
గగనతల పోరాటంలో ఐదు, అంతకుమించిన సంఖ్యలో శత్రువుల యుద్ధ విమానాలను కూల్చి వేసిన పైలట్‌ను ‘ఫ్లయింగ్ ఏస్’ అంటారు. ‘ఫైటర్ ఏస్’, ‘ఎయిర్ ఏస్’ అని కూడా పేరు. సాధారణ భాషలో మొనగాళ్లకు మొనగాడైన యుద్ధవిమాన పైలట్ అని. మన దేశంలో అలాంటి తొలి మొనగాడే ఇంద్రలాల్ రాయ్. మొదటి ప్రపంచ యుద్ధంలో యు.కె. రాయల్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ సైనికుడిగా 170 గంటల నిడివిలో 10 శత్రు విమానాల్ని నేలకూల్చాడు రాయ్! రాయ్ 1889 డిసెంబర్ 2 కలకత్తాలో జన్మించాడు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. దేశ విభజనకు ముందు తూర్పు బెంగాల్లో వీళ్లది పేరున్న జమీందారీ వంశం.
మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఇంద్రలాల్ రాయ్ లండన్‌లోని సెయిట్ పాల్స్ స్కూల్‌లో చదువుతున్నాడు. రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్‌కి దరఖాస్తు చేసినప్పుడు రాయ్ కంటి చూపు తీక్షణంగా లేకపోవడంతో అతడిని నిరాకరించారు. అయితే అతడు కంటి స్పెషలిస్టు దగ్గర రెండో అభిప్రాయం తీసుకుని అతడి చూపు పదునుగా ఉందని చెప్పించడంతో అతడిని ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకున్నారు. 1917లో శిక్షణానంతరం నేరుగా వార్‌లోకి పంపించారు. పది ఫ్లయిట్‌లను పడగొట్టిన అనంతరం జరిగిన ‘డాగ్ ఫైట్’ (అతి సమీపాన్నుంచి శత్రువును డీకొనడం) ప్రాణాలు కోల్పోయాడు రాయ్. అలా 19 ఏళ్ల వయసుకే అమర సైనికుడు అయ్యాడు. నేడు ఇంద్రలాల్ రాయ్ వర్ధంతి. 1978 జూలై 22న అతడు వీర మరణం పొందాడు.
(చదవండి: బ్లాక్ అండ్ వైట్ నక్షత్రం)
Comments
Please login to add a commentAdd a comment