Miscreants
-
లక్నోలో ఎన్కౌంటర్.. ఒక దుండగునికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పోలీసులకు, దుండగులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు గాయపడ్డాడు. ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్థరాత్రి తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు నిందితులు పోలీసులను చూసి, తమ బైక్‌లను వెనక్కుతిప్పి పారిపోయారు. దీంతో పోలీసు బృందం వారిని వెంబడించింది. ఆలంనగర్ రైల్వే లైన్ సమీపంలో నిందితుల్లో ఒకడు బైక్‌పై నుంచి జారి కిందపడిపోయాడు. వెంటనే అతను పిస్టల్ తీసి, పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్చాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.ఒక నిందితుని కాలికి బుల్లెట్ తగిలి గాయపడి, పోలీసులకు పట్టుబడ్డాడు. మరో బైక్‌పై వెళుతున్న నిందితులిద్దరినీ కూడా పోలీసులు వెంబడించి విజయవంతంగా పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పోలీసులు ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు, రెండు వినియోగించిన కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’ -
బిహార్‌లో దారుణం.. 25 ఇళ్లకు పైగా నిప్పపెట్టిన దుండగులు
పట్నా: బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో దాదాపు 20-25 ఇళ్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. దుండగులు ముందు కాల్పులు జరిపి తర్వాత ఇళ్లను తగులబెట్టారు. అయితే.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇళ్లలోని వస్తువులు పూర్తిగా కాలిబుడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమికంగా భూమి సమస్యగా కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కనిపిస్తోందని పోలీసు ఉన్నతాధికారి సునీల్‌కుమార్ వెల్లడించారు.#WATCH | Nawada, Bihar | Around 20-25 houses were set on fire by some miscreants in Krishnanagar under the Mufassil Police Station area. No casualties reported. Prima facie it seems to be a land issue: SDPO, Sadar Nawada, Sunil Kumar pic.twitter.com/aXET2wdH7m— ANI (@ANI) September 19, 2024 ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘బీహార్‌లోని నవాడాలో అనేక మంది పేద దళితుల ఇళ్లను గూండాలు తగలబెట్టి, వారి జీవితాలను నాశనం చేశారు. ఈ సంఘటన చాలా బాధాకరం. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితుల పునరావాసానికి ఆర్థిక సహాయం అందించాలి’ అని పేర్కొన్నారు.BSP chief Mayawati tweets "The incident of burning down many houses of poor Dalits in Bihar's Nawada by the goons and ruining their lives is extremely sad and serious. The government should take strict legal action against the culprits and also provide financial help for the… https://t.co/YvTo1IP4ko pic.twitter.com/UvEfPqH7jd— ANI (@ANI) September 19, 2024 చదవండి: One Nation One Election: ఆచరణ సాధ్యమేనా? -
పోకిరీల భయంతో రైలెక్కిన ఇద్దరు బాలికలు
యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్‌లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్‌లోని వారి ఇళ్లకు పంపించారు. -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్‌లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్‌తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్‌లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు) -
డబ్బులు జేబులో పెట్టుకొని సామాను సర్దుకోమన్నారు.. కిందకు వంగడంతో..
లింగాలఘణపురం (ములుగు): లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన కిరాణ వ్యాపారిని తనిఖీ చేస్తున్నట్లు చేసి రూ.2 లక్షలు మాయం చేసి ఉడాయించారు. ఈ ఘటన వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై జెర్సీ పాలకేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు కొడితాల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జెర్సీ పాలకేంద్రం సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో శేఖర్ బంధువు ప్లాటు కొనుగోలు చేయగా అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలతో పాటు కిరాణం సామాను కోసం మరో రూ.7వేలు తీసుకుని ఎక్సెల్ వాహనంపై జనగామకు బయలు దేరాడు. (చదవండి: వైరల్: యమ ‘స్పీడ్’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!) నెల్లుట్ల బైపాస్ నుంచి సదరు వెంచర్ వద్దకు వెళ్లేందుకు యశ్వంతాపూర్ సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద ఆగి బంధువుకు ఫోన్ చేశాడు. అతను కూడా వస్తున్నానని చెప్పడంతో వెంచర్ వద్దకు వెళ్తున్నాడు. అప్పటికే బస్టాప్ వద్ద బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందుకు వెళ్లి అడ్డంగా బైక్ ఆపారు. వెంటనే ఒకరు దిగి ఫోన్ తీసుకుని, ఎక్సెల్ తాళం చెవి తీసుకున్నాడు. పెట్రోల్ పంపులో ఎవరిని కలిశావు.. ఏదో ఇచ్చావంటూ బుకాయించారు. నేను బంక్‌లోకి వెళ్లలేదని, ఎవరిని కలువలేదని చెబుతుండగానే సంచిలో ఏం ఉన్నాయి బయటకు