న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగై రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోదీ ఇంటి పేరు వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఊరటనివ్వడంతో లాలూ రాహుల్ గాంధీని తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆహ్యానించారు. విందులో బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ తెప్పించి స్వయంగా తానే వండి వడ్డించారు.
రాహల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో అమలు కావాల్సిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన రాహుల్ గాంధీని లాలూ మొదట పుష్పగుచ్ఛమిచ్చి అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు రాజకేయాలు మాట్లాడుకుని తర్వాత ఇద్దరూ విందులో పాల్గొన్నారు. విందులో రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండటం విశేషం. లాలూ చేసిన ప్రత్యేక వంటకాన్ని రాహుల్ చాలా ఆస్వాదించారు. దీని కోసం లాలూ బీహార్ నుండి ప్రత్యేకంగా చంపారన్ దేశీయ మటన్ తెప్పించి బీహార్ స్టైల్లో దాన్ని తానే స్వయంగా వండారు.
రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు భారీ ఉపశమనం ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో తిరిగి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ప్రభుత్వంపై జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మోదీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే విధించింది.
आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi
— Congress (@INCIndia) August 4, 2023
ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
Comments
Please login to add a commentAdd a comment