రపంచ యుద్ధం తరహాలో ఆపరేషన్ చేపట్టింది. శత్రు దాడులనుంచి రక్షణకోసం ఏర్పాటు చేసుకునే కందకాలానే(దాడుల నుంచి రక్షణ కోసం భూమిలో ఏర్పాటు చేసుకునే ఇరుకైన గుంత) లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టాయి ఉక్రెయిన్ బలగాలు. ఈ మేరకు ఉక్రెయిన్ బలగాలు కందకంలో ఉంటున్న రష్యా బలగాలపై డ్రోన్లతో నేరుగా దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతం కావడంతో ఉక్రెయిన్ దళాలు జోష్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఊహించని ఈ దాడులతో రష్యా బలగాలు అతలాకుతలం అవుతున్నాయి. కింగ్ డేనియల్ పేరుతో 24వ మెకనైజ్డ్ బ్రిగేడ్ ఉక్రెయిన్ సైనికులు ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తాం అంటూ... 'స్లేవ్ ఉక్రెయిన్'(ఉక్రెయిన్ బానిస)... 'గ్లోరి టూ ఉక్రెయిన్' (ఉక్రెయిన్ కీర్తీ) వంటి నినాదాలతో దాడులు చేశారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడులకు తెగబడటంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. అతి చిన్న పోరుగు దేశం పై ఎందుకు యుద్ధం అన్నా వినలేదు. కానీ ఇప్పుడు ఆ చిన్నదేశం ఉక్రెయిన్‌తో ఊహించని ప్రతిఘటనను రష్యా ఎదుర్కొంటోంది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ వంటి ఆర్మీ అధికారుల నుంచి దిగ్గజ షూటర్ల వరకు పెద్ద సంఖ్యలో యుద్ధవీరులను కోల్పోయింది కూడా. ఈ మేరకు ఉక్రెయిన బలగాలు డ్రోన్లతో రష్యా కందకాలపై దాడుల నిర్వహిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 24th Mechanized Brigade dropping the VOG-17 grenade straight in the Russian trench pic.twitter.com/kRsudUj7px — ТРУХА⚡️English (@TpyxaNews) June 11, 2022 (చదవండి: ఇంత దారుణమేంటి పుతిన్.. స్పెషల్ బాడీగార్డుతో అలాంటి పనేంటి..?) -
మొదటి ప్రపంచ యుద్ధంజ్ఞాపకాల ప్రదర్శన ప్రారంభం
న్యూఢిల్లీ: సుమారు ఏడు లక్షల మంది భారత సైనికులు పాల్గొన్న మొదటి ప్రపంచయుద్ధంపై సోమవారం నగరంలో ప్రదర్శన ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగనున్న ఈ ప్రదర్శనను సాంస్కృతిక శాఖ కార్యదర్శి రవీందర్ సింగ్ ప్రారంభించారు. వందేళ్ల కిందట జరిగిన ఈ ప్రపంచ యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలతో పాటు భారత జవాన్లు ఉపయోగించిన యూనిఫాంలు, కోట్లు, ఫ్లాస్క్‌లు, మ్యాప్ కేస్లు, కత్తులు, సిగరెట్ ప్యాక్‌లు, బిస్కెట్లు ఇతర తినుబండారాలను ప్యాక్చేసిన కార్డ్‌బోర్డులు, ప్రథమ చికిత్స కిట్ బాక్స్‌లు, బ్యాడ్జీలు తదితర వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.. 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు, యుద్ధం ఎందువల్ల ప్రారంభమైంది.. అప్పుడు సైనికుల మానసిక స్థితి ఎలా ఉంది.. తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. త్వరలో ఈ ఎగ్జిబిషన్‌ను ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాల్లో ప్రదర్శించనున్నట్లు వివరించారు. కాగా, ఎగ్జిబిషన్లో ప్రదర్శించేందుకు యుద్ధం నాటి ఫొటోలను ఇంపీరియల్ వార్ మ్యూజియం, బ్రిటిష్ లైబ్రరీ, లండన్, ఫ్రెంచ్ మిలటరీ లైబ్రరీ, ఫ్లండర్స్ మ్యూజియం, బెల్జియం వంటి ప్రాంతాలనుంచి తెప్పించినట్లు సింగ్ చెప్పారు. అలాగే అప్పటి భారత సైనికులు యుద్ధ రంగంలో చిత్రీకరించిన నిశ్శబ్ద చిత్రాలు, సౌండ్రికార్డింగ్లను సైతం ఇందులో పొందుపరిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా 18వ సైనికుల రెజిమెంట్‌లో పనిచేసిన పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ యోగేందర్ సింగ్ యాదవ్ సహా పలువురు సైనికుల నుంచి వివరాలు సేకరించి రోలీబుక్స్ సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని సింగ్‌కు ఆ సంస్థకు చెందిన ప్రమోద్‌కుమార్ అందజేశారు. కాగా, ఈ ఎగ్జిబిషన్‌ను రోలీబుక్స్, ఫ్రెంచ్ ఎంబసీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కార్యక్రమంలో ఫ్రాన్స్ అంబాసిడర్ ఫ్రాంకోయిస్ పాల్గొన్నారు.