రాంచీ: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. డుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో లాలూ పాత్ర ఉందని నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి శివ్‌పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతోపాటు మరో 18 మందిని దోషులుగా తేల్చారు. ఇక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ఈ నెల 21 నుంచి జడ్జి వాదనలు వింటారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment