బిహార్‌లో దారుణం.. 25 ఇళ్లకు పైగా నిప్పపెట్టిన దుండగులు | Miscreants Set House On Fire In Bihar Nawada | Sakshi
Sakshi News home page

బిహార్‌లో దారుణం.. 25 ఇళ్లకు పైగా నిప్పపెట్టిన దుండగులు

Published Thu, Sep 19 2024 8:14 AM | Last Updated on Thu, Sep 19 2024 10:00 AM

Miscreants Set House On Fire In Bihar Nawada

పట్నా: బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో దాదాపు 20-25 ఇళ్లకు గుర్తుతెలియని  దుండగులు నిప్పు పెట్టారు. దుండగులు  ముందు కాల్పులు జరిపి  తర్వాత ఇళ్లను తగులబెట్టారు. అయితే.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇళ్లలోని వస్తువులు పూర్తిగా కాలిబుడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  ప్రాథమికంగా భూమి సమస్యగా కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కనిపిస్తోందని పోలీసు ఉన్నతాధికారి సునీల్‌కుమార్ వెల్లడించారు.

 

ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘బీహార్‌లోని నవాడాలో అనేక మంది పేద దళితుల ఇళ్లను గూండాలు తగలబెట్టి, వారి జీవితాలను నాశనం చేశారు. ఈ సంఘటన చాలా బాధాకరం.  బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితుల పునరావాసానికి ఆర్థిక సహాయం అందించాలి’ అని పేర్కొన్నారు.


 చదవండి: One Nation One Election: ఆచరణ సాధ్యమేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement