
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్‌లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్‌తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్‌లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు.
(చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు)
Comments
Please login to add a commentAdd a comment