తీయాలని ఆదేశించారు. సంచి తీయగానే జేబులో ఏం ఉన్నాయని గద్దించారు. డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించగా డబ్బులు జేబులో పెట్టుకొని సంచిలో సామాను సర్దుకోమని చెప్పారు. వంగి సామాను సర్దుకుంటుండగానే జేబులోని డబ్బులు మాయం చేసి ఎక్సెల్ తాళం చెవితో బైక్‌పై పరారయ్యారు. సంచి సర్దుకుని జేబులో డబ్బులు చూసుకోగానే లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే తన బంధువు అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి సదరు వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేశారు. నిడిగొండ వరకు వెళ్లి రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిధి తమకు లేదని, జనగామకు వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ బాలాజీవరప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. (చదవండి: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి) -
నాలుగో కేసులోనూ లాలూ దోషే
-
నాలుగో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. డుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో లాలూ పాత్ర ఉందని నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి శివ్‌పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతోపాటు మరో 18 మందిని దోషులుగా తేల్చారు. ఇక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ఈ నెల 21 నుంచి జడ్జి వాదనలు వింటారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. -
దాణా కేసులో లాలూ దోషే
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. శనివారం మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. కిక్కిరిసిన కోర్టు గదిలో ప్రత్యేక న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ తీర్పును వెలువరిస్తూ.. బిహార్ మాజీ సీఎం లాలూ యాదవ్(69) సహా 16 మందిని దోషులుగా ప్రకటించారు. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొన్నారు. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991–94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది. తీర్పు అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఇతర నిందితుల్ని సీబీఐ కస్టడీలోకి తీసుకుని రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించింది. తీర్పుపై లాలూ స్పందిస్తూ తనను మండేలా, అంబేడ్కర్‌లతో పోల్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. ఉదయం నుంచి ఉత్కంఠ.. తీర్పు నేపథ్యంలో ఉదయం నుంచి సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. శనివారం తీర్పు వెలువరిస్తామని డిసెంబర్ 13నే కోర్టు చెప్పడంతో.. పెద్ద ఎత్తున లాలూ మద్దతుదారులు గుమిగూడడంతో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. లాలూతో పాటు బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తూ.. లాలూతో పాటు రాజకీయ నాయకులైన జగదీశ్ శర్మ, ఆర్కే రానా, ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, పూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్, ప్రభుత్వాధికారులు కృష్ణ కుమార్, సుబిర్ భట్టాచార్యల్ని దోషులుగా ప్రకటించారు. దాణా సరఫరా, రవాణాదారులు మోహన్ ప్రసాద్, సుశీల్ కుమార్ సిన్హ్, సునీల్ కుమార్ సిన్హ్, రాజా రాం జోషి, గోపీనాథ్ దాస్, సంజయ్ అగర్వాల్, జ్యోతీ కుమార్ ఝా, సునీల్ గాంధీల్ని కూడా దోషులుగా తేల్చారు. జగన్నాథ్ మిశ్రా , ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ ద్రువ్ భగత్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఏసీ చౌదరీ, దాణా సరఫరాదారులు సరస్వతీ చంద్ర, సాధనా సింగ్, మాజీ మంత్రి విద్యాసాగర్ నిషాద్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ చెప్పారు. న్యాయ పోరాటంతో పాటు.. రాజకీయంగానూ పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘ఒకే కేసులో కొందరిని విముక్తుల్ని చేయడం, మరికొందరికి జైలు శిక్ష విధించడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు’ అని మరో సీనియర్ నేత అబ్దుల్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. శిక్షాకాలం ప్రకటించాక పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలపై బీజేపీ దుష్ప్రచారం: లాలూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ఓట్ల కోసం.. ప్రతిపక్షాలపై ప్రజల అభిప్రాయాల్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ట్వీటర్లో లాలూ ఆరోపించారు. తీర్పు వెలువడిన తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘బలవంతులైన వ్యక్తులు, వర్గాలు ఎప్పడూ సమాజాన్ని పాలిత, పీడిత వర్గాలుగా విభజిస్తూనే ఉన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కింది స్థాయి వ్యక్తులు శిక్షకు గురవుతున్నారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి నేతలు.. వారి ప్రయత్నాల్లో విఫలమైతే చరిత్ర వారిని ప్రతినాయకులుగా పరిగణించి ఉండేది. పక్షపాతం, జాతివివక్ష, కులతత్వంతో నిండిన వ్యక్తులకు నేటికీ వారు ప్రతినాయకులే. వేరే విధంగా ఎవరూ ఆశించలేరు. పక్షపాతంతో కూడిన అసత్య ప్రచారంతో.. సత్యాన్ని అబద్ధంగా, అర్ధ సత్యంగా అనిపించేలా చేయవచ్చు. అయితే అంతిమంగా సత్యం గెలుస్తుంది. సత్యం చెప్పులు తొడుక్కునేలోపే అబద్ధం ప్రపంచాన్ని సగం చుట్టి రాగలదు.. చివరికి సత్యమే నిలుస్తుంది’ అని ట్వీట్లలో పేర్కొన్నారు. 1997లో 38 మందిపై చార్జిషీటు దాణా కుంభకోణం కేసులు వెలుగులోకి వచ్చాక 1996లో పట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. 1997, అక్టోబర్ 27న దేవ్‌గఢ్ ఖజానా కేసులో 38 మందిపై చార్జిషీటు దాఖలైంది. ఈ కేసులో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో ఉండగా 11 మంది మరణించగా.. ఇద్దరు తప్పు ఒప్పుకోవడంతో 2006–07లో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. పశువుల పేరిట నిధులు స్వాహా దాణా కుంభకోణం...1980, 90 దశకాల్లో ఉమ్మడి బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొత్తం రూ.950 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అంచనా. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, దాణా సరఫరాదారులు కుమ్మక్కై.. ఉనికిలో లేని కంపెనీల నుంచి దాణా కొనుగోలు పేరిట వందల కోట్లు స్వాహా చేశారనేది ప్రధాన అభియోగం. దాణా కుంభకోణం, దానితో ముడిపడ్డ ఇతర ఆరోపణలపై మొత్తం 64 కేసులు నమోదు కాగా, ఐదు కేసుల్లో లాలూప్రసాద్ నిందితుడిగా ఉన్నారు. దేవ్‌గఢ్ ఖజానా నుంచి నిధుల స్వాహా కేసులో తాజా తీర్పు వెలువడింది. కుంభకోణంలోని మిగతా కేసులు ఉమ్మడి బిహార్ రాష్ట్రంలోని చాయిబాసా జిల్లా ఖజానా నుంచి రూ.37.70 కోట్ల మొత్తాన్ని కాజేశారని ఒక కేసులో సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సెప్టెంబర్ 30, 2013న కోర్టు లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్షతో లాలూ లోక్‌సభ సభ్యత్వం రద్దవడంతో పాటు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో.. లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలు జైలులో ఉన్న లాలూకు 2013, డిసెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణంలో దుమ్కా ఖజానా నుంచి రూ. 3.97 కోట్లు, చాయ్‌బసా ఖజానా నుంచి రూ. 36 కోట్లు, దోరండ ఖజానా నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసిన కేసుల్ని కూడా లాలూ యాదవ్ ఎదుర్కొంటున్నారు. కుంభకోణం ఎలా బయటకొచ్చింది పెద్ద సంఖ్యలో పశువులున్నట్లుగా తప్పుడు రికార్డులు చూపి వాటి కోసం దాణా, మందులు, ఇతర పరికరాలను కొనుగోలు చేసినట్లు చూపారు. ఈ కుంభకోణం 1996లో వెలుగు చూసినా, 1980 దశకం, ఆ తర్వాత కూడా అక్రమాలు కొనసాగినట్లు గుర్తించారు. 1996లో ఆర్థికశాఖ కార్యదర్శి వీఎస్ దూబే ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకివచ్చాయి. 1993–96 మధ్య 40,500 కోళ్లు, 5,664 పందులు, 1,577 మేకలు, 995 గొర్రెల కొనుగోలుకు పశుసంవర్ధకశాఖకు రూ.10.5 కోట్లు కేటాయించారు. ఆ శాఖ మాత్రం ఖజానా నుంచి రూ.255.33 కోట్లు తీసుకుంది. వీటికి ఇతర ఖర్చులు కలిపి రూ.409.62 కోట్లు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ లెక్కల్ని బిహార్ ఆడిటర్ జనరల్ పరిశీలించి అవినీతి ఉన్నట్లు తేల్చారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో.. 1996లో పట్నా హైకోర్టు ఈ కేసును సీబీఐకు అప్పగించింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏకంగా ఏటీఎం మిషన్ నే ఎత్తుకెళ్లారు..
జైపూర్(రాజస్తాన్): ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన దుండగులు అది కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎం మెషిన్నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జైపూర్‌కు 60కిలో మీటర్ల దూరంలో ఉన్న బైన్స్వాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీకి యత్నించారు. అయితే వారికి ఏటీఎం నుంచి డబ్బులు తీయడం సాధ్యపడకపోవడంతో ఏకంగా రూ. 26.76 లక్షలు ఉన్న ఏటీఎం మెషిన్ని ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిందని తెలుసుకున్న సెక్యురిటీ గార్డు వెంటనే రాత్రి 2:30 సమయంలో సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఎస్సీ నగర్ వద్ద దారికాచిన దుండగలు అటుగా వస్తున్న దంపతులను చితకబాది వారి వద్ద నుంచి అందినకాడికి దోచుకున్నారు. దంపతుల వద్ద నుంచి 7 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు, బైక్ అపహరించుకు వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వనపర్తిలో బ్యాంక్ చోరీకి యత్నం
-
13 ఏళ్ల పాపకు నిప్పంటించిన దుండగులు
-
సంగారెడ్డిలో 13 ఏళ్ల పాపకు నిప్పంటించిన దుండగులు
మెదక్: జిల్లాలోని సంగారెడ్డిలో సోమవారం దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న స్వాతి అనే పాఠశాల విద్యార్ధిని కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో 80 శాతం గాయాలైన స్వాతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 13 ఏళ్లున్న స్వాతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన సంగారెడ్డిలోని హనుమాన్ నగర్ లో చోటు చేసుకుంది. స్వాతిపై దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.