తైపీ: తైవాన్ తమ దేశంలో భాగమని అది ప్రత్యేకమైన దేశం కాదని చైనా మరోసారి స్పష్టం చేసింది. తాజాగా తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రి జోసఫ్ వూను భారత్‌కు చెందిన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన తైవాన్ స్వతంత్ర దేశం అని మాట్లాడారు.
దీంతో ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేయడంపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అభ్యంతరం తెలిపింది. భారత్ ‘వన్ చైనా’ అనే దౌత్య పాలసీని పాటిస్తోంది. తైవాన్ చైనాలో అంతర్భాగం అయినప్పుడు భారత మీడియా ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం సరికాదని చైనా ఎంబసీ పేర్కొంది.
అయితే చైనా ఎంబసీ అభ్యంతరంపై తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, తైవాన్‌లు రెండు స్వతంత్ర దేశాలని, తాము ఎవరి చేతిలో తోలు బొమ్మలం కాదని ఘాటుగా సమాధానమిచ్చింది. రెండు దేశాల్లో నియంతృత్వంలో పనిచేసే మీడియా కాకుండా స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉందని ఘాటుగా సమాధానమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment